రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

ఏకలవ్య పాఠశాల ఆరో తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

Ekalavya Model School apply online twreiscet.apcfss.in TS Ekalavya Model School EMRS tstwgurukulam.ap.gov.in online application TG EMRS ONLINE APPLY
Peoples Motivation

ఏకలవ్య పాఠశాల ఆరో తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

• ఏకలవ్య పాఠశాల ఆరో తరగతి ప్రవేశాలు..

• ఎంపికైన విద్యార్థులకు ఉచిత భోజనం, విద్య, వసతి, శిక్షణ..

Ekalavya Model School apply online twreiscet.apcfss.in TS Ekalavya Model School EMRS tstwgurukulam.ap.gov.in online application TG EMRS ONLINE APPLY

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని ఏకలవ్య ఆదర్శ గురుకుల విద్యాలయాల సంస్థ పరిధిలోని 23 ఏకలవ్య ఆదర్శ గురుకుల విద్యాలయాల్లో 2025-26 విద్యా సంవత్సరానికి గాను ఆరో తరగతి ప్రవేశాలను ప్రకటన విడుదలైంది. ఎంపికైన విద్యార్థులకు ఉచిత వసతి, భోజనం, విద్య, శిక్షణ ఉంటుంది. బోధనా మాధ్యమం ఆంగ్లంలో సీబీఎస్ఈలో బోధిస్తారు. అర్హులైన గిరిజన, ఆదివాసి గిరిజన, సంచార గిరిజన, పాక్షిక సంచార గిరిజన, డీనోటిఫైడ్ ట్రైబ్ కేటగిరీలకు చెందిన విద్యార్థులు ఫిబ్రవరి 16వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు మార్చి 16వ తేదీన ప్రవేశ పరీక్ష ఉంటుంది.


ప్రవేశాలు:-  

తెలంగాణ ఏకలవ్య మోడల్‌ గురుకుల విద్యాలయాల్లో 6వ తరగతి ప్రవేశాలు


పరీక్ష పేరు:- 

ఈఎంఆర్‌ఎస్‌ సెలెక్షన్‌ టెస్ట్‌(ఈఎంఆర్‌ఎస్‌ఎస్‌టీ)- 2025


సీట్ల వివరాలు:-

ప్రతి ఏకలవ్య ఆదర్శ గురుకుల విద్యాలయంలో 6వ తరతగతిలో 60 సీట్ల చొప్పున మొత్తం 23 విద్యాలయాల్లో 1,380(690 బాలురు, 690 బాలికలు) సీట్లు ఉన్నాయి.


అర్హతలు:- 

ఆరో తరతగతిలో ప్రవేశాలు పొందలనుకునే విద్యార్థులు తప్పనిసరిగా 2023-24 లేదా 2024-25 విద్యాసంవత్సరంలో ఏదైనా ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన స్కూల్‌లో 5వ తరగతి చదివి ఉండాలి. ఇంటివద్ద ఐదో తరగతి చదివిన వారు కూడా అర్హులే. విద్యార్థి తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.రెండు లక్షలు(పట్టణ ప్రాంతం), రూ.లక్షన్నర(గ్రామీణ ప్రాంతం)కు మించకూడదు.


వయోపరిమితి:-

మార్చి 31, 2025 నాటికి ఆరో తరగతి చదివేందుకు 10-13 ఏళ్ల మధ్య ఉండాలి. 31.03.2012 నుంచి 31.03.2015 మధ్య జన్మించి ఉండాలి. దివ్యాంగులకు రెండేళ్ల వయసు సడలింపు ఉంటుంది.


ఎంపిక విధానం:-

రాత పరీక్ష, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా విద్యార్థులను షార్ట్లిస్ట్ చేస్తారు.


పరీక్ష విధానం:-

100 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది.

మెంటల్‌ ఎబిలిటీ - 50 ప్రశ్నలు

అరిథ్‌మెటిక్‌ - 25 ప్రశ్నలు

తెలుగు, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్ -25 ప్రశ్నలు

ఈ అంశాల్లో ప్రశ్నలు అడుగుతారు. తెలుగు, ఇంగ్లిష్‌ మీడియంలో పరీక్ష నిర్వహిస్తారు.

దరఖాస్తు ఫీజు : రూ.100.

దరఖాస్తు విధానం:- 

ఆసక్తి కలిగిన విద్యార్ధులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

వెబ్సైట్ : https://tsemrs.telangana.gov.in/

ముఖ్య తేదీలు

దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ- 16-02-2025

ప్రవేశ పరీక్ష నిర్వహణ- 16.03.2025

పరీక్ష ఫలితాల ప్రకటన- 31.03.2025

మొదటి దశ ప్రవేశాలు- 31.03.2025

Comments

-Advertisement-