RRB: రైల్వేలో 32,438 ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్.. పూర్తి వివరాలు
RRB: రైల్వేలో 32,438 ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్.. పూర్తి వివరాలు
>> రైల్వే శాఖలో టెన్త్, ఐటీఐ విద్యార్హతతో ఉద్యోగాలు..
>> 32,438 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..
>> జనవరి 23 నుంచి ఫిబ్రవరి 22 వరకు దరఖాస్తు ప్రక్రియ..
రైల్వేశాఖ నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది. టెన్త్, ఐటీఐ విద్యార్హతతో భారీగా ఉద్యోగ నియామకాలను విడుదల చేసింది. గ్రూప్-డి లెవెల్-1 కేటగిరిలో వివిధ విభాగాల్లో మొత్తం 32,438 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు జనవరి 23 నుంచి ఫిబ్రవరి 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో ఉద్యోగం సాధించినవారికి ప్రారంభ వేతనం నెలకు రూ.18వేల చొప్పున ఇస్తారు.
నోటిఫికేషన్లోని కొన్ని ముఖ్యమైన వివరాలు
విద్యార్హతలు (Educational):-
పదోతరగతి ఉత్తీర్ణత లేదా ఐటీఐ లేదా తత్సమాన విద్యార్హత లేదా NCVT జారీ చేసిన నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థులు అర్హులు.
వయోపరిమితి (Age limit):-
జనవరి 1, 2025 నాటికి అభ్యర్ధుల వయస్సు 18 నుంచి 36 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ,ఎస్టీ, ఓబీసీ, పీహెచ్, ఎక్స్ సర్వీస్మెన్ కేటగిరీల కింద అభ్యర్థులకు వయో సడలింపు ఉంటుంది.
పోస్టుల వారీగా ఖాళీల సంఖ్య
• పాయింట్స్‌మన్- 5,058
• అసిస్టెంట్ (ట్రాక్ మెషిన్)- 799
• అసిస్టెంట్ (బ్రిడ్జ్)- 301
• ట్రాక్ మెయింటెయినర్ గ్రూప్-4 - 13,187
• అసిస్టెంట్ పీ-వే- 247
• అసిస్టెంట్ (సీ అండ్ డబ్ల్యూ)- 2587
• అసిస్టెంట్ లోకో షెడ్ (డిజిల్)- 420
• అసిస్టెంట్ (వర్క్‌షాప్)- 3077
• అసిస్టెంట్ (ఎస్ అండ్ టీ)- 2012
• అసిస్టెంట్ టీఆర్‌డీ- 1381
• అసిస్టెంట్ లోకో షెడ్ (ఎలక్ట్రికల్)- 950
• అసిస్టెంట్ ఆపరేషన్స్- (ఎలక్ట్రికల్)- 744
• అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ- 1041
• అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ (వర్క్‌షాప్)- 625
మొత్తం ఖాళీల సంఖ్య: 32,438.
ఎంపిక విధానం ఇలా:-
కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ), ఎఫిషియెన్సీ టెస్ట్ (పీటీ), డాక్యుమెంట్ వెరిఫికేషన్ (డీవి), మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ప్రారంభ వేతనం:- నెలకు రూ.18,000
పరీక్ష విధానం:-
ఇది కంప్యూటర్ ఆధారిత పరీక్ష. ఈ పరీక్షలో మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. 90 నిమిషాలు టైమ్ ఉంటుంది. జనరల్ సైన్స్ నుంచి 25 ప్రశ్నలు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 30, మ్యాథమెటిక్స్ 25, జనరల్ అవేర్‌నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ 20 చొప్పున ప్రశ్నలు అడుగుతారు. తప్పు సమాధానం రాస్తే 1/3 మార్కుల కోత విధిస్తారు.
అప్లికేషన్ ఫీజు:-
జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు రూ.500. ఎస్సీ, ఎస్టీ, ఈఎస్‌ఎం, ఈబీసీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు రూ.250.
ముఖ్య తేదీలు
• నోటిఫికేషన్ విడుదల తేదీ: 28-12-2024
• నోటిఫికేషన్ జారి తేదీ: 22.01.2025
• ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 23.01.2025
• ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 22-02-2025
• దరఖాస్తుల సవరణకు తేదీలు: ఫిబ్రవరి 25 నుంచి మార్చి 6 వరకు
• ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ జనవరి 23న ప్రారంభమై ఫిబ్రవరి 22వ తేదీన ముగుస్తుంది.