Drugs Vaddu Bro: మాదక ద్రవ్యాలకు బానిసై బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు
Drugs Vaddu Bro: మాదక ద్రవ్యాలకు బానిసై బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు
👉హెల్మెట్ రక్షణ కవచం.. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి విలువైన ప్రాణాలను కాపాడుకోవాలి: ప్రకాశం జిల్లా ఎస్పీ ఏ ఆర్ దామోదర్
క్యాన్సర్, మత్తు పదార్థాల నియంత్రణ పై రైజ్ కృష్ణసాయి ఇంజినీరింగ్ కళాశాల, టెక్ బుల్ సంయుక్త ఆధ్వ ర్యంలో ఆదివారం ఉదయం నిర్వహించిన మారథాన్ 5 KM రన్ – 2025 ను ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ముఖ్య అతిధి గా పాల్గొన్ని ఒంగోలు మినీ స్టేడియం వద్ద 5 KM రన్ ప్రారంభించారు. ఈ 5 KM రన్ లో యువత మరియు ప్రజలు ఉల్లాసంగా పాల్గొన్నారు. ఈ పరుగు మినీ స్టేడియం నుండి ప్రారంభమై మిరియాల పాలెం వద్ద యూ టర్న్ తీసుకోని తిరిగి మినీ స్టేడియం వద్ద ముగిసింది. ఈ పరుగులో విజేతలుగా నిలిచిన పురుషులు మరియు మహిళలు మొదటి బహుమతి -20,000/-, రెండవ బహుమతి -15,000/-, మరియు తృతీయ బహుమతి -10,000/- లను జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ఐఏయస్, జిల్లా ఎస్పీ A R దామోదర్, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్, సంతనూతలపాడు ఎమ్మెల్యే బి యన్ విజయకుమార్ అందచేశారు. రైజ్ కాలేజీ MD భరత్, టెక్ బెల్స్ చైర్మన్ భాస్కర్ రెడ్డి, రైజ్ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ శిద్ధా హనుమంతరావు మరియు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా మాట్లాడుతూ ప్రకాశం జిల్లా ఎస్పీ ఏ ఆర్ దామోదర్ మాట్లాడుతూ నిషేధిత మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలని, మాదకద్రవ్యాల మత్తులో జీవితాలు పాడుచేసుకోవద్దని, డ్రగ్స్, గంజాయి మరియు తదితర మాదకద్రవ్యాలకు బానిసలై కొంత మంది యువత తమ భవిష్యత్‌ను నాశనం చేసుకుంటున్నారని, క్షణకాలం సంతోషం కోసం నూరేళ్ల జీవితంలోని వెలుగును దూరం చేసుకోవద్దన్నారు. యువత ఆరోగ్యవంతమైన జీవనాన్ని అలవాటు చేసుకోని బంగారు జీవితాన్ని నిర్మించుకోవాలని సూచించారు. విద్యార్థులు కూడా తమ తల్లిదండ్రుల కష్టాలు గుర్తుపెట్టుకుని క్రమశిక్షణతో చదువుకుంటూ జిల్లాకు మంచిపేరు తీసుకురావాలన్నారు. డ్రగ్స్ వద్దు బ్రో అన్నారు. అక్రమంగా మాదకద్రవ్యాలు విక్రయిస్తే క్రిమినల్ కేసులు, కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
క్యాన్సర్, వ్యాధి నిర్మూలన కొరకు ప్రజలందరూ అవగాహన కలిగి ఉండి, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని తెలియచేసినారు. క్యాన్సర్ ముఖ్యంగా ఆహారపు అలవాట్లు, జీవన విధానంలో మార్పుల వల్ల, మద్యపానం సేవించడం వలన, పొగాకు సంబంధిత ఉత్పత్తులను తినడం వలన ఎక్కువ శాతం మంది క్యాన్సర్ బారిన పడుతున్నారని, మహిళలు ఎక్కువగా బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడుతున్నారని, ముందస్తు అవగాహనతో క్యాన్సర్ వ్యాధి రాకుండా జాగ్రత్త పడవచ్చునని, క్యాన్సర్ తొలినాళ్లలో గుర్తించి తగు చికిత్స తీసుకుంటే సులువుగా కాన్సర్ ను జయించ వచ్చునని మరియు తగు జాగ్రత్తలు పాటించి పౌష్టికాహారం తీసుకుంటూ వ్యాయామాలను ఆచరించాలన్నారు.
ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ప్రాణాలకు రక్షణ కవచం లాంటిదని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్లు ధరించాలని, హెల్మెట్ ధరించి బైక్ లపై ప్రయాణించడం వల్ల ప్రమాదాలలోని మరణాలను తప్పించవచ్చన్నారు. టూ వీలర్ ప్రమాదాల నియంత్రణకు హెల్మెట్ పై అవగాహాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఎంతోమంది యువత రోడ్డు ప్రమాదాల బారిన పది ప్రాణాలు పోగొట్టుకుని వారి కుటుంబాలకు జీవితాంతం తీరని శోకం కలిగిస్తున్నారన్నారు. రోడ్డు భద్రత నిబంధనలు పోలీసుల కోసం కాదని ప్రజల కోసమే అని విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని, ప్రాణాలు విలువైనవని గుర్తుపెట్టుకోవాలన్నారు.
ఈ రన్ లో పాల్గొన్న యువతి, యువకులు ప్రజలకు క్యాన్సర్, మత్తు పదార్థాల నియంత్రణ, హెల్మెట్ పై అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ (ఎస్పీ అడ్మిన్) కె.నాగేశ్వరరావు, ఒంగోలు డిఎస్పీ ఆర్. శ్రీనివాసరావు, ఎఆర్ డిఎస్పీ శ్రీనివాసరావు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర, ఒంగోలు వన్ టౌన్ సిఐ నాగరాజు, టు టౌన్ సిఐ శ్రీనివాసరావు, రూరల్ సీఐ శ్రీకాంత్, తాలూకా సిఐ అజయ్ కుమార్, ట్రాఫిక్ సీఐ పాండు రంగారావు, ఆర్ఐ రమణ రెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు.