రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

Pulivendula: అలా జరిగితే పులివెందులకు ఉప ఎన్నిక వస్తుంది.. డిప్యూటీ స్పీకర్

Ap dsc notification AP DSC 2025 AP DSC official website AP DSC apply online 2025 AP DSC latest News Today https://cse.ap.gov.in/ cse.ap.gov.in AP TET
Peoples Motivation

Pulivendula: అలా జరిగితే పులివెందులకు ఉప ఎన్నిక వస్తుంది.. డిప్యూటీ స్పీకర్

• పులివెందుల ఎమ్మెల్యేగా జగన్ ఉన్నారని వెల్లడి..

• కానీ ఆయన అసెంబ్లీ సమావేశాలకు రావడంలేదని వివరణ..

• ఓ ఎమ్మెల్యే అనుమతి లేకుండా 60 రోజులు సభకు గైర్హాజరైతే అనర్హత వేటు పడుతుందని వెల్లడి..

• జగన్ ఈసారి అసెంబ్లీకి రాకపోతే అనర్హతకు గురవుతాడని వ్యాఖ్యలు..

Raghuram krishnam raju

ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పులివెందులకు ఉప ఎన్నిక వచ్చే పరిస్థితులు ఉన్నాయని అన్నారు. అది ఎలాగో ఆయన వివరించారు. 

ప్రస్తుతం పులివెందుల ఎమ్మెల్యేగా జగన్ ఉన్నారని, ఆయన అసెంబ్లీ సమావేశాలకు రావడంలేదని వెల్లడించారు. ఓ ఎమ్మెల్యే ముందస్తు సెలవు కోరకుండా 60 రోజుల పాటు అసెంబ్లీకి రాకుండా ఉంటే... ఆ ఎమ్మెల్యేపై అనర్హత వేటు పడుతుందని రఘురామ తెలిపారు. ఈసారి గనుక జగన్ అసెంబ్లీకి రాకపోతే పులివెందులకు ఉప ఎన్నిక రావడం తథ్యమని అన్నారు. 

అయితే, జగన్ అసెంబ్లీ సమావేశాలకు రావాలని, తన గళం వినిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని రఘురామ స్పష్టం చేశారు. ఇవాళ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ రఘురామ ఈ వ్యాఖ్యలు చేశారు.

Comments

-Advertisement-