మదరసా ఉపాధ్యాయులకు నిలిచిపోయిన వేతనాలకు త్వరలో పరిష్కారం
General News telugu latest news telugu intresting news telugu intresting facts
Job news health news TS TET TS DSC AP TET AP DSC Tenth Hall Tickets
By
Peoples Motivation
మదరసా ఉపాధ్యాయులకు నిలిచిపోయిన వేతనాలకు త్వరలో పరిష్కారం
- రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్
రాష్ట్రంలోని మదరసాల్లో సర్వ శిక్ష అభియాన్ కు అనుబంధంగా విద్యా బోధన చేసిన ఉపాధ్యాయులకు పెండింగ్ వేతనాల చెల్లింపు సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పేర్కొన్నారు. మంగళవారం అమరావతి లోని సచివాలయం మంత్రి పేషీ కార్యాలయంలో మంత్రి ఫరూక్ ను మదరసాలలో సామాన్య శాస్త్రం, సాంఘిక శాస్త్రం బోధించే ఉపాధ్యాయులు కలిసి తాము ఎదుర్కొంటున్న సమస్యను వివరించారు. గత ఐదు సంవత్సరాలుగా తమకు జీతాలు ఇవ్వకుండా సర్వ శిక్ష అభియాన్ నిలిపివేసిందని , ఆర్థిక సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు వెల్లడించారు. ఈ విషయంపై మంత్రి ఫరూక్ మాట్లాడుతూ విద్యా,ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ గారితో చర్చించి వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
సంక్షేమ పథకాలపై మంత్రుల చర్చ
కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాల అమలు, ప్రజాభిప్రాయాల సంతృప్తి తదితర అంశాలపై మైనారిటీ, బీసీ సంక్షేమం, సాంఘిక సంక్షేమం మంత్రిత్వ శాఖల మంత్రులు చర్చించారు. న్యాయ,మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పేషీ లో బీసీ సంక్షేమ, చేనేత శాఖ మంత్రి ఎస్ సవితమ్మ, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి లు సమావేశమయ్యారు. గత ప్రభుత్వ అరాచక పాలనలో సర్వనాశనమైన రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు క్షేత్రస్థాయిలో ప్రజల చెంతకు చేరే విధంగా వెనుకబడిన, మైనారిటీ సంక్షేమ శాఖలు సమన్వయంతో, సమిష్టితో ముందుకు సాగాల్సిన అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉందని మంత్రులు అభిప్రాయపడ్డారు.
Comments