గ్రామ, సచివాలయ ఉద్యోగులను కేటగిరీలుగా విభజిస్తూ ఉత్తర్వులు జారీ
గ్రామ, సచివాలయ ఉద్యోగులను కేటగిరీలుగా విభజిస్తూ ఉత్తర్వులు జారీ
• ఉద్యోగులను ప్రభుత్వం కేటగిరులుగా విభజింపు..
• ప్రస్తుతమున్న ఉద్యోగులను తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ..
అమరావతి, (పీపుల్స్ మోటివేషన్):- ఏపీ గ్రామ, సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులను కూటమి ప్రభుత్వం కేటగిరులుగా విభజించి, ప్రస్తుతమున్న ఉద్యోగులను తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సచివాలయాలను ఏ,బీ,సీ కేటగిరిగా విభజించింది. ఏ కేటగిరి సచివాలయల్లో ఉన్న సిబ్బందిని ఆరుకు, బీ కేటగిరిలో ఉన్న సచివాలయాలకు ఏడుకు , సీ కేటగిరిలో ఉన్న సచివాలయం ఎనిమిది మంది మాత్రమే ఉద్యోగులను ఉండాలని ఉత్తర్వులు జారీ చేసింది.
గత కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయం..
గ్రామ/వార్డు స్థాయిలో రియల్ టైమ్ గవర్నెన్సుని మరింత సమర్థవంతంగా అమలు చేయడం మరియు స్వర్ణ ఆంధ్ర విజన్ @ 2047 సాధించడం కోసం గ్రామ/వార్డు సెక్రటేరియట్‌లు మరియు ఫంక్షనరీల హేతుబద్ధీకరణ (రేషనలైజేషన్) కోసం చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెల్పింది.
• గత ప్రభుత్వం రాష్ట్రంలో 11,162 గ్రామ సచివాలయాలను మరియు 3,842 వార్డు సచివాలయాలను ఏర్పాటు చేయడం జరిగింది.
• 11 మందిని గ్రామ సచివాలయంలోను మరియు 10 మందిని వార్డు సచివాలయాల్లోనూ ఉద్యోగులుగా నియమించడం జరిగింది.
• ఎటు వంటి ఆలోచన, ముందు చూపు లేకుండా గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ వ్యవస్థలు ప్రజలకు సమర్థవంతంగా సేవలు అందించడం లేదనే అభిప్రాయం నెలకొని ఉంది.
• ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ గ్రామ, వార్డు సెక్రటేరియట్లను మూడు కేటగిరీలుగా విభజించడం జరిగింది.
• 3,501 జనాభాకు పై బడి ఉన్న సచివాలయాన్ని A కేటగిరీగా, 2,501 నుండి 3,500 వరకూ జనాభా ఉన్న సచివాలయాన్ని B కేటగిరీగా, మరియు 2,500 జనాభా లోపు ఉన్న సచివాలయాన్ని C కేటగిరీగా విభజించడం జరిగింది.
• 3,501 జనాభాకు పై బడి ఉన్న సచివాలయంలో ఎనిమిది మంది ఉద్యోగులను, 2,501 నుండి 3,500 వరకూ జనాభా ఉన్న సచివాలయంలో ఏడుగురిని మరియు 2,500 జనాభా లోపు ఉన్న సచివాలయంలో ఆరుగురు ఉద్యోగులను కేటాయించండ జరిగింది. మల్టీ పర్పస్ ఫంక్షణరీస్, టెక్నికల్ ఫంక్షణరీస్ మరియు ఆస్పిరేషనల్ ఫంక్షణరీన్ గా ఈ ఉద్యోగులను మూడు విభాగాలుగా విభజించడం జరిగింది.
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను మూడు విభాగాలుగా విభజించాలని ప్రభుత్వం నిర్ణయించగా వారిని మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీస్, యాస్పిరేషనల్ సెక్రటరీలుగా విభజిస్తున్నట్లు ఉత్వర్వులో పేర్కొన్నారు. ఉద్యోగుల సంఖ్యను తగ్గించడం పట్ల ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ నిర్ణయం వల్ల దాదాపు 40 వేల ఉద్యోగాలు తగ్గుతాయని ఆందోళన వ్యక్తం చేశాయి.