టెన్త్ లో వంద శాతం ఫలితాలు సాధించాలి
10th Class results
SSC Public examination 2025
Bseap.gov.in
Tenth hall tickets
Tenth Exams Time Table
Tenth Exams updates
TS Tenth Exams updates
By
Peoples Motivation
టెన్త్ లో వంద శాతం ఫలితాలు సాధించాలి
-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత
అమరావతి : కార్పొరేట్ కు ధీటుగా రాబోయే పదో తరగతి పరీక్షల్లో వంద శాతం ఫలితాలు సాధించాలని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత స్పష్టంచేశారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో మంత్రి సవితను ఎంజేపీ గురుకుల పాఠశాల ఉద్యోగుల అసోసియేషన్ ప్రతినిధులు కలిశారు. పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చి, వాటి పరిష్కారానికి కృషి చేయాలని కోరుతూ వినతి పత్రమందజేశారు. ఈ సందర్భంగా మంత్రి సవిత స్పందిస్తూ, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రాబోయే పదో తరగతి పరీక్షలను దృష్టిలో పెట్టుకుని విద్యార్థుల సన్నద్ధతతో పాటు అన్ని సబ్జెక్టుల్లోనూ పాఠాలు రివిజన్ ప్రారంభమైందా..? అని అడిగి తెలుసుకున్నారు. రాబోయే నెల రోజుల ఎంతో కీలకమని, విద్యార్థుల విద్యా ప్రగతిపై అధ్యాపకులకు ఇప్పటికే ఒక అవగాహన కలిగి ఉంటారని, సబ్జెక్టుల వారీగా వెనుకబడిన విద్యార్థులను గుర్తించి, ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు. పరీక్షల పేరుతో మానసిక ఒత్తిడికి గురి చేయొద్దన్నారు. టెన్త్ లో వంద శాతం ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బంది కృషి చేయాలన్నారు. సీఎం చంద్రబాబునాయుడు ఎంజేపీ స్కూళ్లు, హాస్టళ్ల విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారన్నారు. గత ప్రభుత్వం పెట్టిన అన్ని రకాల బకాయిలు చెల్లించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ఉద్యోగులతో సైతం ప్రభుత్వం సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తోందన్నారు. సీఎం చంద్రబాబునాయుడు ఆశయ సాధనలో భాగంగా రాబోయే టెన్త్ పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించాలని ఎంజేపీ ఉద్యోగులకు మంత్రి సవిత దిశా నిర్దేశం చేశారు. అంతుకుముందు మంత్రి సవితను ఎంజేపీ ఉద్యోగ సంఘ నాయకులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంజేపీ గురుకుల పాఠశాల ఉద్యోగుల అసోసియేషన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Comments