ముద్దటమాగి గ్రామంలో స్కూల్ హెడ్మాస్టర్ తాగేసి వీరంగo
ముద్దటమాగి గ్రామంలో స్కూల్ హెడ్మాస్టర్ తాగేసి వీరంగo
హోళగుంద, జనవరి 27 (పీపుల్స్ మోటివేషన్):-
కర్నూలు జిల్లా హోళగుంద మండలం ముద్దటమాగి గ్రామంలో ఎంపీపీ స్కూలు లో హెడ్మాస్టర్ గా పనిచేస్తున్న జయరాజు మద్యం మత్తులో స్కూల్ విద్యార్థులను చితకబాదారు. ఈ విషయం తెలుసుకున్న పిల్లల తల్లిదండ్రులు స్కూల్ హెడ్మాస్టర్ పై వాగ్వాదానికి దిగి నిలదీశారు. రోజు స్కూల్ కి మద్యం తాగి వస్తున్నారని పిల్లలు ఆరోపించారు. ఒక విద్యార్థికి స్వల్ప గాయం కూడా అయినది. స్కూల్ హెడ్మాస్టర్ జయరాజు రోజు స్కూల్ కి వచ్చి బాత్రూం లో మద్యం తాగి వస్తున్నారని స్కూల్ పిల్లలు ఆరోపించారు. స్కూల్ హెడ్మాస్టర్ జయరాజు రోజు తాగేసి వచ్చి పిల్లలను చితక బాదారని అక్కడి స్థానికులు తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ విషయాన్ని ఎంఈఓ దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించి హెడ్మాస్టర్ పై చర్యలు తీసుకోవాలని డీఈఓ కి ఈ విషయాన్ని తెలియజేశారు. డిఈఓ వెంటనే స్పందిస్తూ ముద్దుటమాగి హెడ్మాస్టర్ జయరాజు నం సస్పెండ్ చేశారు.