ప్రతి మూడో శనివారం స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివాస్
ప్రతి మూడో శనివారం స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివాస్
• దేశంలోనే అత్యంత పరిశుభ్ర రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దాలనే లక్ష్యం..
• నెల కొక థీమ్ తో 12 మాసాలకు 12 థీమ్లతో కార్యక్రమ నిర్వహణకు చర్యలు..
• 18 న కడప జిల్లా మైదుకూరులో కార్యక్రమాన్ని ప్రారంభించనున్న ముఖ్యమంత్రి.
- ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్
క్యాంఫైన్ మోడ్ లో నిర్వహించాలని సూచించిన పురపాల శాఖ మంత్రి పి.నారాయణ
అమరావతి, జనవరి 16 (పీపుల్స్ మోటివేషన్):- దేశంలోనే అత్యంత పరిశుభ్ర రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో నెలలో ఒక శనివారం “స్వచ్ఛత" కోసం అంకితం కావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు ఇకపై ప్రతి మూడో శనివారం “స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివాస్” కార్యక్రమాన్ని భారీ స్థాయిలో నిర్వహించేందుకు చర్యలు చేపట్టడమైందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ తెలిపారు. ఈ నెల 18 వ తేదీన కడప జిల్లా మైదుకూరులో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్న ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతంగా నిర్వహించేందుకు రాష్ట్ర స్థాయి నుండి గ్రామ స్థాయి అధికారుల వరకూ ప్రతి ఒక్కరూ అంకిత భావంతో భాగస్వామ్యులు కావాలని ఆయన పిలుపునిచ్చారు. గురువారం రాష్ట్ర సచివాలయం నుండి అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆయన వీడియో కాన్పరెన్సు నిర్వహించి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు తగిన సూచనలు, ఆదేశాలను జారీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమ నిర్వహణకు సంబందించిన మార్గదర్శకాలను ఇప్పటికే అన్ని జిల్లాల కలెక్టర్లకు కమ్యునికేట్ చేయడం జరిగిందని, ఆ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని క్షేత్ర స్థాయిలో విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్లు తగిన శ్రద్ద చూపాలన్నారు. సత్ ఫలితాలను ఆశిస్తూ ఈ నెల నుండి వచ్చే 12 నెలల పాటు నెల కొక థీమ్ తో 12 మాసాలకు 12 థీమ్ లతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు చర్యలు చేపట్టడం జరిగిందన్నారు.
12 నెలలకు-12 థీమ్స్
జనవరి మాసంలో న్యూ ఇయర్ - క్లీన్ స్టార్ ధీమ్ తోను,
ఫిబ్రవరి మాసంలో సోర్సు-రిసోర్సు థీమ్ తోను,
మార్చిలో అవాయిడ్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ – ప్రమోట్ రీయూజబుల్స్ థీమ్ తోను ,
ఏప్రిల్ లో ఇ-చెక్ థీమ్ తోను,
మే లో నీరు-మీరు థీమ్ తోను,
జూన్ లో బీట్ ది హీట్ థీమ్ తోను,
జులై లో ఎండింగ్ ప్లాస్టిక్ పొల్యూషన్ థీమ్ తోను,
ఆగస్టు లో మాన్ సూన్ హైజనిక్ థీమ్ తోను,
సెప్టెంబరు లో గ్రీన్ ఏ.పి. థీమ్ తోను,
అక్టోబరులో క్లీన్ ఎయిర్ థీమ్ తోను,
నవంబరులో పెర్సనల్ & కమ్యునిటీ హైజిన్ థీమ్ తోను మరియు
డిశంబరు మాసంలో ఆపర్చునిటీస్ ఇన్ ఇన్విరాన్మెంట్ థీమ్ తోను ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.
పర్యావరణ పరిరక్షణ అంశంలో కమ్యునిటీ ఎంగేజ్ మెంట్ ను ప్రోత్సహించడం, పరిశుభ్రమైన వాతావరణం ద్వారా ప్రజారోగ్య పరిరక్షణ, పర్యావరణంపై కాలుష్య ప్రభావాన్ని తగ్గించడం, పర్యాటకులు, యాత్రికులు మరియు పెట్టుబడిదారులను మరింత ఆహ్వానించే విధంగా ఆహ్లదకరమైన వాతావరణాన్ని కల్పించడం, ఆర్థిక ప్రయోజనాలను మెరుగుపర్చడం మరియు పిల్లలు, భవిష్యత్ తరాల వారికి పర్యావరణ పరిశుభ్రతపై అవగాహన కల్పించడం అనే లక్ష్యాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిదులను, అన్ని వర్గాల ప్రజలను పెద్ద ఎత్తున భాగస్వామ్యులను చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమ నిర్వహణలో పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మరియు పురపాలక, పట్టణాభివృద్ది శాఖ కీలక భూమిక పోషించాల్సి ఉందని, అందుకు తగ్గట్టుగా ఆయా శాఖల అధికారులు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించే అంశంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన సూచించారు.
ఈ సమావేశంలో వర్చువల్ గా పాల్గొన్న రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ మట్లాడసుతూ ఈ కార్యక్రమాన్ని క్యాంపైన్ మోడ్ లో నిర్వహించాలని, ఈ కార్యక్రమంపై ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని, రాష్ట్రంలోని ప్రతి నియోజక వర్గంలో పెద్ద ఎత్తున ప్రజల భాగస్వామ్యంతో మానవ హారాన్ని నిర్వహించాలని కోరారు. అందుకు తగ్గట్టుగా అన్ని జిల్లాల కలెక్టర్లకు తగు ఆదేశాలు జారీ చేయాలని ఆయన కోరారు.
రాష్ట్ర పంచాయితీ రాజ్ & గ్రామీణాభివృద్ది శాఖ ప్రిన్సిఫల్ సెక్రటరీ శశిభూషన్, ముఖ్యమంత్రి కార్యదర్శి ప్రధ్యుమ్న, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ బి.అనిల్అ కుమార్ రెడ్డి, రాష్ట్ర పురపాల & పట్టణాభివృది శాఖ కార్యదర్శి కన్నబాబు, పంచాయితీ రాజ్ శాఖ కార్యదర్శి కృష్ణచైతన్య తదితరులు మాట్లాడుతూ ఈ కార్యక్రమ నిర్వహణకు జిల్లా కలెక్టర్లు, అధికారులు నిర్వహించాల్సిన విధి విదానాలను వివరించారు.