రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

Pgcet: తెలంగాణ లా సెట్, పీజీ సెట్ తేదీలు ఇవే!

tg lawcet pglcet tgecet schedule release Higher Education cets notifications TG EDCET SCHEDULE TG PECET SCHEDULE TG EAPCET SCHEDULE TG ICET SCHEDULE
Peoples Motivation

Pgcet: తెలంగాణ లా సెట్, పీజీ సెట్ తేదీలు ఇవే!

• టీజీ లాసెట్, పీజీ ఎల్‌సెట్, ఈసెట్ షెడ్యుల్ విడుదల చేసిన ఉన్నత విద్యామండలి..

• మే 12న టీజీ ఈసెట్ ప్రవేశ పరీక్ష..

• జూన్ 6న టీజీ లాసెట్, పీజీ ఎల్‌సెట్ ప్రవేశ పరీక్ష..

Higher Education cets notifications TG EDCET SCHEDULE TG PECET SCHEDULE TG EAPCET SCHEDULE TG ICET SCHEDULE TG PGCET SCHEDULE TG LAWCET SCHEDULE

2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి లా కోర్సుల్లో ప్రవేశాలకు తెలంగాణ ఉన్నత విద్యామండలి శనివారం షెడ్యూల్ విడుదల చేసింది. లాసెట్‌కు మార్చి 1 నుంచి, ఈసెట్‌కు మార్చి 3 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుంది.

ఇంటర్ విద్యార్హతపై ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ, డిగ్రీ విద్యార్హతపై మూడేళ్ల ఎల్ఎల్‌బీ, ఎల్ఎల్‌బీ పూర్తయిన వారికి రెండేళ్ల ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశానికి లాసెట్ నిర్వహిస్తారు. ఈసారి పీజీ లాసెట్ ప్రవేశ పరీక్షల్లో సిలబస్‌ను స్వల్పంగా మార్పు చేశారు. పాలిటెక్నిక్ డిప్లొమా, బీఎస్సీ (గణితం) పూర్తి చేసిన వారు లేటరల్ ఎంట్రీ ద్వారా బీటెక్, బీ ఫార్మసీ కోర్సుల్లో నేరుగా రెండో ఏడాదిలో చేరేందుకు ఈసెట్ నిర్వహిస్తారు.

ప్రవేశ పరీక్షల దరఖాస్తు షెడ్యూల్ ఇలా..

టీజీ లాసెట్, పీజీ ఎల్‌సెట్ నోటిఫికేషన్- ఫిబ్రవరి 25 

ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం- మార్చి 1 

దరఖాస్తుల చివరి తేదీ- ఏప్రిల్ 15 

అలస్య రుసుముతో- మే 25 

పరీక్ష తేదీ: జూన్ 6 


టీజీ ఈసెట్ షెడ్యూల్ ఇలా..

టీజీ ఈసెట్ షెడ్యూల్ నోటిఫికేషన్- ఫిబ్రవరి 25 

ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం- మార్చి 3

ఆన్‌లైన్ దరఖాస్తుల చివరి తేదీ- ఏప్రిల్ 19 

పరీక్ష తేదీ: మే 12

Comments

-Advertisement-