రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

Cyber Crime: అలెర్ట్.. పండగల పేరుతో చెలరేగుతున్న సైబర్ నేరగాళ్లు

Cyber Crimes On The Rise Public Warned Against Fake Offers And Links General News telugu latest news telugu intresting news telugu intresting facts
Peoples Motivation

Cyber Crime: అలెర్ట్.. పండగల పేరుతో చెలరేగుతున్న సైబర్ నేరగాళ్లు

>> కొత్త పందా ఎంచుకున్న సైబర్ నేరగాళ్లు..

>> పండుగల పేరుతో ప్రజల ఫోన్లకు మెసేజ్ లు పంపుతున్న సైబర్ నేరగాళ్లు..

>> సంక్రాంతి, మహా కుంభమేళాను టార్గెట్ చేసి ఆ పేరుతో లింక్స్..

>> ఇంకా నూతన సంవత్సర రీఛార్జ్ ఆఫర్ పేరుతో సైబర్ నేరగాళ్ల మెసేజ్లు చక్కర్లు..

General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET AP DSC SSC jobs ap govt news

Cyber Crime: ఏదో రకంగా అమాయక ప్రజలు సైబర్ వలలో చిక్కుకొని ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు ఏ ఆఫర్ గురించి తెలుసుకోవాలన్నా సంబంధిత సంస్థల అధికారిక వెబ్సైట్ ద్వారానే తనిఖీ చేయాలని పోలీసులు సూచిస్తున్నారు.ఇటీవల సైబర్ నేరాలకు భారీగా పెరుగుతున్నాయి. నేరగాళ్లు కొత్త పద్ధతుల్లో ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కొత్త ఆఫర్లు, ప్రభుత్వ పథకాలు, పండుగలు, ఉచిత రీఛార్జ్ పేరుతో ప్రజలకు ఇ-మెయిల్, మెసేజ్ ల రూపంలో లింక్స్ను పంపిస్తున్నారు సైబర్ కేటుగాళ్లు. అలా వారి పంపించిన వాటిని ఓపెన్ చేసిన కొందరికి వారి బ్యాంకు ఖాతాలు ఖాళీ అయిపోతున్నాయి. సైబర్ క్రైం పోలీసులు ప్రజలను అప్రమత్తం చేస్తూ ఇలాంటి మెసేజ్లకు స్పందించవద్దని హెచ్చరిస్తున్నారు.. 

అలాగే సైబర్ నేరగాళ్లు కొత్తగా రూటు మార్చారు. సంక్రాంతి, మహా కుంభమేళాను టార్గెట్ చేసి ఆ పేరుతో లింక్స పంపి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారు. పండుగల సందర్భంగా ఉచిత రీఛార్జ్లు, బంపర్ ఆఫర్లు అంటూ వస్తున్న మెసేజ్లు ప్రజలకు నష్టం కలిగించే ప్రమాదం ఉన్నట్లు పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇంకా, నకిలీ Apk లింక్స్ పంపించడం.. ఆ లింక్స్ను డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేస్తే మీ వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించే అవకాశం ఉందని గుర్తించారు. ముఖ్యంగా సంక్రాంతి లేదా మహా కుంభమేళా పేరుతో వచ్చే మెసేజ్ ల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

ప్రస్తుతం నూతన సంవత్సర రీఛార్జ్ ఆఫర్ పేరుతో సైబర్ నేరగాళ్ల మెసేజ్ లు చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పేరు ఉపయోగించి, ఉచిత రీఛార్జ్ ఆఫర్ అందిస్తున్నారని చెబుతూ లింక్ పంపుతున్నారు. ఈ లింక్పై క్లిక్ చేస్తే నేరగాళ్లు ఖాతాలను ఖాళీ చేయడం సాధ్యమవుతుందని అధికారులు అంటున్నారు. నూతన సంవత్సర ఆఫర్లు, పండుగల ఆఫర్ల పేరుతో వచ్చే మెసేజ్లను నమ్మవద్దని, సైబర్ నేరాలపై ఫిర్యాదు చేయాలనుకుంటే 1930 నంబర్కు కాల్ చేయడం లేదా cybercrime.gov.in వెబ్సైట్ను సందర్శించాలని అధికారులు సూచిస్తున్నారు. సంక్రాంతి, మహా కుంభమేళా వంటి ప్రత్యేక సందర్భాల్లో ప్రజలు మోసపోవకుండా ఉండేందుకు ఈ సూచనలను పాటించడం మంచింది.

Comments

-Advertisement-