రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

APPSC: గ్రూప్-2 అభ్యర్థులకు బిగ్ అలర్ట్..హాల్ టికెట్లు విడుదల

https://psc.ap.gov.in https://portal-psc.ap.gov.in/ Ap.gov.in https://applicati Appsc group 2 syllabus APPSC Group 2 Notification Appsc group 2 salary
Peoples Motivation

APPSC: గ్రూప్-2 అభ్యర్థులకు బిగ్ అలర్ట్..హాల్ టికెట్లు విడుదల

• గ్రూప్ 2 మెయిన్స పరీక్ష హాల్ టికెట్లను ఏపీపీఎస్‌సీ విడుదల.. 

• 13వ తేదీ గురువారం నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు.. 

• ఫిబ్రవరి 23వ తేదీ మెయిన్స్ పరీక్ష..

• ఈ పరీక్షల ద్వారా మొత్తం 905 ఉద్యోగాలు భర్తీ..

https://psc.ap.gov.in https://portal-psc.ap.gov.in/ Ap.gov.in https://applicati Appsc group 2 syllabus APPSC Group 2 Notification Appsc group 2 salary

అమరావతి, ఫిబ్రవరి 12 (పీపుల్స్ మోటివేషన్):- ఫిబ్రవరి 23వ తేదీ గ్రూప్ -2 మెయిన్స్ పరీక్ష ఏపీపీఎస్‌సీ నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో గ్రూప్ -2 పరీక్ష హాల్ టికెట్లను 13వ తేదీ గురువారం నుంచి డౌన్ లోడ్ చేసుకో వచ్చని అభ్యర్థులకు ఏపీపీఎస్‌సీ సూచించింది. ఫిబ్రవరి 23వ తేదీ ఉదయం, మధ్యాహ్నం రెండు పేపర్లకు ఆఫ్ లైన్‌లో ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పింది. రాష్ట్రంలోని ఉమ్మడి 13 జిల్లా కేంద్రాల్లో ఈ పరీక్షలను నిర్వహిస్తున్నట్లు ఏపీపీఎస్‌సీ వివరించింది.

మొత్తం 905 ఉద్యోగాలు భర్తీ...

2023, డిసెంబర్ 7వ తేదీన గ్రూప్ 2 నోటిఫికేషన్‌ను ఏపీపీఎస్‌సీ విడుదల చేసింది. డిసెంబర్ 21వ తేదీ నుంచి ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది. 2024, జనవరి 10వ తేదీ దరఖాస్తు చేసుకొనేందుకు చివరి తేదీగా నిర్ణయించింది. 2024, ఫిబ్రవరి 25వ తేదీన ఈ గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్షను ఏపీపీఎస్‌సీ నిర్వహించింది. ప్రిలిమ్స్ ఫలితాలు వెలువడిన అనంతరం మెయిన్స్ పరీక్షలు పలు దఫాలుగా వాయిదా పడుతూ వస్తున్న సంగతి తెలిసిందే. చివరకు 2025, ఫిబ్రవరి 23వ తేదీన గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలను నిర్వహిస్తున్నారు. అసలు అయితే గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష ఈ ఏడాది ప్రారంభంలో అంటే జనవరి 5వ తేదీన నిర్వహించాలని ఏపీపీఎస్‌సీ నిర్ణయించింది. ఈ మేరకు పరీక్షా తేదీని సైతం ఖరారు చేసింది. కానీ సిలబస్ మార్పుతోపాటు పూర్తి స్థాయి సన్నద్దత కోసం మరింత గడువు కావాలని అభ్యర్థులు.. ఏపీపీఎస్‌సీని కోరారు. ఈ నేపథ్యంలో ఈ పరీక్షా తేదీని ఫిబ్రవరి 23వ తేదీకి మార్చింది. గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షకు 92, 250 మంది అర్హత సాధించారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 905 ఉద్యోగాలు భర్తీ కానున్నాయి.

Comments

-Advertisement-