ఇంటర్మీడియట్ హాల్ టికెట్లు విడుదల
ఇంటర్మీడియట్ హాల్ టికెట్లు విడుదల
ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర MPC మరియు BiPC విద్యార్థులకు వారి ప్రాక్టికల్ హాల్ టికెట్లు సదరు కాలేజీ లాగిన్‌లో మరియు https://bie.ap.gov.in వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచడమైనది. విద్యార్థులు తమ గత హాల్ టికెట్ నంబర్ లేదా IPE మార్చి 2025 హాల్ టికెట్ నంబర్ లేదా ఆధార్ నంబర్ మరియు పుట్టిన తేదీని సమర్పించడం ద్వారా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మన మిత్ర, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాట్సాప్ నంబర్ 9552300009 ద్వారా కూడా విద్యా సేవల ఎంపికను ఎంచుకొని, గత హాల్ టికెట్ నంబర్ లేదా IPE మార్చి 2025 హాల్ టికెట్ నంబర్ లేదా ఆధార్ నంబర్ మరియు పుట్టిన తేదీని నమోదు చేయడం ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఇప్పటికే వాట్సప్ గవర్నెన్స్ ద్వారా 161 సేవలను అందిస్తున్న విషయం తెలిసిందే. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం కలిపి 10 లక్షలకు పైగా విద్యార్థులు ఉన్నారు. వాట్సప్ నంబరు 95523 00009 ద్వారా వారంతా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. త్వరలో పదో తరగతి విద్యార్థులకు సైతం ఇలాంటి అవకాశం కల్పించాలని విద్యాశాఖ భావిస్తోంది. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి, వాటిని ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యాలయానికి అనుసం ధానం చేయనున్నారు. ఈ నెల 10 నుంచి 20 వరకు ప్రాక్టికల్ పరీక్షలు జరగనున్నాయి.
ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షల టైం టేబుల్
• మార్చి 1వ తేదీన సెకండ్ లాంగ్వేజీ పేపర్ -1
• మార్చి 4వ తేదీన ఇంగ్లీష్ పేపర్ -1
• మార్చి 6వ తేదీన మేథమెటిక్స్ పేపర్ -1A, బోటానీ పేపర్-1, సివిక్స్ పేపర్-1
• మార్చి 8వ తేదీన మేథమెటిక్స్ పేపర్ -1B, జువాలజీ పేపర్-1, హిస్టరీ పేపర్-1
• మార్చి 11వ తేదీన ఫిజిక్స్ పేపర్-1, ఎకానమిక్స్ పేపర్-1
• మార్చి 13వ తేదీన కెమిస్ట్రీ పేపర్-1, సోషియాలజీ పేపర్-1, కామర్స్ పేపర్-1, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ పేపర్-1
• మార్చి 17వ తేదీన పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-1, లాజిక్ పేపర్1, బ్రిడ్జ్ కోర్స్ మేథమెటిక్స్ పేపర్ -1 (బైపీసీ విద్యార్థులకు)
• మార్చి 19వ తేదీన మోడరన్ లాంగ్వేజ్ పేపర్ 1, జాగ్రఫీ పేపర్ 1 పరీక్షలు జరగనున్నాయి.
ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షల టైం టేబుల్
• మార్చి 3వ తేదీన సెకండ్ లాంగ్వేజ్ పేపర్ -2
• మార్చి 5వ తేదీన ఇంగ్లీష్ పేపర్ -2
• మార్చి 7వ తేదీన మేథమెటిక్స్ పేపర్ -2A, బోటనీ పేపర్-2, సివిక్స్ పేపర్-2
• మార్చి 10వ తేదీన మేథమెటిక్స్ పేపర్ -2B, జువాలజీ పేపర్-2, హిస్టరీ పేపర్-2
• మార్చి 12వ తేదీన ఫిజిక్స్ పేపర్-2, ఎకానమిక్స్ పేపర్-2
• మార్చి 15వ తేదీన కెమిస్ట్రీ పేపర్-2, కామర్స్ పేపర్ 2, సోషియాలజీ పేపర్ 2, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ పేపర్2
• మార్చి 18వ తేదీన పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-2, లాజిక్ పేపర్2, బ్రిడ్జ్ కోర్స్ మేథమెటిక్స్ పేపర్ -2(బైపీసీ విద్యార్థులకు)
• మార్చి 20వ తేదీన మోడరన్ లాంగ్వేజ్ పేపర్ 2, జాగ్రఫీ పేపర్ 2 పరీక్షలు జరగనున్నాయి.