రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి

Ap inter syllabus Ap inter exam bieap.gov.in BIEAP bie.ap.gov.in results BIE AP gov in 2025 Hall tickets AP Inter hall tickets 2025 download BIEAP new
Peoples Motivation

ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి

ఫిబ్రవరి 10వ తేది నుండి 20వ తేది వరకు ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్, మార్చి 01వ తేది నుండి 20వ తేది ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల నిర్వహణ

-జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా

Kurnool collector Ranjit basha IAS

కర్నూలు, జనవరి 28 (పీపుల్స్ మోటివేషన్):- ఫిబ్రవరి 10వ తేది నుంచి 20వ తేది వరకు ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్ పరీక్షలు, మార్చి 1వ తేది నుండి 20వ తేది వరకు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా సంబధిత అధికారులను ఆదేశించారు.

మంగళవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్, పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్ పరీక్షలు ఫిబ్రవరి 10వ తేది నుండి 20వ తేది వరకు జరగనున్నాయని, 91 పరీక్షా కేంద్రాల్లో 15194 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారని తెలిపారు..ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు మార్చి 1వ తేది నుండి మార్చి 20వ తేది వరకు 69 సెంటర్ల లో 45,325 (మొదటి సంవత్సరం 23,098, రెండవ సంవత్సరం 22227) మంది విద్యార్థులు హాజరు అవుతున్నారన్నారు..ఈ పరీక్షల నిర్వహణకు ఆయా శాఖల అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

ప్రశ్నా పత్రాల భద్రతకు ఆర్మ్డ్ గార్డ్స్ ఏర్పాటు తో పాటు పరీక్ష కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి కలెక్టర్ పోలీస్ అధికారులను ఆదేశించారు.. ఫ్లయింగ్ స్క్వాడ్స్ నియామకం చేయాలని డిఆర్ఓ ను కలెక్టర్ ఆదేశించారు. ప్రశ్నా పత్రాలు స్టోరేజ్ పాయింట్ నుంచి పరీక్ష కేంద్రాలకు వెళ్లే వరకు పోలీసు ఎస్కార్ట్ ఉండాలన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ తో పాటు పరిసరాల్లో జిరాక్స్ సెంటర్లు మూసి ఉంచాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. పరీక్ష కేంద్రాల్లో ప్రతి ఎగ్జామినేషన్ హాల్ లో త్రాగు నీరు ఏర్పాటు చేయాలన్నారు.. పరీక్ష కేంద్రాల్లో సరిపడా లైటింగ్ ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్రాల వద్ద పరిశుభ్రత ఉండేలా మున్సిపల్ కమీషనర్, డిపిఓ చర్యలు తీసుకోవాలన్నారు..ఫస్ట్ ఎయిడ్ కిట్స్, అవసరమైన మందులు ఏర్పాటు చేయాలని డీఎంఎచ్ వో ను ఆదేశించారు..పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ డిఆర్ఓను ఆదేశించారు. 

8 పరీక్ష కేంద్రాల వద్ద బస్సు సౌకర్యం అవసరం ఉందని, అందుకు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆర్టీసీ ఆర్ఎం ను ఆదేశించారు. 

సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కళ్యాణి, డిఆర్ఓ బికె.వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమీషనర్ రవీంద్ర బాబు, డిఎస్పీ బాబుప్రసాద్, ఆర్ఐఓ గురవయ్య శెట్టి, డివిఓ పరమేశ్వర్ రెడ్డి, పరీక్షల స్పెషల్ ఆఫీసర్ లాలప్ప, ఎస్ఎస్ఎ పిఓ శ్రీనివాసులు, ఆర్టీసీ ఆర్ఎం శ్రీనివాసులు, ఎస్ఎస్ఈ ఎగ్జామ్స్ అసిస్టెంట్ కమీషనర్ చంద్రభుషణం విద్యుత్, వైద్య, కార్మిక శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Comments

-Advertisement-