INDIAN NAVY: ఇండియన్ నేవీలో ఉద్యోగాలు.. పోస్టుల వివరాలు
INDIAN NAVY: ఇండియన్ నేవీలో ఉద్యోగాలు.. పోస్టుల వివరాలు
• ఇండియన్ నావల్ అకాడమిలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..
• అర్హత, వయోపరిమితి, దరఖాస్తువిధానం, చివరి తేదీ తదితర వివరాలు..
ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న నిరుద్యోగ అభ్యర్థులకు గుడ్న్యూస్. కేరళలోని ఇండియన్ నావల్ అకాడమి(ఐఎన్ఏ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకీ అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. పోస్టుల సంఖ్య, విభాగాలు, అర్హత, అప్లికేషన్ విధానం మిగతా వివరాలు..
ముఖ్యమైన సమాచారం
ఏ విభాగంలో ఎన్ని పోస్టులు ఉన్నాయంటే
1. ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ : 60 పోస్టులు
2. పైలట్ : 26 పోస్టులు
3. నావల్ ఎయిర్ ఆపరేషన్స్ ఆఫీసర్ : 22 పోస్టులు
4. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ : 18 ఉద్యోగాలు
5. లాజిస్టిక్స్ : 28 పోస్టులు
6. ఎడ్యుకేషన్ : 15 పోస్టులు
7. ఇంజినీరింగ్ బ్రాంచ్ : 38 ఉద్యోగాలు
8. ఎలక్ట్రికల్ బ్రాంచ్ : 45 పోస్టులు
9. నావల్ కన్‌స్ట్రక్టర్ : 18 పోస్టులు
మొత్తం ఖాళీల సంఖ్య : 270 పోస్టులు
ఫిబ్రవరి 25వ తేదీ వరకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు.
విద్యా అర్హతలు:
పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ(బీఎస్సీ, బీకామ్), పోస్ట్ గ్రాడ్యుయేషన్(ఎంసీఏ, ఎంఎస్సీ), బీఈ, బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
జీతం:
ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ.1,10,000 వరకు జీతభత్యాలు ఉంటాయి.
దరఖాస్తు ప్రక్రియ:
ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు
దరఖాస్తు ప్రారంభ తేదీ:
08-02-2025వ తేదీ నుంచి దరఖాస్తులను స్వీకరిస్తారు.
దరఖాస్తు చివరి తేదీ:
ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తు చేసుకునేందుకు చివరితేదీ 25-02-2025