అంగరంగా వైభవంగా పెబ్బేరు శ్రీశ్రీశ్రీ చౌడేశ్వరి దేవి జాతర ఉత్సవాలు
అంగరంగా వైభవంగా పెబ్బేరు శ్రీశ్రీశ్రీ చౌడేశ్వరి దేవి జాతర ఉత్సవాలు
--పెబ్బేరు మండల కేంద్రంలోనే శ్రీ శ్రీ శ్రీ చౌడేశ్వరి దేవి అతి పెద్ద జాతర
--జాతర కోసం భారీ ఏర్పాట్లు
--నాలుగు రోజుల పాటు అమ్మవారి ఉత్సవాలు
--ఆడపడుచులకు కనువిందు చేసి ఆకర్షించే విధంగా గాజుల దుకాణాలు వెలుసాయి
--పిల్లలు పెద్దలు ఆనందించే విధంగా ఎగ్జిబిషన్ వంటి వినోద స్టాల్స్ ఏర్పాట్లు
--కోరిన కోరికలు తీర్చే దైవంగా భక్తుల కొంగు బంగారంగా కొలిచే శ్రీ శ్రీ శ్రీ చౌడేశ్వరి దేవి జాతర
వనపర్తి జిల్లా ప్రతినిధి, జనవరి 28 (పీపుల్స్ మోటివేషన్):- వనపర్తి జిల్లా పెబ్బేరు కేంద్రంలో శ్రీ చౌడేశ్వరి జాతరకు ఇంటికి వచ్చిన ఆడపడుచులకు కొత్త బట్టలు పెట్టి వారిని సంస్కృతి సంప్రదాయాలు పాటించి వాళ్ళ ఊర్లకు సాగనంపుతారు కోరిన కోరికలు తీర్చే దైవంగా భక్తుల కొంగు బంగారంగా కొలిచే శ్రీ శ్రీ శ్రీ చౌడేశ్వరి దేవి జాతర ఉత్సవాలు శుక్రవారం నుండి పెబ్బేరు మండల కేంద్రంలో ప్రారంభం కానున్నాయి. ప్రతి ఏటా మాఘశుద్ధ పాడ్యమి రోజు చౌడేశ్వరి ఉత్సవాలను జరుపుకోవడం ఇక్కడి ఆనవాయితీ. అమావాస్య రోజు శ్రీ వేణుగోపాలస్వామి ఊరేగింపు కార్యక్రమంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి.నాలుగు రోజులపాటు ఉత్సవాలు జరుగుతాయి.యాదవుల ఇలవేల్పుగా జరుపుకునే ఈ ఉత్సవాలను ప్రత్యేకంగా ఘనంగా నిర్వహిస్తారు. ఉత్సవాల సందర్భంగా మండల కేంద్రంలో అతి పెద్ద జాతర జరుగుతుంది. జాతర కోసం సుభాష్ చౌరస్తా నుండి అమ్మవారి గుడి వరకు రోడ్డుకు ఇరువైపులా విద్యుత్ దీపాలతో అలంకరణ చేశారు. ఇరువైపులా నేతి మిఠాయి దుకాణాలు, చిన్న పిల్లల ఆటవస్తుల దుకాణాలు ఏర్పాటు చేశారు. గాజుల దుకాణాలు మహిళల అలంకరణ కోసం అవసరమయ్యే దుకాణాలు చూడ ముచ్చటగా ఆడపడుచులకు కనువిందు చేసి ఆకర్షించే విధంగా వెలుస్తాయి. వీటితోపాటు పిల్లలు పెద్దలు ఆనందించే విధంగా ఎగ్జిబిషన్ వంటి వినోద స్టాల్స్ ఏర్పాట్లు చేశారు. స్థానికులు ఇతర మండలాల వారే కాక హైదరాబాద్ తదితర దూర ప్రాంతాల వారు కూడా ఇక్కడికి శ్రీ శ్రీ శ్రీ చౌడేశ్వరి దేవిని చూసి దర్శించుకోవడం కోసం వస్తారు. చౌడేశ్వరి ఉత్సవాల సందర్భంగా ఇక్కడ క్రీడాకారులకు క్రికెట్, కబడ్డీ వివిధ ఆట పోటీలను నిర్వహించడం జరిగింది.అదేవిధంగా రైతు సంఘంఆద్వర్యంలో అంతర్రాష్ట్ర అఖిలభారత ఒంగోలు జాతి పశు బలప్రదర్శన పోటీలు గురువారం నుండి శనివారం వరకు బండలాగుడు పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఈ పోటిలో గెలుపొందిన వారికి బహుమతుల ప్రదానం అందజేయడం జరుగుతుంది. జాతర జరిగే నాలుగు రోజుల పాటు మండల కేంద్రంలో పండగ వాతావరణం కలిగి ఉంటుంది.
చౌడేశ్వరి అమ్మవారి చరిత్ర
శివుని వరమున సత్ రాత్రి అనే అడవిలో చౌడేశ్వరి దేవి జన్మించగా కొన్నాళ్లపాటు అడవిలోనే గడిపింది. ఆ తర్వాత గుడిబండ రాశాల వచ్చిందని కొన్నాళ్లు అక్కడే గడిపి తర్వాత కర్నూలు జిల్లా నందవరం వెళ్లి అక్కడ నుండి తిరిగి గుడిబండ రసాలకు వచ్చి కొలువుదిరిందని అక్కడి నుండి పెబ్బేరుకు వచ్చిందని ఆనాటి పూర్వీకుల ప్రచారంలో ఉంది.పెబ్బేర్ యాదవులు గుడిబండ రాసాలకు గొర్రెల మేపడానికి వెళ్లారని అక్కడ శిథిలావస్థలో ఉన్న అమ్మవారి విగ్రహాన్ని యాదవుల చూపుతో అమ్మవారు నేను మీ వెంట వస్తానని ఓ బాలిక అవతారంలో వచ్చి అన్నట్లు పెబ్బేరు యాదవులు ఆ దేవతను పల్లకిలో తేవడానికి బయల్దేరు. బయలుదేరే సమయానికి స్థానిక ప్రజలు వారిని వెంబడించారని నీరు లేని వాగు దాటినా తర్వాత వాగు నీడ నీరు ప్రవహించడంతో స్థానికులు అవతలి వైపుకు వెళ్లలేక పోవడంతో పెబ్బేరు యాదవులు చౌడేశ్వరి దేవిని పెబ్బేరుకు తీసుకువచ్చి ప్రతిష్ఠిస్తారు. నాటి నుంచి ఇప్పటి వరకు ప్రతి ఏటా అమ్మవారికి అంగరంగ వైభవంగా ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.
అమ్మవారి ఉత్సవ కార్యక్రమాలు
శ్రీ శ్రీ శ్రీ చౌడేశ్వరి దేవి జాతర బుధవారం సాయంత్రం జరిగే శ్రీ శ్రీ శ్రీ వేణుగోపాలస్వామి పల్లకి సేవ పుర వీధుల గుండా ఊరేగింపుతో ప్రారంభం అవుతాయి. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు యాదవ సంఘం ఆధ్వర్యంలో యాదవులుచే శ్రీ శ్రీ శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారిని గంగా స్నానం కొరకు బీచుపల్లి కృష్ణానదికి బయలుదేరుతుంది. అదే రాత్రి 11 గంటల 30 నిమిషాల నుండి తెల్లవారుజామున వరకు యాదవులు అమ్మవారిని పల్లకి సేవ చేస్తూ పట్టణ పురవీధుల గుండా ఊరేగింపు చేసి గంగా స్నానానికి వెళ్తారు. తిరిగి రాత్రికి అమ్మవారు గుడికి చేరుకుంటారు. తదనంతరం యాదవుల కుటుంబాల మహిళలు బోనాలు సిద్ధం చేసుకుని గుడికి చేరుకుంటారు. అనంతరం అమ్మవారి సేవకులైన తోట వీర క్షత్రియులు ఏర్పాటు చేసిన జ్యోతులచే కురువ యాదవ డోలు, మంగళ వాయిద్యాలచే అమ్మవారిని గర్భగుడి నుండి శ్రీ చిన్న చౌడేశ్వరి ఉత్సవ గుడి వరకు మహిళాల బోనాలు,తొగుట వీర క్షేత్రియులచే జ్యోతుల నృత్యాలతో కిట కిట లాడే భక్తుల ఊరేగింపుగా శుక్రవారం ఉదయం 8 గంటలకు ఉత్సవ గుడి దగ్గరకు చేరుకుంటారు. శనివారం రాత్రి వరకు శ్రీ చిన్న చౌడేశ్వరి గుడి దగ్గరకు భక్తుల దర్శనం కోసం ఉంచుతారు. సోమవారం భక్తులు అమ్మవారిని దర్శించుకుని,తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి ఆశీస్సులు పొందుతారు. ఆ రాత్రి అఖండ భజనలు నిర్యహిస్తారు. మంగళవారం భక్తుల దర్శన అనంతరం రాత్రి అమ్మవారి గర్భగుడికి వెళుతుంది. ఉత్సవాల సందర్భంగా పట్టణంలోని శుభాష్ చౌరస్తా నుండి అమ్మవారి ఆలయం వరకు,ప్రధాన దారులను రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరణ చేశారు.చెక్క భజనలు, అడుగుల భజనలు,భజన పోటీలు నిర్వహించారు. ఇంటికి వచ్చిన ఆడపిల్లలకు కొత్తబట్టలు పెట్టి వారిని సంస్కృతి సంప్రదాయాలు పాటించి వాళ్ళ ఊర్లకు సాగనంపుతారు. ఈ విద్ధంగా ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటారు.శ్రీ శ్రీ శ్రీ చౌడేశ్వరి ని భక్తులు సంస్కృతి సంప్రదాయంగా భక్తి శ్రద్ధలతో కొలుస్తారు.