రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

Find hidden cameras: ఏదైనా హోటల్ వెళుతున్నారా... సీక్రెట్ కెమెరాలను గుర్తించండిలా.!

Ten ways to find hidden cameras in a hotel room Health news health tips Telugu health benefits in Telugu health losses in Telugu Health and fitness
Peoples Motivation

Find hidden cameras: 

>> ప్రైవసీని కాపాడుకోవడానికి బోలెడు చిట్కాలు..

>> హోటల్ వెళుతున్నారా సీక్రెట్ కెమెరాలను గుర్తించండిలా..

>> తగిన జాగ్రత్తలు పాటిస్తే ముప్పు బారి నుంచి తేలికగా బయటపడొచ్చు..

>> స్పై కెమెరాల జాడను పసిగట్టేందుకు అందుబాటులో సాంకేతికత..

రోజురోజుకూ పెరిగిపోతున్న టెక్నాలజీతో వాటి వాడకం వల్ల అనేక సమస్యలు సైతం పెరుగుతున్నాయి. ఎక్కువగా హోటళ్లలో దిగే టూరిస్టులకు ఈ సమస్య తీవ్రంగా వేధిస్తోంది. ముఖ్యంగా పరిసరాల్లో కనపడకుండా ఉండే అతిచిన్న రహస్య కెమెరాలతో మన జీవితాలకు ప్రైవసీ ముప్పు పొంచి ఉంది.  అయితే కాస్త తెలివిగా వ్యవహరిస్తే సీక్రెట్ కెమెరాలను గుర్తించడం సులువే అని నిపుణులు సూచిస్తున్నారు. అదెలాగో తెలుసుకుందాం...

Health news health tips Telugu health benefits in Telugu health losses in Telugu Health and fitness Lifestyle news benefits of panner losses of panner

స్పై కెమెరాలు గుర్తించేందుకు చిట్కాలు..

కళ్లతో స్కానింగ్

హోటల్ గదిలోకి వెళ్లగానే గదిని మొత్తం తనిఖీ చేయండి. బాత్రూంలో, బెడ్రూంలో, వరండాలో అసాధారణంగా ఏమైనా వస్తువులు ఉన్నాయా అని పరిశీలించండి. ఉండాల్సిన చోట కాకుండా మరో చోట వాటిని పెట్టారా అని చూడండి.


సీక్రెట్ కెమెరాలు అమర్చే ప్రదేశాలివే

రోజువారీ వస్తువుల్లో కలిసిపోయేలా స్పై కెమెరాలను కేటుగాళ్లు అమరుస్తుంటారు. అందుకే లైట్లు, ఫొటో ఫ్రేమ్ లను పరిశీలించండి. అద్దాల వెనకాల, విద్యుత్ పరికరాలు, స్మోక్ డిటెక్టర్ల లోపల ఉన్నాయేమో చూడండి. 


ఫ్లాష్ లైట్ వాడండి

గది మూలల్లో సీక్రెట్ కెమెరాలు ఉన్నాయో లేదో ఫ్లాష్ లైట్ వేసి చూడండి. ఫ్లాష్ లైట్ వెలుతురులో సీక్రెట్ కెమెరాల్లోని లెన్సులు సాధారణ వస్తువులకన్నా భిన్నంగా పరావర్తనం చెందుతూ కనిపిస్తాయి.


ప్రత్యేక యాప్ లు ఉపయోగించండి

రహస్య కెమెరాల్లోంచి వెలువడే ఇన్ఫ్రారెడ్ కాంతిని గుర్తించే స్మార్ట్ ఫోన్ యాప్ లు చాలా ఉన్నాయి. వాటిని ఉపయోగిస్తూ గది మొత్తాన్ని స్కాన్ చేయండి.


ఆర్ఎఫ్ డిటెక్టర్

సీక్రెట్ కెమెరాల నుంచి వెలువడే వైర్ లెస్ సిగ్నల్స్ ను గుర్తించేందుకు పోర్టబుల్ రేడియో ఫ్రీక్వెన్సీ (ఆర్ ఎఫ్) డిటెక్టర్ ను వాడండి. ఇవి కెమెరా పరికరాల్లోని ఫ్రీక్వెన్సీలను గుర్తిస్తాయి.


వైర్లు లేదా కేబుళ్లు 

గదిలో అనవసరంగా వైర్లు లేదా కేబుళ్లు ఉన్నాయేమో పరిశీలించండి. కెమెరాలను వాటి పవర్ సోర్స్ లకు లేదా రికార్డింగ్ పరికరాలకు అనుసంధానం చేయడానికి ఆ వైర్లను వాడుతుండవచ్చు.


వైఫై నెట్ వర్క్ స్కానర్లు

హోటల్ లో పబ్లిక్ వైఫై నెట్ వర్క్ లను వాడకండి. వైఫై నెట్ వర్క్ స్కానర్ ఉపయోగించి పరిసరాల్లోని వైఫై నెట్ వర్క్ లను స్కాన్ చేయండి. అనుమానాస్పద నెట్ వర్క్ లు ఏవీ లేవని నిర్ధారించుకోండి.


వస్తువులను తాకి చూడండి

అనుమానాస్పదంగా కనిపించే వస్తువులు లేదా కెమెరాలు దాచి ఉంచే అవకాశం ఉన్న పరికరాలను చేత్తో తాకి చూడండి. వాటి లోపల ఏమైనా డొల్లగా ఉంటూ శబ్దం వస్తోందేమో గమనించండి.


లైట్లు ఆపేసి పరిశీలించండి

గదిలో లైట్లు మొత్తంగా ఆఫ్ చేసి, ఎక్కడైనా చిన్నగా అయినా ఏమైనా మెరుస్తున్నట్టుగా లేదా పరావర్తనం చెందుతున్నట్టుగా ఉందా అన్నది పరిశీలించండి.

నిపుణులను సంప్రదించండి

గదిలో ఏమైనా అనుమానాస్పద వస్తువులు ఉన్నాయని అనుమానం వస్తే వెంటనే భద్రతా నిపుణులను పిలిచి గదిని ఆసాంతం తనిఖీ చేయించండి. తప్పుడు ఉద్దేశంతో పెట్టే కెమెరాలు, ఇతరాలు ఏవైనా బయటపడే అవకాశం ఉంటుంది.

Comments

-Advertisement-