రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

ప్రపంచంలోనే అత్యంత పొడవైన రహదారి.. విశేషాలు

The Longest Road In The World General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET
Peoples Motivation

ప్రపంచంలోనే అత్యంత పొడవైన రహదారి.. విశేషాలు

• రెండు ఖండాలు, 14దేశాల మీదుగా ప్రయాణం..

• 30వేల కిలోమీటర్ల పొడవైన పాన్ అమెరికా రహదారి..

• 'పాన్ అమెరికా హైవే'పై డ్రైవ్ పూర్తి చేయాలంటే నెలలు పడుతుందట..

The Longest Road In The World General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET

ప్రపంచంలోనే అత్యంత పొడవైన రహదారి ఎక్కడ ఉందో మీరు ఊహించగలరా? మహా అయితే రెండు, మూడు వేల కిలోమీటర్లు లేదంటే పది వేల కిలోమీటర్లు ఉండొచ్చని అంచనా వేసుంటారు. కానీ ఆ అతిపెద్ద హైవే పొడవు 30వేల కిలోమీటర్లు అంటే మీరు నమ్మగలరా? దాదాపు 14 దేశాల మీదుగా వెళ్లే రహదారిని పాన్-అమెరికన్ హైవే గా పిలుస్తారు. ఈ హైవే అలాస్కాలోని ప్రూడో బే నుంచి అర్జెంటీనాలోని ఉషుయా వరకు విస్తరించి ఉంది. ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా ఖండాల్లో విస్తరించిన ఈ రహదారిని 1889లో మొదట ప్రతిపాదించారు. ఈ రహదారిలో వివిధ వాతావరణాలు, ప్రకృతి దృశ్యాలు కనిపిస్తాయి. రహదారిపై డ్రైవ్ పూర్తి చేయడానికి నెలలు సమయం పడుతుందని అంచనా..

The Longest Road In The World General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET

పాన్ అమెరికా రహదారి తర్వాత ఆస్ట్రేలియా హైవే ద్వితీయ స్థానంలో నిలుస్తోంది. దాదాపు 14,500 కిలోమీటర్ల పొడవున్న ఈ హైవే ప్రపంచంలోనే అతి పొడవైన జాతీయ రహదారి. ఆస్ట్రేలియాలోని అన్ని ప్రధాన నగరాల మీదుగా, ఎడారులు, అడవులు, అందమైన బీచ్‌లను కలుపుకొని వెళ్తుంది. ఇక మనదేశంలో అతి పొడవైన జాతీయ రహదారి 44వ నంబర్ రహదారి. ఇది జమ్మూ కశ్మీర్లోని శ్రీనగర్లో ప్రారంభమై తమిళనాడులోని కన్యాకుమారి వరకు విస్తరించి ఉంది. ఈ రహదారి ఉత్తర, దక్షిణ భారత రాష్ట్రాలను కలుపుతూ వెళ్తుంది. దాదాపు 3,700 కిలోమీటర్ల పొడవైన ఈ రోడ్డు జమ్మూ కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు మీదుగా వెళ్తుంది.

Comments

-Advertisement-