విద్యార్థులతో స్కూలుకు వెళుతున్న ఆటో బోల్తా.. విద్యార్థి మృతి
10TH CLASS STUDENT DIED IN KURNOOL
General News telugu latest news telugu intresting news telugu intresting facts
Job news health news TS TET TS DSC
By
Peoples Motivation
విద్యార్థులతో స్కూలుకు వెళుతున్న ఆటో బోల్తా.. విద్యార్థి మృతి
>> స్కూలుకు వెళుతున్న ఆటో బోల్తా..
>> పదో తరగతి విద్యార్థిని మృతి..
>> కుటుంబం విషాదం నింపిన ఘటన..
పాఠశాలకు ఆటోలో వెళ్తున్న పదో తరగతి విద్యార్థిని వాహనం బోల్తా పడి మృతి చెందిన ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. బడికెళ్లిన కుమార్తె తిరిగి వస్తుందనుకున్నారు. రోజు మాదిరిగానే వెళ్లిన బిడ్డ తిరిగిరాని లోకాలకు వెళ్తుందని ఆ తల్లిదండ్రులు కలలో కూడా ఊహించి ఉండరు. ఆటో రూపంలో మృత్యువు కబళించడంతో ఆ కుటుంబం శోక సంద్రంలో మునిగింది.
ముగ్గురు విద్యార్థులకు తీవ్ర గాయాలు:
కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం సుంకేశ్వరి గ్రామానికి చెందిన విద్యార్థులు విద్యానగర్ ప్రభుత్వ పాఠశాలకు ఆటోలో బయలుదేరారు. కొద్ది దూరం వెళ్లేసరికి వెనక నుంచి వేగంగా వచ్చిన మరో ఆటో దీన్ని ఢీ కొట్టింది. దీంతో ఆటో బోల్తా పడింది. ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు విద్యార్థులకు తీవ్ర గాయాలవ్వగా పదో తరగతి విద్యార్థిని అనూష పరిస్థితి విషమంగా ఉండటంతో ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఆటో రూపంలో మృత్యువు కబళించడంతో ఆ కుటుంబం శోక సంద్రంలో మునిగింది.
Comments