రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

దూరవిద్య పరీక్షలు మరి ఎప్పుడు జరిగేనో

SVU DDE SV distance exams Distance education General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news
Peoples Motivation
దూరవిద్య పరీక్షలు మరి ఎప్పుడు జరిగేనో

• ఎస్వీ దూరవిద్య పరీక్షలు మరోసారి వాయిదా..

• ఇప్పటికే మూడు సార్లు వాయిదా వేసిన యూనివర్సిటీ..

• దాదాపు 32వేల మంది నిరీక్షణ..

SVU DDE SV distance exams Distance education General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news

శ్రీ వెంకటేశ్వర దూరవిద్య (SVU DDE) విభాగం ద్వారా ఫిబ్రవరి 3వ తేదీ నుంచి డిగ్రీ, పీజీ పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ పరీక్షలు తాత్కాలికంగా వాయిదా వేసినట్లు దూరవిద్య విభాగం డైరెక్టర్ తవమణి గురువారం పేర్కొన్నారు. తదుపరి కొత్త తేదీలను త్వరలోనే ప్రకటించనున్నట్లు ఆమె వెల్లడించారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.

మరి ఎప్పుడు జరిగేనో...

ఈ సందర్భంగా కొంత మంది విద్యార్థులు మాట్లాడుతూ.. చాలా మంది విద్యార్థులు అయోమయంతో దూర విద్య పరీక్షలు కోసం ఎదురు చూస్తున్నామన్నారు. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ దూరవిద్యా పరీక్షల కోసం దాదాపు రాష్ట్రవ్యాప్తంగా 32 వేల మంది విద్యార్థులు ఎదురుచూస్తున్నారని ఫిబ్రవరి 3వ తేదీ నుంచి దూరవిద్య పరీక్షలు నిర్వహిస్తామని టైం టేబుల్ విడుదల చేసిన తర్వాత హాల్ టికెట్ల కోసం విద్యార్థులు ఎదురుచూశారని చివరి నిమిషంలో పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించడంతో పరీక్షలు రాసే ఎంతో మంది విద్యార్థులు నిరాశ చెందామని తెలిపారు. చివరిసారిగా 2023 లో పరీక్షలు జరిగాయని అప్పటి నుంచి ఇప్పటి వరకు పరీక్షలు జరగకపోవడంతో దాదాపు 32 వేల మంది విద్యార్థులు ఎదురుచూస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు ఇలా మూడో సారి టైం టేబుల్ ప్రకటించి వాయిదా వేశారని వాపోయారు. ఇప్పటికైనా పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, రిజిస్టర్ సంబంధిత అధికారులు దృష్టి సారించాలని విద్యార్థులు కోరుతున్నారు.
Comments

-Advertisement-