గల్లంతైన యువకుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు
గల్లంతైన యువకుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు
స్వయంగా పరిశీలించిన ప్రకాశం జిల్లా ఎస్పీ A R దామోదర్
👉పర్యాటకులు పోలీస్ వారి సూచనలు, తగు జాగ్రత్తలు పాటిస్తూ విహారయాత్రను జరుపుకోవాలి:జిల్లా ఎస్పీ
పొన్నలూరు మండలం శివన్న పాలెంకు చెందిన నోసిన మాధవ (26 సం), నోసిన నవ్య (21 సం) నోసిన జెస్సికీ (16 సం) కొండా బత్తిన యామిని (15 సం), గురువారం మధ్యాహ్నం సుమారు 1.30 గంటలకు సింగరాయకొండ సమీపంలో ఉన్న పాకల బీచ్ కు వచ్చి సముద్రంలో నీటిలో ఆడుకుంటూ ఉండగా అలల తీవ్రతకు సముద్రంలోకి కొట్టుకొని పోగా వారిలో నవ్యని కాపాడగా మిగిలిన ముగ్గురి మృత దేహాలు లభ్యమయ్యాయి.
సింగరాయకొండ, హనుమాన్ నగర్ కు చెందిన చెందిన తమ్మి శెట్టి పవన్ (22 సం), అతని స్నేహితులు రవి తేజ, రాజేష్ కలసి సముద్రంలో నీటిలో ఆడుకుంటూ ఉండగా అలల తీవ్రతకు సముద్రంలోకి తమ్మి శెట్టి పవన్ (22 సం) సముద్రంలో గల్లంతయినాడు. అతని ఆచూకీ కోసం గజ ఈతగాళ్లు, జాలర్లు సహాయంతో మెరైన్ పోలీసులు మరియు లోకల్ పోలీసుల గాలిస్తున్నారు.
ఈ సంఘటన జరిగిన వెను వెంటనే రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా బాల వీరాంజనేయస్వామి, ప్రకాశం జిల్లా ఎస్పీ A R దామోదర్ మరియు అధికారులు స్వయంగా బీచ్ వద్దకు చేరుకొని ప్రమాదం గురించిన వివరాలు తెలుసుకొని తీరా ప్రాంతంలో పర్యటించి అధికారులకు పలు సూచనలు చేయడం జరిగినది.
అనంతరం పాకల బీచ్ లో గల్లంతైన వారి మృతదేహాలకు కందుకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో నివాళి అర్పించి కుటుంబ సభ్యుల్ని ఓదార్చిన్నారు.
ఈ ప్రమాద ఘటనపై తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన జిల్లా ఎస్పీ మాట్లాడుతూ మధ్యాహ్నం సుమారు 1.30 గంటలకు పొన్నలూరు మండలం,శివన్నపాలెంకు చెందిన నలుగురు పాకాల బీచ్ వద్దకు విహారయాత్ర నిమిత్తం వచ్చినట్లు, వారు సముద్రంలో స్నానం చేస్తుండగా ఒక్కసారిగా ఉవ్వెత్తిన వచ్చిన పెద్ద అలల వలన అందరూ సముద్రంలో మునిగిపోయినట్లు, వెంటనే స్ధానికులు మరియు పోలీసులు అప్రమత్తం అవ్వడంతో వారిలో ఒకరైన నవ్య కాపాడటం జరిగిందని, గల్లంతయిన ముగ్గురు మృతదేహాలు లభ్యమయ్యాయని, తమ్మిశెట్టి పవన్ ఆచూకీ కోసం పడవలతో గజ ఈతగాళ్లు, జాలర్లు సహాయంతో స్థానిక పోలీసులు మరియు మెరైన్ పోలీస్ సిబ్బంది కలిసి ముమ్మరంగా గాలిస్తున్నారని అలల ఉదృతి వలన ప్రమాదం సంభవించిందని తెలిపారు. ప్రస్తుతం రాత్రి సమయంలో గాలింపు చర్యలు ఆపడం జరిగిందని, మరల ఉదయానే గాలింపు చర్యలు మొదలుపెట్టడం జరుగుతుందన్నారు.
జిల్లా ఎస్పీ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ బీచ్ కి పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తున్నారని, వారి కోసం పోలీసు వారు ముందస్తుగానే తగు జాగ్రత్తలు తీసుకున్నారని, ప్రజలందరూ పోలీస్ వారి సూచనలను పాటించాలని, పోలీసు వారు చెప్పిన నియమాలను పాటించడం వలన క్షేమంగా విహారయాత్ర ముగించుకొని గమ్యస్థానానికి చెరుకోవచ్చునని, అలల తీవ్రత వలన ఈ సంఘటన చోటుచేసుకుందని, కావున పోలీసు వారు సూచనలను ఖచ్చితంగా ప్రజలందరూ పాటించాలని కోరారు.
జిల్లా ఎస్పీ వెంట ఒంగోలు డిఎస్పీ ఆర్. శ్రీనివాసరావు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర, సింగరాయకొండ సీఐ హాజరత్తయ్య, ఎస్సైలు మరియు తదితరులు ఉన్నారు.