రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

అసంఘటిత రంగ కార్మికులందరినీ ఇ-శ్రమ్ పోర్టల్లో రిజిష్టర్ చేయించండి

trending post trendingnews viralposts viral news trendingnow trendingfashion trendingtopic trendings intresting facts Intersting news Viral news facts
Peoples Motivation

అసంఘటిత రంగ కార్మికులందరినీ ఇ-శ్రమ్ పోర్టల్లో రిజిష్టర్ చేయించండి

• కోటి 50 లక్షల మందిని చేర్చాలని లక్ష్యం కాగా ఇప్పటికే 81 లక్షలు రిజిష్టర్

• ఇ-శ్రమ్ పోర్టల్ ఇంటిగ్రేషన్లో మొదటి స్థానంలో నిలిచిన ఎపి 

• జిల్లాలు,శాఖలు వారిగా లక్ష్యాలు నిర్దేశించి నూరు శాతం రిజిష్టర్ చేయాలి

• జిల్లా కలక్టర్ నేతృత్వంలోని జిల్లా స్థాయి మానిటరింగ్ కమిటీలు దృష్టి సారించాలి

• ఇ-శ్రమ్ ప్రయోజనాలపై పెద్దఎత్తున అవగాహన కల్పించాలి

-ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్

CS K VIJAYANANDH IAS

అమరావతి, (పీపుల్స్ మోటివేషన్):- రాష్ట్రంలో అంసఘటిత రంగంలో పనిచేసే కార్మికులందరినీ ఇ-శ్రమ్ పోర్టల్లో రిజిష్టర్ చేయించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ అధికారులను ఆదేశించారు.ఈమేరకు బుధవారం రాష్ట్ర సచివాలయంలో ఇ-శ్రమ్ పోర్టల్ కు సంబంధించి రాష్ట్ర స్థాయి మానిటరింగ్ కమిటీ సమావేశం ఆయన అధ్యక్షతన జరిగింది.ఈసందర్భంగా సిఎస్ మాట్లాడుతూ రాష్ట్రంలో అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కోటి 50 లక్షల మందిని ఇ-శ్రమ్ పోర్టల్లో రిజిష్టర్ చేయించాలని లక్ష్యం కాగా ఇప్పటికే 81 లక్షల 52 వేల మందిని రిజిష్టర్ చేశారని మిగతా వారిని కూడా వేగవంతంగా రిజిష్టర్ చేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. దేశంలో ఇ-శ్రమ్ పోర్టల్ ఇంటిగ్రేషన్ చేసిన రాష్ట్రాల్లో ఎపి మొదటి స్థానంలో నిలిచిందన్నారు. ఇ-శ్రమ్ పోర్టల్లో రిజిష్ట్రేన్ కు జిల్లాల వారీగా,శాఖల వారీగా లక్ష్యాలు నిర్ధేశించాలని,జిల్లా కలక్టర్ నేతృత్వంలోని జిల్లా స్థాయి మానిటరింగ్ కమిటీల సమావేశాలు నిర్వహించి త్వరితగతిని రిజిష్టర్ చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.అంతేగాక ఇ-శ్రమ్ పోర్టల్లో రిజిష్టర్ కావడం వల్ల కలిగే ప్రయోజనాలపై అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికుల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని కార్మిక తదితర శాఖల అధికారులను సిఎస్ విజయానంద్ ఆదేశించారు.

దేశంలో అధిక శాతం మంది భవన నిర్మాణం వంటి అసంఘటిత రంగాల్లో పని చేస్తున్నారని వీరికి పిఎఫ్,ఇన్సూరెన్స్ వంటి సౌకర్యాలు ఉండవని అంతేగాక వృద్ధాప్యంలో ఎదురయ్యే ఆర్థిక సవాళ్లను అధికగమించేందుకు అలాంటి శ్రమ జీవుల భవిష్యత్ భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పధకమే ఇ-శ్రమ్ పోర్టల్ అని సిఎస్ విజయానంద్ పేర్కొన్నారు. కేవలం ఇన్యూరెన్స్ మాత్రమే కాకుండా వారి పిల్లలకు ఉచిత సైకిళ్లు,పనిముట్లు,కుట్టు మిషన్లు వంటి ఇతర ఆర్థిక సహాయాలు ఈ పథకం కింద అందుకోవచ్చని తెలిపారు.కార్మిక శాఖ ఆధ్వర్యంలో జరిగే ఈ పథకంలో చేరేందుకు 16 నుంచి 59 ఏళ్ల వయస్సున్న వ్యక్తులు అర్హులేనని చెప్పారు.ఇ-శ్రమ్ పోర్టల్‌లో చేరిన కార్మికులు ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన (PMSBY) కింద రూ.2 లక్షల వరకు బీమా ప్రయోజనం పొందుతారని బీమా కోసం ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.కార్మికుడు ప్రమాదంలో మరణిస్తే 2లక్షల రూ.ల బీమా లభిస్తుందని లేదా పూర్తిగా అంగవైకల్యం చెందితే పాక్షిక వైకల్యానికి రూ.1 లక్ష బీమా లభిస్తుందని సిఎస్ విజయానంద్ తెలిపారు.

 ఈసమావేశంలో రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణి ప్రసాద్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఇ-శ్రమ్ పోర్టల్ గురుంచి వివరిస్తూ అసంఘటిత రంగంలో పని చేసే అనగా వలస కార్మికులు,భవన నిర్మాణ కార్మికులు,చిన్న చిన్న వ్యాపారాలు చేసేవారు తదితరులంతా ఈపోర్టల్ రో రిజిష్టర్ కావచ్చని అన్నారు.నేడు 90 శాతం మంది కార్మికులు అసంఘటిత రంగంలోనే పనిచేస్తున్నారని చెప్పారు.జిల్లాలు,సెక్టార్ల వారీగా అసంఘటిత కార్మికుల డేటా అందుబాటులో ఉందని ఆడేటాను ఉపయోగించుకుని ఇ-శ్రమ్ పోర్టల్లో నమోదుకు చర్యలు తీసుకోవాలన చెప్పారు.ఇ-శ్రమ్ పోర్టల్‌లో నమోదు చేసుకోవడానికి, మొబైల్ నంబర్ ఆధార్ కార్డ్‌కి లింక్ చేసిన ఆధార్ కార్డు,నామినీ ఆధార్ కార్డు,బ్యాంకు ఖాతా పత్రం అవసరమని అన్నారు.

 ఈసమావేశంలో కార్మిక ఉపాధి కల్పన శాఖ అదనపు కార్యదర్శి గంధం చంద్రుడు, ఆశాఖ కమీషనర్ శేషగిరి బాబు,మెప్మా ఎండి తేజ్ భరత్ ఇతర అధికారులు పాల్గొన్నారు.

Comments

-Advertisement-