APOBMMS: కార్పోరేషన్ రుణాల దరఖాస్తుకు గడువు పెంపు
APOBMMS: కార్పోరేషన్ రుణాల దరఖాస్తుకు గడువు పెంపు
బిసి, ఇబిసి (కమ్మ, రెడ్డి, ఆర్య వైశ్య, క్షత్రియ, బ్రాహ్మణ) మరియు కాపు, బలిజ, తెలగ మరియు ఒంటరి కులముల వారు అర్హులు
2024-25 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బి.సిలు, ఇబిసిలు (కమ్మ, రెడ్డి, ఆర్య వైశ్య, క్షత్రియ, బ్రాహ్మణ) మరియు కాపు, బలిజ, తెలగ మరియు ఒంటరి కులాలకు సంబంధించిన లబ్దిదారులకు బిసి కార్పోరేషన్ వారి ద్వారా వివిధ పథకముల ద్వారా సబ్సిడీ మంజూరు చేయుటకు గాను, దరఖాస్తుదారులు APOBMMS ద్వారా వారి పేరును ఆన్లైన్ లో నమోదు చేసుకొనుటకు 12వ తేదీ వరకు గడువు పెంచినట్లు సంబంధిత అధికారులు గురువారం తెలిపారు. ఆయా కార్పొరేషన్లకు సంబంధించిన లబ్ధిదారులు నిర్ణీత గడువులోగా చేసుకోవాలని సూచించారు.
గడువు పెంపు..
బీసీ, ఈబీసీ రుణాలకు సంబంధించి దరఖాస్తు చేసుకునేందుకు 12వ తేదీ వరకు గడువు పెంచినట్లు సంబంధిత అధికారులు గురువారం తెలిపారు. ఆయా కార్పొరేషన్లకు సంబంధించిన లబ్ధిదారులు నిర్ణీత గడువులోగా చేసుకోవాలని సూచించారు.
అర్హతలు
1. వయస్సు: బి.సి. మరియు ఇబిసిలకు 21 నుండి 60 సంవత్సరములు మరియు కాపు, బలిజ, తెలగ మరియు ఒంటరి వారికి 21 నుండి 50 సంవత్సరములు.
2. తెల్ల రేషన్ కార్డు, కుల ధృవీకరణ పత్రం మరియు ఆధార్ కార్డు తప్పనిసరిగా కలిగి యుండవలెను.
3. ఒక కుటుంబము యొక్క తెల్ల రేషన్ కార్డు నందు ఒక్కరు మాత్రమే లబ్ది పొందుటకు అర్హులు.
పై తెల్పిన విధంగా అర్హతలున్న వారు https://apobmms.apcfss.in వెబ్ సైట్ (ఆన్ లైన్) నందు
12వ తేదీ లోగా వారి పేర్లను APOBMMS వెబ్ సైట్ నందు నమోదు చేసుకోవలసినదిగా ఇందుమూలముగా తెలియజేయడమైనది.
వ్యవసాయ సంబంధ కార్యక్రమాలు, పరిశ్రమలు, చిన్న తరహా వ్యాపారము, సేవలు, రవాణా విభాగము వంటి సెక్టార్లకు సంబంధించిన యూనిట్లకు సబ్సిడీ మంజూరు చేయబడును.