RRB: రైల్వేలో భారీ నోటిఫికేషన్ 32,438 పోస్టులు భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
RRB: రైల్వేలో భారీ నోటిఫికేషన్ 32,438 పోస్టులు భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
>> రైల్వేలో 32,438 గ్రూప్-డి పోస్టులు భర్తీకి నోటిఫికేషన్..
>> విద్యార్హతలు, వయోపరిమితి, ఫీజు తదితర పూర్తి వివరాలు..
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. ఆర్‌ఆర్‌బీ (రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు) ఏకంగా 32,438 గ్రూప్-డి పోస్టులను భర్తీ చేయనుంది. ఇందుకోసం లెవల్-1 పోస్టులకు సంబంధించి సంక్షిప్త ఉద్యోగ ప్రకటనను జారీ చేసింది. పూర్తి వివరాలు..
పోస్టుల వివరాలు
RRB-Group D పోస్టులు: పాయింట్స్‌మన్, అసిస్టెంట్, ట్రాక్ మెయింటెయినర్, అసిస్టెంట్ లోకో షెడ్, అసిస్టెంట్ ఆపరేషన్స్ తదితర పోస్టులు ఉన్నాయి. ఇవన్నీ లెవల్ -1 గ్రూప్-డీ పోస్టులు. మొత్తం 32,438 పోస్టులు ఉన్నాయి.
విభాగాలు:
ఇంజినీరింగ్,
మెకానికల్,
ఎలక్ట్రికల్,
ట్రాఫిక్ మొదలైనవి.
విద్యార్హతలు (Eligibility):
అభ్యర్థులు 10వ తరగతి, ఐటీఐ అర్హతలతో పాటు, నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
వయోపరిమితి (Age Limit): అభ్యర్థుల వయస్సు 2025 జులై 1 నాటికి 18-36 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం - ఓబీసీ, పీహెచ్, ఎస్టీ, ఎస్సీ అభ్యర్థులకు వయోపరిమితి సడలింపులు ఉంటాయి.
దరఖాస్తు రుసుము (Application Fee): జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.500 చెల్లించాలి. మహిళలు, ఈబీసీలు, దివ్యాంగులు, ఎస్టీ, ఎస్సీలు రూ.250 చెల్లిస్తే సరిపోతుంది.
ఎంపిక ప్రక్రియ (Selection Process): కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ), ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్ (పీఈటీ), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ చేసి, అర్హులైన అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.
జీతభత్యాలు (Salary): గ్రూప్-డి పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.18,000 వరకు జీతం ఇస్తారు. ఇతర భత్యాలు కూడా ఉంటాయి.
ఆర్‌ఆర్‌బీ రీజియన్లు (RRB Regions):
సికింద్రాబాద్, చెన్నై, భువనేశ్వర్, బెంగళూరు, అహ్మదాబాద్, అజ్‌మేర్, భోపాల్, బిలాస్‌పూర్, చండీగఢ్, గోరఖ్‌పుర్, కోల్‌కతా, మాల్దా, ముంబయి, పట్నా, ప్రయాగ్‌రాజ్, రాంచీ
ముఖ్యమైన తేదీలు (Important Dates):
>> నోటిఫికేషన్ విడుదలైన తేదీ: 2024 డిసెంబర్ 28
>> ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 2025 జనవరి 23
>> ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 2025 ఫిబ్రవరి 22
గమనిక (Note): గ్రూప్-డి పోస్టుల వివరాలు, విద్యార్హతలు, ఎంపిక విధానం, సిలబస్ తదితర పూర్తి వివరాలను ఆర్‌ఆర్‌బీ త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనుంది.