ప్రధానులుగా ఉంటూ బడ్జెట్ సమర్పణ
ప్రధానులుగా ఉంటూ బడ్జెట్ సమర్పణ
• నెహ్రూ నుంచి రాజీవ్ వరకు పలువురికి..
• అవకాశం ఎక్కువసార్లు మొరార్జీకి దక్కిన ఛాన్స్..
న్యూఢిల్లీ, జనవరి31 (పీపుల్స్ మోటివేషన్):
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో పార్లమెంట్ ఉభయసభలు శుక్రవారం ప్రారంభం అయ్యాయి. కేంద్ర బడ్జెట్ 2025 ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్నారు. దీంతో మోదీ 3.0 పాలనలో మిగిలిన కాలంలో ముఖ్యమైన ఆర్థిక ప్రకటనలు, ప్రభుత్వ నిర్ణయాలు, పథకాలపై ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ఈ బడ్జెట్ కీలకంగా మారనుంది. భారతదేశ బడ్జెట్ చరిత్రను చూస్తే అనేక ముఖ్యమైన అంశాలు ఉన్నాయని చెప్పవచ్చు. వాటిలో ముఖ్యంగా ఆర్ధిక మంత్రులు మాత్రమే కాకుండా, ప్రధానమంత్రులు కూడా బడెట్ ప్రవేశపెట్టిన సందర్భాలు ఉన్నాయి. భారతదేశ తొలి ప్రధానమంత్రి అయిన జవహర్ లాల్ నెహ్రూ 1958లో కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టిన తొలి ప్రధానమంత్రిగా నిలిచారు. ఈ సంవత్సరంలో ముంద్రా కుంభకోణం నేపథ్యంలో అప్పటి ఆర్ధిక మంత్రి టీటీ కృష్ణమాచారి రాజీనామా చేయవలసి వచ్చింది. ఆ క్రమంలో నెహ్రూ స్వయంగా ఆర్ధిక మంత్రిత్వ శాఖ బాధ్యతలు స్వీకరించి, 1958లో కేంద్ర ఐడెట్ ను సమర్పించారు. మొరార్జీ దేశాయ్ 1977 నుంచి 1979 వరకు భారతదేశంలో జనతా పార్టీతో ప్రధానమంత్రిగా సేవలందించారు. ఆయన కేవలం. ప్రధానమంత్రిగా మాత్రమే కాకుండా, ఆర్థిక మంత్రిగా కూడా పనిచేశారు. ఆయన భారతదేశంలో అత్యధిక సంఖ్యలో కేంద్ర బడ్జెట్ లను ప్రవేశపెట్టిన రికార్డ్ కలిగి ఉన్నారు. మొత్తం 10 బడ్జెట్లతో ఆయన రికార్డు సృష్టించారు. ఇందులో 8 వార్షిక బడ్జెట్ 2 తాక్యాలిక బడ్జెట్లు ఉన్నాయి. 1959 నుంచి 1963 వరకు ఆర్ధిక మంత్రిగా పనిచేసిన ఆయన, 1962లో తాత్యానిక బడ్జెట్ ను సమర్పించారు. భారతదేశ తొలి మహిళా ప్రధాన మంత్రి అయిన ఇందిరా గాంధీ 1969లో ప్రధానమంత్రి అయ్యారు.మురార్జి దేశాయ్ రాజీనామా చేసిన సంవత్సరం, తర్వాత ఆమె ఆర్థిక మంత్రిత్వ శాఖ బాధ్యతలను స్వీకరించి 1970లో బడ్జెట్ ను సమర్పించారు. భారతదేశ మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ 1987లో, అప్పటి ఆర్థికమంత్రి వి.పి. సింగ్ ను పదవి నుంచి. తొలగించిన తర్వాత కొంతకాలం ఆర్థిక శాఖ బాధ్యతలను చేపట్టారు. ఆ సమయంలో, ఆయన కొన్ని కీలక ఆర్థిక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రపంచ ప్రఖ్యాత ఆర్థిక నిపుణుడు, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ 1991 నుంచి 1996 వరకు పి.వి. నరసింహారావు ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేశారు. ఆయన సమర్పించిన 1991 బడ్జెట్ భారతదేశ ఆర్థిక చరిత్రలో ఒక మలుపు మలుపు అని చెప్పవచ్చు, ఇది భారత ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడానికి, సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ వంటి నూతన ఆర్థిక విధానాలను ప్రవేశపెట్టింది. 1994లో ఆయన సమర్పించిన paket fur పన్ను ప్రవేశపెట్టడం ద్వారా ప్రస్తుతం ఇది ప్రభుత్వం ప్రధాన ఆదాయ వనరుగా నిలిచింది.
అలా ప్రధానమంత్రులు, కేవలం దేశ ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మాణం చేయడం మాత్రమే కాకుండా, ముఖ్యమైన ఆర్థిక నిర్ణయాలతో దేశం ప్రగతిని ప్రేరేపించారు.