వెల్దుర్తిలో ఇండియన్ గ్యాస్ పైసా వసూల్..
వెల్దుర్తిలో ఇండియన్ గ్యాస్ పైసా వసూల్..
వెల్దుర్తి/కర్నూలు, జనవరి 17 (పీపుల్స్ మోటివేషన్):-
ఇండియన్ గ్యాస్ పైసా వసూల్ చేస్తున్నట్లు వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ద్వీపం పథకం కింద సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తున్న విషయం తెలిసిందే. దాని ధరకు అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారని ప్రజలు వాపోతున్నారు.
స్థానిక వివరాల్లోకి వెళితే.. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం లోని చాలా గ్రామాలలో సంపూర్ణ ఇండియన్ గ్యాస్ బుకింగ్ ధరపై అదనంగా రూ. 100/- చెల్లిస్తున్నామని వినియోగదారులు చెబుతున్నారు. చాలా కాలం నుంచి ఇలా జరుగుతున్న సంబంధిత అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఒక వినియోగదారు మాట్లాడుతూ ఇలా.. ఒక్కొక్క కనెక్షన్ నుంచి సంవత్సరానికి మూడుసార్లు బుకింగ్ చేసుకున్నా రూ. 300/- అలా సంవత్సరానికి ఒక్కో గ్రామం నుంచి ఎంత వసూల్ చేస్తున్నారో సంబంధిత అధికారులు దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.
ఎటువంటి అదనపు ఛార్జీ లు చెల్లించవద్దు..
కర్నూలు జిల్లా ప్రజలకు LPG గ్యాస్ వినియోగదారులకు తెలియ పరచటం ఏమనగా ఉచిత డెలివరీ జోన్ (FDZ-ఆపరేషనల్ ఏరియా) అనగా 15 కిలోమీటర్ ల లోపు ఉన్న LPG వినియోగదారునికి LPG రీఫిల్ డెలివరీ సమయంలో ఎటువంటి అదనపు ఛార్జీ లు చెల్లించవలసిన అవసరం లేదని 15 KM పరిధి దాటిన వినియోగదారులు రీఫిల్ డెలివేరి కి కేవలం రూ. 30/- అధనంగా చెల్లించవలెనని. సిలిండర్ డెలివరీ చేసినపుడు ఏవరైనా డెలివరీ బాయ్ బిల్లు ధర కన్నా అధికమొత్తాలను వసూలు చేస్తుంటే, వినియోగదారులు సంబంధిత జిల్లా పౌర సరఫరాల అధికారి, కర్నూలు వారికి లేదా. కర్నూలు నగర సహాయ పౌర సరఫరాల అధికారి వారికి లేదా సంబంధిత పౌర సరఫరాల డిప్యూటీ తాసీల్దార్, లేదా సంబంధిత మండల తాసీల్దార్ వారికి లేదా ఆయిల్' మార్కెటింగ్ కంపెనీ సేల్స్ ఆఫీసర్ కు వారికి లేదా టోల్ ఫ్రీ నంబర్ 1967 ద్వారా ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్ కు మరియు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ యొక్క టోల్ ఫ్రీ నంబర్ 18002333555కు ఫిర్యాదు చేయవచ్చుని తెలిపారు.