రూరల్ పోలీసింగ్ ను ప్రజలకు మరింత చేరువ చేస్తాం
రూరల్ పోలీసింగ్ ను ప్రజలకు మరింత చేరువ చేస్తాం
👉 నా తల్లిదండ్రులకు రుణపడి ఉంటా... జిల్లా ఎస్పీ
👉 సిబ్బంది సమష్టి కృషితో మెరుగైన పోలీసింగ్
👉 రూరల్ పోలీసింగ్ ను ప్రజలకు మరింత చేరువ చేస్తాం
👉 జిల్లా నూతన ఎస్పి గా బాధ్యతలు చేపట్టిన ఈ.జి అశోక్ కుమార్
కడప, జనవరి 24 (పీపుల్స్ మోటివేషన్):- జిల్లా నూతన ఎస్పి గా ఈ.జి అశోక్ కుమార్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ముందుగా జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ సిబ్బంది నుండి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జిల్లా ఎస్పి మీడియాతో మాట్లాడారు. కడప జిల్లా కు ఎస్పి గా రావడం సంతోషంగా ఉందన్నారు.
నా తల్లిదండ్రులకు రుణపడి ఉంటా...
అనంతపురం జిల్లా నార్పల తమ స్వగ్రామమని, తమ తల్లిదండ్రులు సుబ్బయ్య, సావిత్రమ్మ లకు తాను రుణపడి ఉంటానన్నారు. తాను 2010 సం,లో గ్రూప్ వన్ పరీక్ష ద్వారా డిఎస్పి గా ఎంపికైన తర్వాత వివిధ ప్రాంతాలలో విధులు నిర్వర్తించడం జరిగిందని, అందులో భాగంగా 2014 సం నుండి 2017 సం. వరకూ దాదాపు 2 సం.ల 10 నెలల పాటు కడప సబ్-డివిజనల్ పోలీస్ అధికారిగా విధులు నిర్వహించడం జరిగిందన్నారు.
రూరల్ పోలీసింగ్ ను ప్రజలకు మరింత చేరువ చేస్తాం...
శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజల భాగస్వామ్యంతో హోమ్ గార్డు స్థాయి నుండి జిల్లా ఎస్పి వరకూ సమష్టిగా కృషి చేస్తామని తెలిపారు. మహిళలు, చిన్నారులు పట్ల అఘాయిత్యాలు జరగకుండా గట్టి చర్యలు తీసుకుంటామన్నారు. అలాంటి నేరాలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేదిలేదని, కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో ఉన్న ప్రజలు జిల్లా ఎస్పి కార్యాలయానికి రావడానికి ఎలాంటి సంకోచానికి గురికావాల్సిన అవసరం లేదన్నారు. సైబర్ నేరాల పట్ల ప్రజలకు అవగాహనా కల్పించడానికి మరింత కృషి చేస్తామన్నారు. రూరల్ పోలీసింగ్ ను ప్రజలకు మరింత చేరువ చేస్తామన్నారు. మేధావులు, మీడియా, ప్రజల భాగస్వామ్యంతోఫ్రెండ్లీ పోలీసింగ్ అందిస్తామన్నారు. తప్పు చేసిన వారికి, తప్పు చేయని వారికి మధ్య తేడా ఏమిటో చెప్పేలా పోలీసింగ్ ఉంటుందన్నారు. తనపై నమ్మకంతో కడప జిల్లా ఎస్పి గా అవకాశం కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు కి, రాష్ట్ర డి.జి.పి సి.హెచ్ ద్వారకా తిరుమల రావు కి ఎస్పి కృతజ్ఞతలు తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని పోలీసింగ్ కు అనుసంధానం చేయడమనే ఆలోచనను జిల్లాలో అమలుచేసేందుకు కృషి చేస్తామని ఎస్పి తెలిపారు.
అదనపు ఎస్.పి (అడ్మిన్) కె.ప్రకాష్ బాబు, అదనపు ఎస్.పి (ఏ.ఆర్) బి.రమణయ్య ఉన్నారు.