Black Budget: 'బ్లాక్ బడ్జెట్' అంటే ఏమిటి.. ఎప్పుడు ప్రవేశపెట్టారు?
Black Budget: 'బ్లాక్ బడ్జెట్' అంటే ఏమిటి.. ఎప్పుడు ప్రవేశపెట్టారు?
భారతదేశ బడ్జెట్ చరిత్రలో 'బ్లాక్ బడ్జెట్' గురించి తెలుసా మీకు. లేదా అయితే ఇక్కడ తెలుసుకుందాం. ఇది దేశ ఆర్థిక పరిస్థితిని ఏ విధంగా ప్రభావితం చేసింది, ఎందుకు అలా పిలిచారనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
1971లో జరిగిన ఇండియా-పాకిస్తాన్ యుద్ధం తరువాత భారత ఆర్థిక వ్యవస్థ (indian economy) పెద్ద ఎత్తున ఒత్తిడిని ఎదుర్కొంది. ఆ యుద్ధం ప్రభుత్వ ఖజానాను క్షీణింపచేసింది. దీంతోపాటు దేశం కరువు, ప్రకృతి వైపరీత్యాలను కూడా ఎదుర్కొంది. ఈ పరిణామాలు వ్యవసాయ ఉత్పత్తిని తీవ్రంగా ప్రభావితం చేశాయి.
పంటల కొరత కారణంగా దేశంలో ఆహారధాన్యాల ఉత్పత్తి తగ్గిపోయింది. ఇది సమృద్ధిని తగ్గించి, భారత ఆర్థిక వ్యవస్థకు మరింత ఒత్తిడిని తెచ్చాయి. ఇదే సందర్భంలో అప్పటి ఆర్థిక మంత్రి యశ్వంతరావు బి. చవాన్ 1973–74 బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లో రూ. 550 కోట్ల ఆర్థిక లోటు గురించి ప్రకటించడంతో ఆర్థిక పరిస్థితి మరింత అనిశ్చితిగా మారింది. అప్పట్లో ఈ మొత్తం చాలా పెద్దదని చెప్పవచ్చు.
ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు..
బడ్జెట్ ప్రసంగంలో చవాన్ కరువు వల్ల దేశ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారిందని చెప్పారు. కరువు కారణంగా దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి తగ్గిపోవడం, తద్వారా బడ్జెట్ లోటు పెరగడం జరిగిందని ఆయన అన్నారు. కరువు, ద్రవ్య లోటు ప్రభావం వల్ల దేశ ఆర్థిక విధానాలు మరింత ఇబ్బందుల్లో పడ్డాయి. ఈ బడ్జెట్‌లో ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ క్రమంలో బొగ్గు గనులు, బీమా కంపెనీలు, ఇండియన్ కాపర్ కార్పొరేషన్ వంటి కీలక రంగాల జాతీయీకరణకు రూ. 56 కోట్ల కేటాయింపు ప్రకటించింది.
దేశ ఆర్థిక విధానాలపై ప్రభావం..
బొగ్గు గనులను జాతీయం చేయడం ద్వారా దేశంలో ఇంధన రంగం అభివృద్ధి చెందుతుందని ప్రభుత్వం తెలిపింది. ఈ నిర్ణయాలు దేశ ఆర్థిక విధానాలపై భారీ ప్రభావాన్ని చూపించాయి. అందుకే దీనిని 'బ్లాక్ బడ్జెట్' అని అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ అన్నారు. ఆ క్రమంలో దేశ ఆర్థిక విధానాలు, ప్రణాళికలపై ఇది తీవ్ర ప్రభావాన్ని చూపింది. తీవ్ర అనిశ్చితి, పెట్టుబడుల కోల్పోయే భయం, వృద్ధి తగ్గడం, ప్రజలకు సహాయం అందించే విధానాలలో అనుకూలత లేకపోవడం వల్ల జరిగింది. దీంతో ప్రభుత్వం ఖర్చులను తగ్గించుకుని ఆర్థిక క్రమశిక్షణను పాటించేలా చేసింది. ఇది దేశంలో తాత్కాలికంగా పేదరికాన్ని పెంచడంతోపాటు ఒక విపత్కర పరిస్థితిని ఏర్పరచింది.
2025 కేంద్ర బడ్జెట్ అంచనాలు..
ఇప్పుడు 2025 బడ్జెట్ గురించి చూస్తే, ఇది ప్రభుత్వ ఆర్థిక విధానాలు, ప్రణాళికలపై మరింత ప్రభావం చూపించనున్నట్లు తెలుస్తోంది. 2025 బడ్జెట్ ఆమోదించడానికి భారత ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ బడ్జెట్‌ను ఫిబ్రవరి 1, 2025న పార్లమెంటులో ప్రవేశపెడతారు. రాబోయే ఆర్థిక సంవత్సరం 2025-26కి సంబంధించి, కేంద్ర బడ్జెట్ కోసం ఇప్పటికే వివిధ రంగాలు, పరిశ్రమల నుంచి ప్రతిపాదనలు వచ్చాయి. ప్రభుత్వం పన్ను మినహాయింపులు, చైనా వస్తువులపై సుంకాలు సహా మరిన్ని అంశాలపై ఆలోచనలు చేస్తున్నట్లు తెలిసింది.