BEL: బెల్ లో 350 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఏ
BEL: బెల్ లో 350 ఉద్యోగాలకు నోటిఫికేషన్
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్).. 350 ప్రొబేషనరీ ఇంజినీర్ పోస్టులను ప్రకటించింది. వీటిల్లో ప్రొబేషనరీ ఇంజినీర్ ఎలక్ట్రానిక్స్ 200, మెకానికల్ 150 ఖాళీలున్నాయి.
బెల్లో లో మొత్తం 350 పోస్టులు..
మొత్తం ఉద్యోగాల్లో అర్రిజర్వుడ్లకు 143, ఈడబ్ల్యూఎస్లకు 35, ఓబీసీ (ఎన్సీఎల్)కు 94, ఎస్సీలకు 52, ఎస్టీలకు 26 కేటాయించారు.
అర్హతలు:
ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్/ కమ్యూనికేషన్/ టెలికమ్యూనికేషన్/ మెకానికల్ బ్రాంచ్లతో బీఈ/ బీటెక్ / బీఎస్సీ ఫస్ట్ క్లాస్ పాసవ్వాలి. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు పాసైతే సరిపోతుంది. ఇవే బ్రాంచిలతో ఏఎంఐఈ ఏఎంఐఈ టీఈ/ జీఐఈటీఈ పూర్తిచేసినవారూ, బీఈ/ బీటెక్/ బీఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతున్నవారు దరఖాస్తుకు అర్హులే. అయితే డ్యూయల్ స్పెషలైజేషన్లు చేసినవారు దరఖాస్తు చేయడానికి అనర్హులు.
వయసు:
01.01.2025 నాటికి 25 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీ (ఎన్సీఎల్), మాజీ సైనికోద్యోగులకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు:
జనరల్/ ఈడబ్ల్యూఎస్/ఓబీసీ (ఎన్సీఎల్) లకు రూ. 1180. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ మాజీ సైనికోద్యోగులకు ఫీజు లేదు.
ఎంపిక ఎలా?
విద్యార్హతల ఆధారంగా అభ్యర్థులను కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షకు ఎంపిక చేస్తారు. దీంట్లో జనరల్/ ఓబీసీ/ ఈడబ్ల్యూ ఎస్లు 35 శాతం, ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు 30 శాతం కనీసార్హత మార్కులు సాధించాలి. వీరిని 1.5 నిష్పత్తిలో ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. రాత పరీక్షకు 85 శాతం, ఇంట ర్వ్యూకు 15 శాతం వెయిటేజీ ఉంటుంది.
◆ రాత పరీక్ష 125 ప్రశ్నలతో ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. టెక్నికల్ ప్రశ్నలు 100, జనరల్ ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్కు చెందిన 25 ప్రశ్నలు ఇస్తారు. ప్రశ్నకు ఒక మార్కు. ప్రతి తప్పు సమాధానానికి పావు మార్కు తగ్గిస్తారు. ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీ భాషల్లో ఉంటుంది.
◆ సబ్జెక్టు సంబంధిత అంశాల నుంచే ప్రశ్నలు ఇస్తారు. అదనంగా జనరల్ ఆప్టిట్యూడ్, అనలిటికల్ అండ్ రీజనింగ్ ఎబిలిటీస్ ప్రశ్నలూ ఉంటాయి.
◆ రాత పరీక్షలో అర్హత సాధించినవారిని ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. దీంట్లో గెలుపొందినవారికి వైద్య పరీక్షలు నిర్వహించి కేటగిరీలవారీగా తుది ఎంపిక చేస్తారు.
వేతనం:
నెలకు రూ.40,000-1,40,000 ఉంటుంది. మూల వేతనంతో పాటు డీఏ, హెచ్ఎస్ఏ, కన్వేయన్స్ అలవెన్స్, పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే, మెడి కల్ రీఎంబర్స్మెంట్ సదుపాయాలూ ఉంటాయి.
పరీక్ష కేంద్రాలు:
ఏపీలో రాజమహేంద్రవరం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం; తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, వరంగల్,