రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

Gold Rates: రికార్డు మార్క్.. రూ. 85 వేలు దాటేసిన బంగారం ధర

Gold rates telugu gold rates near nandyala, today gold rate (22 carat) 1 gram gold rate today Today gold rates in kurnool Gold rates in proddatur news
Peoples Motivation

Gold Rates: రికార్డు మార్క్.. రూ. 85 వేలు దాటేసిన బంగారం ధర

• అంతర్జాతీయ మార్కెట్లో అనిశ్చితి కారణంగా ధరల్లో పెరుగుదల..

• నిన్న ఒక్క రోజే 10 గ్రాముల పసిడిపై రూ. 400 పెరుగుదల..

• కిలో వెండిపై రూ. 300 పెరిగి రూ. 96 వేలకు చేరిక..

• బలహీనంగా ట్రేడవుతున్న రూపాయి..

Gold rates telugu gold rates near nandyala, today gold rate (22 carat) 1 gram gold rate today Today gold rates in kurnool Gold rates in proddatur news

అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి, రూపాయి విలువ క్షీణించడం వంటి కారణాలతో బంగారం ధరల పరుగు కొనసాగుతోంది. నిన్న ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల మేలిమి (99.9 స్వచ్ఛత) బంగారం ధర రూ. 400 పెరిగి రూ. 85,300కు ఎగబాకింది. 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధర కూడా రూ. 400 పెరిగి రూ. 84,900కు చేరుకుంది. 

మరోవైపు, వెండి ధర కూడా కిలోకు రూ.300 లాభపడి రూ. 96 వేలకు చేరుకుంది. ఎంసీఎక్స్ ఫ్యూచర్ మార్కెట్లో ఏప్రిల్ నెల బంగారం కాంట్రాక్టుల ధర 10 గ్రాములకు రూ. 461 పెరిగి రూ. 82,765కు పెరగ్గా, కామెక్స్ గోల్డ్ ఫ్యూచర్స్ మాత్రం ఔన్సుకు 7.5 డాలర్ల మేర క్షీణించి 2,827 డాలర్లుగా నమోదైంది.

• హైదరాబాద్లో పది గ్రాముల బంగారం ధర రూ.85,855గా ఉంది. కిలో వెండి ధర రూ.96,450గా ఉంది.

• విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.85,855గా ఉంది. కిలో వెండి ధర రూ.96,450గా ఉంది.

• విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.85,855గా ఉంది. కిలో వెండి ధర రూ.96,450గా ఉంది.

• ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.85,855గా ఉంది. కిలో వెండి ధర రూ.96,450గా ఉంది.

కెనడా, మెక్సికో, చైనాపై అమెరికా టారిఫ్ విధింపు మన రూపాయిపై ప్రతికూల ప్రభావం చూపింది. అమెరికా చర్యలు వాణిజ్య యుద్ధానికి దారితీసిన నేపథ్యంలో అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి విలువ 49 పైసలు క్షీణించింది. ఫలితంగా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 87.11గా నమోదైంది. అమెరికా డాలరు బలంగా ఉండటం, విదేశీ పెట్టుబడులు తరలిపోతుండటం వంటి అంశాల కారణంగా రూపాయి బలహీనంగా ట్రేడయ్యే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Comments

-Advertisement-