రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

రాష్ట్రంలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ తేదీలు ప్రకటన

TS EAMCET 2025 exam date EAMCET 2025 application date TS EAMCET 2025 syllabus TS EAMCET official website Eamcet exam shedule Eamcet exam dates PGCET
Peoples Motivation

రాష్ట్రంలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ తేదీలు ప్రకటన

తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశ పరీక్షల సీజన్ మొదలైంది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు నిర్వహించే వివిధ రకాల ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ను ఉన్నత విద్యా మండలి విడుదల చేసింది. ఈఏపీసెట్, ఎడ్సెట్, ఐసెట్, లాసెట్ సహా అన్ని రకాల ప్రవేశ పరీక్షల తేదీలను ప్రకటించింది.

TS EAMCET 2025 exam date EAMCET 2025 application date TS EAMCET 2025 syllabus TS EAMCET official website Eamcet exam shedule Eamcet exam dates  PGCET

పరీక్షలు జరిగే తేదీలు వివరాలతో పూర్తి వివరాలు..

ప్రవేశ పరీక్ష పేరు- పరీక్ష తేదీ

అగ్రికల్చర్- ఏప్రిల్ 29

ఫార్మసీ- ఏప్రిల్30

ఈసెట్- మే 12

ఎడ్సెట్- జూన్ 1

లాసెట్, పీజీ లాసెట్- జూన్ 6

ఐసెట్- జూన్ 8, 9

పీజీఈసెట్- జూన్ 16 నుంచి 19 వరకు

ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఎంతో కీలకమైన ఈఏపీసెట్ ప్రవేశ పరీక్షలు ఏప్రిల్ 29 నుంచి మే 5 వరకు వివిధ తేదీల్లో జరగనున్నాయి. ఏప్రిల్ 29,30 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు, మే 2 నుంచి 5 వరకు ఇంజినీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు. మే 12న ఈసెట్ ను, ఎడ్సెట్ ను  జూన్ 1 న నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి తెలిపింది. వీటితో పాటు జూన్ 6న లాసెట్, పీజీ లా సెట్ ఒకేరోజు నిర్వహిస్తున్నారు. జూన్ 8, 9 తేదీలల్లో ఐసెట్, జూన్ 16 నుంచి మొదలుకుని 19 వరకు పీజీఈసెట్ పరీక్షలు జరగనున్నాయి.

EAPCET

ఏప్రిల్ 29, 30 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ కోసం మే 2 నుంచి 5వ తేదీ వరకు ఇంజినీరింగ్ ప్రవేశాల కోసం ఎప్‌సెట్ జరగనుంది. ఎప్‌సెట్ పరీక్షలు జేఎన్టీయూహెచ్ నిర్వహించనుండగా ప్రొఫెసర్ డీన్ కుమార్ కన్వీనర్‌గా వ్యవహరిస్తున్నారు. 

ECET

డిప్లొమా విద్యార్థులు ఇంజినీరింగ్, ఫార్మా కోర్సుల్లో రెండో సంవత్సరంలో చేరేందుకు నిర్వహించే ఈసెట్ మే 12న జరగనుంది. ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించే ఈసెట్ కన్వీనర్ గా ఓయూ ఇంజినీరింగ్ కాలేజీ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ చంద్రశేఖర్ వ్యవహిస్తారు. 

EDCET

బీఈడీ ప్రవేశాల కోసం జూన్ 1న ఎడ్‌సెట్ జరగనుంది. కాకతీయ యూనివర్సిటీ నిర్వహించే ఎడ్‌సెట్ కన్వీనర్‌గా కేయూ ప్రొఫెసర్ బి.వెంకట్రామిరెడ్డి ఉన్నారు. 

LAWCET

ఎల్ఎల్‌బీ ప్రవేశాల కోసం లాసెట్ ఎల్ఎల్ఎం కోసం పీజీఎల్‌సెట్ పరీక్షలు జూన్ 6న నిర్వహిస్తారు. లాసెట్, పీజీఎల్ సెట్ నిర్వహణ బాధ్యతలు ఉస్మానియా విశ్వవిద్యాలయానికి అప్పగించి కన్వీనర్‌గా ప్రొఫెసర్ బి. విజయలక్ష్మిని నియమించారు. 

ICET

ఎంబీఏ, ఎంసీఏ డిమాండ్‌ ఉన్న కోర్సుల్లో ప్రవేశాల కోసం జూన్ 8, 9 తేదీల్లో ఐసెట్ పరీక్ష జరగనుంది. ఐసెట్‌ను మహాత్మగాంధీ యూనివర్సిటీ నిర్వహించనుండగా ఆ యూనివర్సిటీ ప్రొఫెసర్ అలువాల రవి కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. 

PGECET

ఎంటెక్, ఎంఫార్మసీ కోర్సుల కోసం జూన్ 16 నుంచి 19 వరకు పీజీఈసెట్ నిర్వహించనున్నారు. జేఎన్టీయూహెచ్ నిర్వహించే పీజీఈసెట్ కన్వీనర్‌గా ప్రొఫెసర్ ఎ. అరుణ కుమారి వ్యవహరిస్తున్నారు.

PECET

వ్యాయామ విద్య కోర్సులు డీపెడ్, బీపెడ్‌ల్లో ప్రవేశాల కోసం జూన్ 11 నుంచి 14 వరకు పీఈసెట్ నిర్వహిస్తారు. పాలమూరు యూనివర్సిటీ నిర్వహించే పీఈసెట్ కన్వీనర్‌గా ప్రొఫెసర్ ఎన్.ఎస్. దిలీప్ ఉన్నారు. 

పీఈసెట్ మినహా మిగతా ఎంట్రెన్సులన్నీ ఆన్‌లైన్‌లో జరుగుతాయి. పీఈసెట్‌లో శారీరక సామర్థ్య పరీక్షలు ఉంటాయి. ఈ ఉమ్మడి ప్రవేశ పరీక్షలన్నీ ఏప్రిల్, మే, జూన్ లలో ముగిసేలా కన్వీనర్లు, యూనివర్సిటీలు ప్రణాళిక చేస్తున్నాయి.

Comments

-Advertisement-