డిజిటల్ అరెస్టు ముసుగులో అమాయకుల్ని మోసం చేస్తూ కోట్లు దోచుకుంటున్న ముఠా గుట్టు రట్టు
డిజిటల్ అరెస్టు ముసుగులో అమాయకుల్ని మోసం చేస్తూ కోట్లు దోచుకుంటున్న ముఠా గుట్టు రట్టు
➡️ ఆరుగురు ముద్దాయిల అరెస్ట్, వారి వద్ద నుండి 32.5 లక్షల నగదు, 141 గ్రాముల బంగారం (విలువ సుమారు 10 లక్షలు) 8 సెల్ ఫోన్ లు, 2 ల్యాప్ టాప్, 1 Sim Modules, 8 Routers మరియు ఒక ముద్దాయి అకౌంట్లోని బాధితురాలి 10 లక్షల నగదు ఫ్రీజ్.
➡️ ముంబై క్రైమ్ పోలీసులని, సి.బి.ఐ అధికారులమని చెప్పే వారి మాటలను నమ్మకండి.
➡️ హై ప్రొఫైల్ వ్యక్తులే కాదు, సాధారణ వ్యక్తులను కూడా ఎంచుకుని డబ్బులు కొట్టేస్తున్నారు సైబర్ కేటుగాళ్లు.
తిరుపతి జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం నందు ఏర్పాటు చేసిన పత్రికా సమావేశం నందు కేసు వివరాలను వెల్లడించారు.
జిల్లా ఎస్పీ మాట్లాడుతూ తిరుపతి నగరానికి చెందిన సీనియర్ సిటిజన్ సుమారు 65 సం., వయసు కలిగిన మహిళకు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ మరియు WhatsApp వీడియో కాల్స్ చేసి, ఢిల్లీ సిబిఐ అధికారులమని 200 కోట్లు మనీ ల్యాండరింగ్ కేసు లో బాధితరాలు పేరు మీద ఉన్నబ్యాంక్ అకౌంట్ ను చట్ట వ్యతిరే కార్యకలాపాలకు వినియోగిస్తూ లావాదేవీలు జరుపుతున్నారని అందువలన అరెస్ట్ చేస్తామని భయభ్రాంతులకు గురి చేసి, వివిధ అకౌంట్లు కు ఆమె నగదు ట్రాన్స్ఫర్ చేస్తే వాటిని పరిశీలించి సదరు డబ్బులు మనీలాండరింగ్ కేసులో ఇన్వాల్వ్ కాకపోతే రిలీజ్ చేస్తామని మాయ మాటలు చెప్పి నమ్మించి ఆమె వద్ద నుంచి 2.5 కోట్లు నగదును వివిధ అకౌంట్లో జమ చేసుకోవడం జరిగింది. తరువాత వారు స్పందించకపోవడంతో సైబర్ నేరం జరిగినట్లు గ్రహించి సదరు మహిళ 13-01-2025 తేదీన తిరుపతి జిల్లా వెస్ట్ పోలీస్ స్టేషన్ నందు సంప్రదించగా సదరు పిర్యాదు పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.
కేసు దర్యాప్తులో భాగంగా ఇంతకుముందు వెస్ట్ పోలీస్ స్టేషన్ సిఐ వారు రాజమండ్రి కి చెందిన పాలకొల్లు అరుణ్ వినయ్ కుమార్ అనే ముద్దాయిని అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 24.5 లక్షల నగదు, ఒక XUV 700 కారు, రెండు సెల్ ఫోన్లు, రెండు ల్యాప్ టాప్స్ లు, 16 గ్రాములు బంగారు, నేరం చేయడానికి సాంకేతికంగా ఉపయోగించిన పరికరాలును స్వాధీనం చేసుకోవడం జరిగింది. అంతే కాకుండా అతని అకౌంట్లులో ఉన్న బాధిత మహిళ యొక్క 26 లక్షల నగదు లావాదేవీలను ఫ్రీజ్ చేయడమైనది.
కేసు తదుపరి దర్యాప్తులో భాగంగా, కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకొని జిల్లా ఎస్పి ఆదేశాల మేరకు, Addl. S.P. Admin వారి ఆధ్వర్యంలో సైబర్ క్రైమ్, క్రైమ్, వెస్ట్ పోలీసు వారితో టీం ను ఏర్పాటు చేసి ఈ కేసుకు సంబంధించిన ఆరుగురు ముదాయిలను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 32.5 లక్షల నగదు, 141 గ్రాముల బంగారం, 8 సెల్ ఫోన్ లు, 2 ల్యాప్ టాప్, 1 Sim Modules, 8 Routers మరియు ఒక ముద్దాయి అకౌంట్లోని బాధితురాలి 10 లక్షల నగదు ఫ్రీజ్ చేయడమైనది. ముద్దాయిలు ఎలాగైనా డబ్బులు సంపాదించాలి అనే దురుద్దేశంతో తో mediator ల సహాయం తో కంబోడియా దేశం వెళ్ళి అక్కడ జీతానికి కస్టమర్ సపోర్ట్ గా పని చేస్తూ, టెక్నాలజీ ఉపయోగించి సైబర్ క్రైమ్ ఎలా చేయాలో ట్రైనింగ్ పొంది, సైబర్ నేరాలకు పాల్పడి విశాఖపట్నం వచ్చి ఒక రూమ్ తీసుకొని అందులో నేరానికి ఉపయోగపడే సామాగ్రి SIM Module, Routers, Hi-Speed internet connections ఉంచి ఇక్కడి నుండే సైబర్ నేరాల పాల్పడాలని ప్రయత్నిస్తుండగా వారిపై దాడి చేసి వారిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీరు అమాయకులకు డబ్బులు ఆశ చూపి బ్యాంక్ అకౌంటు లు ఓపెన్ చేయించి వాటి ద్వారా నేరానికి పాల్పడినట్లు తెలిసింది.
ఇప్పటి దాకా ఈ కేసులో 7 మంది ముద్దాయిలను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 57 లక్షల నగదు మరియు 38 లక్షల విలువ చేసే బంగారం ఇతర వస్తువులను స్వాధీనం చేసుకోవడమైనది మరియు ముద్దాయి అకౌంట్లు లో ఉన్న బాధిత మహిళ యొక్క 36 లక్షల నగదు లావాదేవీలను ఫ్రీజ్ చేయడమైనది.
ముద్దాయిల వివరాలు:
1. సింగంపల్లి గణేష్, వయస్సు: 34 సం., త్రినాదపురం, విశాఖపట్నం.
2. పాలకొల్లు రవికుమార్, వయస్సు: 28 సం., చిన్న వాల్తేరు, విశాఖపట్నం .
3. యుల్లి జగదీష్, వయస్సు: 37 సం., సత్య నగర్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, కంచర పాళెం, విశాఖపట్నం.
4. పెంకి.ఆనంద్ సంతోష్ కుమార్ @సంతోష్, వయస్సు: 39 సం., రామ్ నగర్, శ్రీ హరిపురం, మల్కాపురంపోస్ట్ & మండలం, విశాఖపట్నo.
5. ఊటా అమర్ ఆనంద్, వయస్సు:33 సం., సుజాతా నగర్, గొల్లవెల్లివాని పాళెం, LIC కాలనీ, పెందుర్తి మండలం, విశాఖపట్నం రూరల్.
6. కర్రి.వాసుదేవ్, వయస్సు:34 సం., మురళి నగర్, విశాఖపట్నం.
ప్రజలకు ముఖ్య సూచనలు:
• గత కొద్దిరోజులుగా దేశ వ్యాప్తంగా అనూహ్యంగా డిజిటల్ అరెస్టుల కేసుల సంఖ్య పెరుగుతూ ఉంది.
• హై ప్రొఫైల్ వ్యక్తులే కాదు, సాధారణ వ్యక్తులను కూడా ఎంచుకుని డబ్బులు కొట్టేస్తున్నారు సైబర్ కేటుగాళ్లు. ఏ దర్యప్తు సంస్థ లు కూడా వీడియో కాల్స్ ద్వారా అరెస్టులు చేయవు.
• OTP-లు లేదా బ్యాంకు వివరాలు ఎవరితోనూ పంచుకోవద్దు. తెలియని లావాదేవీలు చేయకుండా జాగ్రత్తగా ఉండాలి. మీ బ్యాంకు, వ్యక్తిగత వివరాలను తెలియని వారు ఎవరితోనూ పంచుకోకూడదు.
• తెలియని నెంబర్ నుండి వాట్సప్ వీడియో కాల్ వస్తె స్పందించకూడదని అవసరమైన సమయంలో సైబర్ టోల్ ఫ్రీ నెంబర్ 1930 లేదా 112 లేదా తిరుపతి పోలీసు వారి WhatsApp నెంబర్ 80999 99977 లకు ఫోన్ చేసి సహాయం పొందవచ్చునని జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు కోరారు.
• తిరుపతి జిల్లా పోలీస్ వారు సైబర్ క్రైమ్ నిపుణుల ద్వారా జిల్లా వ్యాప్తంగా జూమ్ కాన్ఫరెన్స్ లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసారు. సైబర్ క్రైమ్ అవేర్నెస్ ప్రోగ్రాం లో భాగంగా Hon’ble DGP జూమ్ కాన్ఫరెన్స్ లో సైబర్ క్రైమ్ కు సంబంధించి ప్రజలకు సూచనలు ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా తిరుపతి జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏమంటే ఎప్పుడు కూడా ముంబై సైబర్ క్రైమ్ అని మరియు సి.బి.ఐ అని, మీరు మనీ లాండరింగ్ కేసులని, ఫేక్ కాల్స్, ఫేక్ వీడియోస్ కానీ మీ పేరు మీద ఒక డ్రగ్స్ పార్సల్ వచ్చిందని, ఫేక్ పాస్పోర్ట్ లో ఉన్నాయని, ఇలాంటివి ఎవరు కూడా నమ్మవద్దు ఎటువంటి పరిస్థితుల్లో కూడా డిజిటల్ అరెస్టులు జరగవు. ఎవరన్నా చేయాలి అనుకుంటే నేరుగా ఇంటి దగ్గరకే వస్తారు కానీ ఫోన్లో ద్వారా ఎవరు అరెస్టులు చేయలేరు. ఈ విధమైన కాల్స్ వచ్చినప్పుడు వెంటనే డయల్ 100 కు ఫోన్ చేయాలి వెంటనే ఆ యొక్క మొబైల్ నెంబర్ను బ్లాక్ చేయడం గానీ డబ్బులు ఫ్రీజ్ చేయడం గాని జరుగుతుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండి వెంటనే డయల్ 100 కు కాల్ చేయాలని జిల్లా ఎస్పీ తెలియపరిచారు.
ఈ కేసు లో ప్రతిభ కనబరిచిన వెస్ట్ సిఐ మురళీ మోహన్, సైబర్ క్రైమ్ సిఐ వినోద్ కుమార్, CCS సిఐ ప్రకాష్ కుమార్, ఎస్ఐ లు మరియు సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ లు వెంకట్రావు పరిపాలన, రవిమనోహరాచారి శాంతి భద్రతలు, మహిళా డి.యస్.పి శ్రీలత, సి.ఐ లు మురళి మోహన్ వెస్ట్, వినోద్ కుమార్ సైబర్ ల్యాబ్, యస్.ఐ అనిల్ కుమార్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.