ఉక్కు పరిశ్రమ వల్ల ఎపి యువతకు పెద్దఎత్తున ఉద్యోగావకాశాలు
trending post trendingnews viralposts viral news trendingnow trendingfashion trendingtopic trendings intresting facts
Intersting news
Viral news facts
By
Peoples Motivation
ఉక్కు పరిశ్రమ వల్ల ఎపి యువతకు పెద్దఎత్తున ఉద్యోగావకాశాలు
కేంద్రమంత్రి కుమారస్వామికి లోకేష్ కృతజ్ఞతలు
దేవగౌడ ఆశీస్సులు తీసుకున్న లోకేష్
న్యూడిల్లీ: కేంద్ర భారీపరిశ్రమల మంత్రి హెచ్ డి కుమారస్వామిని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ డిల్లీలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అక్కడే ఉన్న మాజీ ప్రధాని దేవ గౌడను కలిసి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుజ్జీవనానికి సుమారు రూ.12వేల కోట్ల రూపాయలు నిధులు విడుదల చేసినందుకు కుమారస్వామికి లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు. ఎపి ప్రజల సెంటిమెంట్ తో పాటు వేలాదిమంది కార్మికుల ఆందోళన, మనోభావాలను అర్థం చేసుకుని పెద్దమనసుతో సహకారం అందించారని కొనియాడారు. స్టీల్ ప్లాంట్ ను సందర్శించి అక్కడి పరిస్థితులను అధ్యయనం చేయడం, ఉత్పాదతకు పెంపుదలకు చర్యలు చేపట్టడం, కార్మికుల సమస్యలను నేరుగా తెలుసుకోవడంలో మీ చొరవ శ్లాఘనీయమని అన్నారు. అనకాపల్లి వద్ద ప్రైవేటురంగంలో ఏర్పాటుకానున్న ఆర్సెలర్స్ మిట్టల్ & నిప్పాన్ స్టీల్స్ ఉక్కు పరిశ్రమ వల్ల ఎపి యువతకు పెద్దఎత్తున ఉద్యోగావకాశాలు లభిస్తాయని, ఈ పరిశ్రమ ఏర్పాటుకు కేంద్రం తరపున అవసరమైన అనుమతులను త్వరితగతిన మంజూరు చేయాలని కోరారు.
Comments