ఎపిలో ఎన్ సిసి డైరక్టరేట్ ను ఏర్పాటు చేయండి
trending post trendingnews viralposts viral news trendingnow trendingfashion trendingtopic trendings intresting facts
Intersting news
Viral news facts
By
Peoples Motivation
ఎపిలో ఎన్ సిసి డైరక్టరేట్ ను ఏర్పాటు చేయండి
కేంద్ర మంత్రి రాజ్ నాథ్ కు మంత్రి లోకేష్ వినతి
న్యూడిల్లీ: ఆంధ్రప్రదేశ్ లో మానవవనరుల సామర్థ్యాన్ని పెంపొందించేందుకు ఎన్ సిసి మౌలిక సదుపాయాల వృద్ధి ద్వారా ఎపిలోని క్యాడెట్లకు మెరుగైన అవకాశాలను కల్పించేందుకు సహకారం అందించాలని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కోరారు. డిల్లీలోని రాజ్ నాథ్ నివాసంలో మంత్రి లోకేష్ ఆయనను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ...ఆంధ్రప్రదేశ్ లోని 5 ఎన్ సిసి గ్రూపులు, 43 యూనిట్ల పరిధిలో 75వేలమందికి పైగా క్యాడెట్లు ఉన్నారు, రాష్ట్ర విభజన తర్వాత ఎన్ సిసి డైరక్టరేట్ తెలంగాణాలో ఉండిపోయింది. ఎపిలో ప్రత్యేకంగా ఎన్ సిసి డైరక్టరేట్ ను ఏర్పాటు చేయండి. ఎపి రాజధాని అమరావతిలో ఇందుకు అవసరమైన స్థలాన్ని కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నాం. ఎపిలో ఎన్ డైరక్టరేట్ ఏర్పాటుకు రూ.25కోట్ల నిధులతోపాటు అడిషనల్ డిజి ర్యాంకు అధికారి, ఇతర సిబ్బందిని నియమించండి. ఎపిలోని 5 ఎన్ సిసి గ్రూపు హెడ్ క్వార్టర్స్ లో ఎన్ సిసి ట్రైనింగ్ అకాడమీలను ఏర్పాటు చేయండి. ఇందుకోసం రూ.25కోట్ల నిధులు అవసరం. అత్యధిక తీర ప్రాంతం గల ఎపిలో ప్రస్తుతం ఉన్న 43 ఎన్ సిసి యూనిట్లను అప్ గ్రేడ్ చేయండి. అవసరమైన చోట అదనపు నేవల్ ఎన్ సిసి యూనిట్లు మంజూరు చేయండి. ఎపిలో ఎన్ సిసిని బలోపేతం చేయడంలో భాగంగా అన్ని టెక్నికల్ స్క్వాడ్రన్లను ఫ్లయింగ్ యూనిట్లుగా మార్చి, ప్రతి స్క్వాడ్రన్ కు మైక్రో లైట్లను అందించండి. నూరుశాతం కేంద్రం నిధులతో ఐదు ఏక్ భారత్ – శ్రేష్ట భారత్ కేంద్రాలను (EBSB) మంజూరు చేయాలని మంత్రి లోకేష్ కోరారు.
Comments