High Court Jobs: 10th పాసైతే చాలు.. హైకోర్టులో ఉద్యోగాలు?
High Court Jobs: 10th పాసైతే చాలు.. హైకోర్టులో ఉద్యోగాలు?
>> తెలంగాణ హైకోర్టులో 1673 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..
>> టెన్త్, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణులైన వారు అప్లై చేసుకోవచ్చు..
>>దరఖాస్తుకు చివరి తేదీ జనవరి-31 -2025
ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారా? మీరు టెన్త్ పాసై ఖాళీగా ఉన్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీచేసింది. ఈ జాబ్స్ ను సాధిస్తే లైఫ్ లో సెటిల్ అయిపోవచ్చు.
నిరుద్యోగులకు శుభవార్త.. తెలంగాణ హైకోర్ట్ జాబ్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 1673 పోస్టులను భర్తీ చేయనుంది.
పోస్టులు రకాలు:
అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, అసిస్టెంట్, ఎగ్జామినర్, టైపిస్ట్, ఆఫీస్ సబార్డినేట్, కంప్యూటర్ అపరేటర్, సిస్టమ్ అనలిస్ట్ పోస్టులను భర్తీ చేయవలసి ఉంటుంది. భర్తీకానున్న పోస్టుల్లో 1277 టెక్నికల్ పోస్టులు, 184 నాన్-టెక్నికల్ పోస్టులు, తెలంగాణ జ్యుడీషియల్ మినిస్టీరియల్ పోస్టులు, సబార్డినేట్ సర్వీస్ కింద 212 పోస్టులు ఉన్నాయి.
విద్యార్హతలు:
ఈ పోస్టులకు పోటీ పడే అభ్యర్థులు టెన్త్, ఇంటర్, డిగ్రీ పాసై ఉండాలి. దీనితో పాటు పని అనుభవం ఉండాలి.
వయసు:
అభ్యర్థుల వయసు 18-34 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడీబ్ల్యూడీ అభ్యర్థులకు పదేళ్ల వరకు గరిష్ఠ వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం:
సీబీఐ టెస్ట్, స్కిల్ టెస్ట్, మెరిట్ లిస్ట్, షార్ట్ హ్యాండ్ ఇంగ్లీష్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ వంటివాటి ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఎలా దరఖాస్తు చేసుకోవాలి: అభ్యర్థులు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు:
దరఖాస్తు రుసుము రూ.600 చెల్లించాలి. ఎస్టీ/ ఎస్సీ/ ఈడబ్ల్యూఎస్, ఎక్స్ సర్వీసెమెన్, పీడబ్ల్యూబీడీఎస్ అభ్యర్థులకు రూ.400గా నిర్ణయించారు.
దరఖాస్తుకు చివరి తేదీ:
జనవరి 31 2025 వరకు అప్లై చేసుకోవచ్చు.