వాట్సాప్ ద్వారా ఏపీ లో ఇంటర్ హాల్ టికెట్లు
BIEAP hall tickets 2025
bie.ap.gov.in results
BIEAP marks Memo
BIEAP gov in hall tickets 2025
BIE AP gov in 2025 Hall tickets
https://bieap.apcfss.in
By
Peoples Motivation
వాట్సాప్ ద్వారా ఏపీ లో ఇంటర్ హాల్ టికెట్లు
• 95523 00009 వాట్సప్ ద్వారా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు..
• వాట్సప్ గవర్నెన్స్ ద్వారా 161 సేవలను అందిస్తున్న ప్రభుత్వం..
• ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం కలిపి 10 లక్షలకు పైగా విద్యార్థులకు అవకాశం..
• త్వరలో పదో తరగతి విద్యార్థులకు సైతం వాట్సప్ ద్వారా అవకాశం..
ప్రభుత్వం ఇంటర్మీడియట్ పరీక్షల హాల్ టికెట్లను వాట్సప్ గవర్నెన్స్ లో అందించేందుకు నిర్ణయించింది. విద్యార్థులు వాట్సప్ ద్వారా శుక్రవారం నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకునే సదుపాయం కల్పించింది. ఫీజులు చెల్లించలేదని ప్రైవేటు కళాశాలల హాల్ టికెట్లు ఆపేయడం వంటి ఘటనలు లేకుండా ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే వాట్సప్ గవర్నెన్స్ ద్వారా 161 సేవలను అందిస్తున్న విషయం తెలిసిందే. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం కలిపి 10 లక్షలకు పైగా విద్యార్థులు ఉన్నారు. వాట్సప్ నంబరు 95523 00009 ద్వారా వారంతా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. త్వరలో పదో తరగతి విద్యార్థులకు సైతం ఇలాంటి అవకాశం కల్పించాలని విద్యాశాఖ భావిస్తోంది. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి, వాటిని ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యాలయానికి అనుసం ధానం చేయనున్నారు. ఈ నెల 10 నుంచి 20 వరకు ప్రాక్టికల్ పరీక్షలు జరగనున్నాయి.
ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షల టైం టేబుల్
• మార్చి 1వ తేదీన సెకండ్ లాంగ్వేజీ పేపర్ -1• మార్చి 4వ తేదీన ఇంగ్లీష్ పేపర్ -1• మార్చి 6వ తేదీన మేథమెటిక్స్ పేపర్ -1A, బోటానీ పేపర్-1, సివిక్స్ పేపర్-1• మార్చి 8వ తేదీన మేథమెటిక్స్ పేపర్ -1B, జువాలజీ పేపర్-1, హిస్టరీ పేపర్-1• మార్చి 11వ తేదీన ఫిజిక్స్ పేపర్-1, ఎకానమిక్స్ పేపర్-1• మార్చి 13వ తేదీన కెమిస్ట్రీ పేపర్-1, సోషియాలజీ పేపర్-1, కామర్స్ పేపర్-1, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ పేపర్-1• మార్చి 17వ తేదీన పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-1, లాజిక్ పేపర్1, బ్రిడ్జ్ కోర్స్ మేథమెటిక్స్ పేపర్ -1 (బైపీసీ విద్యార్థులకు)• మార్చి 19వ తేదీన మోడరన్ లాంగ్వేజ్ పేపర్ 1, జాగ్రఫీ పేపర్ 1 పరీక్షలు జరగనున్నాయి.
ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షల టైం టేబుల్
• మార్చి 3వ తేదీన సెకండ్ లాంగ్వేజ్ పేపర్ -2• మార్చి 5వ తేదీన ఇంగ్లీష్ పేపర్ -2• మార్చి 7వ తేదీన మేథమెటిక్స్ పేపర్ -2A, బోటనీ పేపర్-2, సివిక్స్ పేపర్-2• మార్చి 10వ తేదీన మేథమెటిక్స్ పేపర్ -2B, జువాలజీ పేపర్-2, హిస్టరీ పేపర్-2• మార్చి 12వ తేదీన ఫిజిక్స్ పేపర్-2, ఎకానమిక్స్ పేపర్-2• మార్చి 15వ తేదీన కెమిస్ట్రీ పేపర్-2, కామర్స్ పేపర్ 2, సోషియాలజీ పేపర్ 2, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ పేపర్2• మార్చి 18వ తేదీన పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-2, లాజిక్ పేపర్2, బ్రిడ్జ్ కోర్స్ మేథమెటిక్స్ పేపర్ -2(బైపీసీ విద్యార్థులకు)• మార్చి 20వ తేదీన మోడరన్ లాంగ్వేజ్ పేపర్ 2, జాగ్రఫీ పేపర్ 2 పరీక్షలు జరగనున్నాయి.
Comments