Factory Blast: ఫ్యాక్టరీలో భారీ పేలుడు ఎనిమిది మృతి..!
Factory Blast: ఫ్యాక్టరీలో భారీ పేలుడు ఎనిమిది మృతి.!
>>> మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం Champions అధికారులు..
>>> పేలుడు తీవ్రత 5 కిలోమీటర్ల దూరం వినిపించిందని వెల్లడి..
>>> భారీగా ఎగిసిపడుతున్న పొగ, మంటలు..
మహారాష్ట్రలో భండారా జిల్లాలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. శుక్రవారం ఉదయం 10:30 గంటల ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది వర్కర్లు చనిపోయారని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ఎల్‌టీపీ విభాగంలో పేలుడు తీవ్రతకు ఫ్యాక్టరీ పైకప్పు కూలిపోయింది. ఘటన జరిగిన ప్రాంతంలో దట్టమైన పొగ కమ్ముకుంది. ప్రమాద సమయంలో మొత్తం 14 మంది సిబ్బంది ఉన్నారు. సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. కింద చిక్కుకున్న మిగతా 13 మందిని రక్షించి సత్వర చికిత్స అందించారు. ఈ క్రమంలో మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక విభాగం సిబ్బంది ఎంతో శ్రమించారు. వారికి పోలీసులు, స్థానిక విపత్తు నిర్వహణ విభాగం బృందాలు సహాయం చేశాయి. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఫ్యాక్టరీ వద్దకు చేరుకున్నారని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వివరించారు.