రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

RRC: సౌత్ సెంట్రల్ రైల్వేలో 4232 ఖాళీలకు నోటిఫికేషన్.. ఆలోపు దరఖాస్తు చేసుకోండి

SOUTH CENTRAL RAILWAY APPRENTICE VACANCIES Job news RRC recruitment RRB Jobs Railway recruitment Railway jobs notifications Latest RRB notifications
Peoples Motivation

RRC: సౌత్ సెంట్రల్ రైల్వేలో 4232 ఖాళీలకు నోటిఫికేషన్.. ఆలోపు దరఖాస్తు చేసుకోండి

>> మొత్తం 4232 అప్రెంటిస్ ఖాళీలకు వెలువడిన ప్రకటన..

>> ట్రేడుల వారిగా పూర్తి వివరాల వెల్లడి.. 

>> పదో తరగతి, ఐటీఐ మార్కుల ఆధారంగా ఎంపిక..

SOUTH CENTRAL RAILWAY APPRENTICE VACANCIES Job news RRC recruitment RRB Jobs Railway recruitment Railway jobs notifications Latest RRB notifications

సికింద్రాబాద్‌లోని రైల్వే రిక్రూట్‌మెంట్‌ సెల్‌ (ఆర్‌ఆర్‌సీ)- సౌత్ సెంట్రల్ రైల్వే - ఎస్‌సీఆర్‌ వర్క్‌షాప్‌/ యూనిట్‌లలో యాక్ట్ అప్రెంటిస్‌ శిక్షణలో ప్రవేశాలకు ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు కోరుతోంది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోకి వచ్చే జిల్లాల్లో నివసించే అభ్యర్థులు మాత్రమే దరఖాస్తుకు అర్హులు. అర్హులై ఆసక్తి గల అభ్యర్థులు 2024 జనవరి 27వ తేదీలోగా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాలు..

SCR యూనిట్స్ ప్రాంతాలు: 

సికింద్రాబాద్, కాజీపేట, హైదరాబాద్, లాలాగూడ, మెట్టుగూడ, విజయవాడ, బిట్రగుంట, గూడూరు జంక్షన్, పూర్ణ జంక్షన్, ముద్‌ఖేడ్‌, కాకినాడ పోర్టు, కొండపల్లి, ఒంగోలు, రాజమండ్రి, రాయనపాడు, నల్లపాడు, గుంటూరు, మచిలీపట్నం, నర్సాపూర్, యాద్‌గిర్‌, నాందెడ్‌, గుంతకల్, తిమ్మనచర్ల.


ట్రేడుల వారీగా ఖాళీల వివరాలు: 

ఎలక్ట్రీషియన్- 1053,

పవర్ మెయింటెనెన్స్ (ఎలక్ట్రీషియన్)- 34, 

ట్రైన్‌ లైటింగ్ (ఎలక్ట్రీషియన్)- 34, 

ఫిట్టర్- 1742, 

కార్పెంటర్- 42, 

డీజిల్ మెకానిక్- 142, 

ఎలక్ట్రానిక్ మెకానిక్- 85, 

ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్- 10, 

ఏసీ మెకానిక్- 143, 

ఎయిర్ కండిషనింగ్- 32, 

ఎలక్ట్రికల్ (ఎస్‌&టి) (ఎలక్ట్రీషియన్)- 10, 

మోటార్ మెకానిక్ వెహికల్ (ఎంఎంవీ)- 08, 

మెషినిస్ట్- 100, 

మెకానిక్ మెషిన్ టూల్ మెయింటెనెన్స్ (ఎంఎంటీఎం)- 10, 

పెయింటర్‌- 74, 

వెల్డర్- 713.

మొత్తం పోస్టుల సంఖ్య: 4232

కేటగిరీ వారిగా ఖాళీలు: 

ఎస్సీ- 635, ఎస్టీ- 317, ఓబీసీ- 1143, ఈడబ్ల్యూఎస్‌- 423, యూఆర్‌- 1714

అర్హత: 

కనీసం 50 శాతం మార్కులతో పదో తరగతి, సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

వయస్సు: 

28.12.2024 నాటికి 15 నుంచి 24 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: 

పదోతరగతి, ఐటీఐలో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్ల సడలింపు ఉంది.

దరఖాస్తు ఫీజు: 

రూ.100/- (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు మినహాయింపు ఉంటుంది).

ముఖ్య తేదీలు :

ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 28-12-2024. 

చివరి తేదీ: 27-01-2025.

పూర్తి వివరాలకు scr.indianrailways.gov.in/ వెబ్సైట్ చూడొచ్చు.

Comments

-Advertisement-