రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

నేడే టీటీడీ ఏప్రిల్‌ కోటా టికెట్ల విడుదల..

tirumala darshan tickets Tirumala Temple Arjitha Seva Services April Quota Tickets General News telugu latest news telugu intresting news telugu news
Peoples Motivation

నేడే టీటీడీ ఏప్రిల్‌ కోటా టికెట్ల విడుదల..

• సుప్రభాతం, తోమాల సేవ, అర్చన, అష్టాదళ పాదపద్మార్చన ఏప్రిల్‌ కోటా టికెట్లు నేడు విడుదల

General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET AP DSC Tenth Hall Tickets

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల సేవ, అర్చన, అష్టాదళ పాదపద్మారాధన సేవకు సంబంధించి ఏప్రిల్‌ కోటా టికెట్లను నేడు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తెలిపింది. ఈ టికెట్ల కోసం నేటి (జ‌న‌వ‌రి 18) నుంచి 20న ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చని తెలిపింది.

ఏప్రిల్‌ 10 నుంచి 12 వరకు నిర్వహించనున్న స్వామివారి సాలకట్ల వసంతోత్సవాలు, కల్యాణోత్సవం, ఊంజల్‌ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలకు సంబంధించిన టికెట్లను జనవరి 21న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు టీటీడీ వెల్లడించింది. వర్చువల్ సేవలు, దర్శన స్లాట్ల కేటాయింపునకు సంబంధించి ఏప్రిల్‌ కోటాను జ‌న‌వ‌రి 21న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు పేర్కొంది.

పలు రకాల శ్రీవారి సేవలు - టికెట్ల విడుదల తేదీలు

• అంగ ప్రదక్షిణం కోటా - జనవరి 23 - ఉదయం 10 గంటలకు

• శ్రీవాణి టికెట్ల ఆన్‌లైన్ కోటా - జ‌న‌వ‌రి 23 - ఉదయం 11 గంటలకు

• వృద్ధులు, దివ్యాంగుల దర్శనం కోటా - జ‌న‌వ‌రి 23 - మధ్యాహ్నం 3 గంట‌ల‌కు

• ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ.300) టికెట్ల కోటా - జ‌న‌వ‌రి 24 - ఉదయం 10 గంటలకు

• తిరుమ‌ల‌, తిరుప‌తిల‌లో గదుల కోటా - జ‌న‌వ‌రి 24 - మధ్యాహ్నం 3 గంటలకు

• శ్రీవారి సాధారణ సేవ కోటా - జనవరి 27 - ఉదయం 11 గంటలకు

• శ్రీవారి నవనీత సేవ కోటా - జనవరి 27 - మధ్యాహ్నం 12 గంటలకు

• శ్రీవారి పరాకామణి సేవ కోటా - జనవరి 27 - మధ్యాహ్నం 1 గంటలకు

టీటీడీ శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లను టీటీడీ వెబ్‌సైట్‌ https://ttdevasthanams.ap.gov.in లో మాత్రమే బుక్‌ చేసుకోవాలని భక్తులకు టీటీడీ సూచించింది.

Comments

-Advertisement-