మానవత్వం చాటుకున్న మంత్రి పార్ధ సారధి
మానవత్వం చాటుకున్న మంత్రి పార్ధ సారధి
ఏలూరు, జనవరి 16 (పీపుల్స్ మోటివేషన్):- రాష్ట్ర గృహనిర్మాణం,సమాచార పౌర సంబందాల శాఖ మంత్రి కొలుసు. పార్ధ సారధి జాతీయ రహదారి పై జరిగిన ప్రమాదంలో గాయపడిన మహిళను సమీపంలోని ఆసుపత్రికీ పంపించి తన మానవత్వాన్నిచూపించారు.
వివరాల్లోకి వెళితే... గురువారం ఏలూరు లో జరిగిన జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశం ముగించుకొని విజయవాడ కు తిరిగి వస్తుండగా జాతీయ రహదారి పై కలపరు టోల్ ప్లాజా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కోడూరు పాడు కు చెందిన కే.శిరీష తీవ్రంగా గాయపడ్డారు.అదే సమయంలో జాతీయ రహదారి పై వెళుతున్న మంత్రి ప్రమాదాన్ని చూసి తన కాన్వాయిని ఆపి ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు.వెంటనే తన కాన్వాయి లోని మరో వాహనంలో ప్రమాదానికి గురిఅయిన శిరీషను సమీపంలోని పిన్నమనేని హాస్పటిల్ కు తీసుకొని వెళ్ళి వైద్యం చేయించమని తన సిబ్బందిని ఆదేశించారు.పిన్నమనేని ఆసుపత్రి వైద్యులతో మాట్లాడి ప్రమాదానికి గురి అయిన మహిళకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.ఈ ప్రమాదంలో శిరీష తల్లి కూడా స్వల్పంగా గాయపడ్డారు. ప్రమాదం పై మంత్రి స్పందించిన తీరుకు జాతీయ రహదారి పై ప్రాయాణిస్తున్న పలువురు మెచ్చుకున్నారు.