రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

Andariki Illu: అందరికీ ఇళ్లపై ప్రభుత్వం కీలక గైడ్లైన్స్ జారీ

General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET AP DSC Tenth Hall Tickets
Peoples Motivation

Andariki Illu: అందరికీ ఇళ్లపై ప్రభుత్వం కీలక గైడ్లైన్స్ జారీ

General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET AP DSC Tenth Hall Tickets

అమరావతి, జనవరి 27 (పీపుల్స్ మోటివేషన్):- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందరికీ ఇల్లు కార్యక్రమం కింద గ్రామీణ ప్రాంతాలలో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు కేటాయింపుకు నిబంధనలు తెలియజేస్తూ సోమవారం నాడు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ మేరకు రివెన్యూ శాఖ స్పెషల్ ఛీఫ్‌ సెక్రటరీ ఆర్పీ సిసోడియా.. జీవో ఎంస్ నెంబర్ 23 ను జారీ చేశారు. ఈ నిబంధనలను ఆంధ్రప్రదేశ్ ఎస్‌హెచ్‌సీఎల్ అన్ని జిల్లా కలెక్టర్‌లకు కమ్యూనికేట్ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. అందరికీ ఇళ్లు కార్యక్రమంలో పలు మార్గదర్శకాలను విడుదల చేసింది ప్రభుత్వం. అందరికీ ఇల్లు కార్యక్రమం మానిటరింగ్‌కు రెవెన్యూ మంత్రి ఛైర్మన్‌గా మున్సిపల్, హౌసింగ్‌లతో పాటు పలువురు అధికారులు సభ్యులుగా కమీటీ ఏర్పాటు చేస్తూ ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.

గైడ్ లైన్స్

• పట్టణాల్లో ప్రభుత్వ స్ధలం అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో 2 సెంట్ల చొప్పున ఇంట్లోని మహిళ పేరుతో కేటాయింపు

• పట్టణాల్లో ప్రభుత్వ భూములు లభించని చోట ఏపీ టిడ్కో, యూఎల్బీ, ఇతర ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా నిర్మించి ఇవ్వాలని నిర్ణయం

• ఇంటి స్ధలం, లేదా ఇల్లు పొందిన వారికి పూర్తి హక్కులు కేటాయించిన నాటి నుంచి 10 ఏళ్ల తరువాత లభిస్తాయని వెల్లడి

• అర్హత కలిగిన వ్యక్తికి జీవితంలో ఒక్కసారి మాత్రమే హౌస్ సైట్ పొందేందుకు అర్హుడు

• పట్టా ఇచ్చిన రెండేళ్లలోగా ఇంటిని లబ్దిదారు నిర్మించుకోవాలి

• ప్లాటును ఆధారు, రేషన్ కార్డులకు లింక్ చేయడం ద్వారా డూప్లికేషన్ లేకుండా చూడాలి


అర్హతలు

• ఈ కార్యక్రమం కింద లబ్దిదారులు అయ్యేందుకు ఉండాల్సిన అర్హతలు

• తెల్లరేషన్ కార్డు కలిగి ఉండాలి

• ఏపీలో ఎక్కడా సొంత ఇల్లు, స్థలం కలిగి ఉండకూడదు

• కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వల నుండి ఎలాంటి ఇంటి స్ధలం పొంది ఉండకూడదు

• కేంద్ర, రాష్ట్ర పభుత్వాల హౌసింగ్ స్కీంలలో దేనిలోనూ లబ్ది పొంది ఉండకూడదు

• అయిదు ఎకరాలు మించి వ్యవసాయ భూమి మెట్ట, రెండున్నర ఎకరాలు జరీబు లేదా మెట్ట, జరీబు కలిపి 5 ఎకరాలకు మించకుండా భూమి ఉన్న వారు అర్హులు

• ఇప్పటికే ఇంటి స్థలం జారీ చేయబడి కోర్టు కేసులలో ఉంటే వారికి ఆ స్థలాన్ని రద్దు చేసి వేరే చోట జారీ

• గతంలో కేటాయించిన లే అవుట్ నగరానికి దూరంగా ఉండడం, శ్మశానాలకు దగ్గరగా ఉండడం, ముంపు ప్రాంతంలో ఉండడం వంటి సమస్యలు ఉంటే మొత్తం లే అవుట్ రద్దు చేసి వేరే చోట కేటాయించాలని నిర్ణయం

• ఇప్పటికే ఇంటి స్థలం పోందినా ఇల్లు నిర్మంచని వారికి ఆ సైట్ రద్దు చేసి వేరే చోట సైట్ కేటాయింపు


లబ్దిదారుల ఎంపిక ఇలా

• విలేజి, వార్డు స్ధాయిలో ధరఖాస్తు చేసుకోవాలి

• వీఆర్వో, ఆర్‌‌ఐల ద్వారా విచారణ చేయించాలి

• లిస్టును గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శన అభ్యంతరాలు స్వీకరణ

• తుది జాబితాను ఎమ్మార్వోలు, మున్సిపల్ కమీషనర్‌లు సిద్ధం చేసి జిల్లా కలెక్టర్‌లకు పంపాలి

• లబ్దిదారుల గ్రామాల్లో భూమి లభ్యత లేకపోతే పక్క గ్రామల్లో భూమి స్ధలం కేటాయింపుకు కలెక్టర్‌కు అధికారం

• ఎవ్వరైనా నిబంధనలకు వ్యతిరేకంగా పట్టా పొందినట్టు తెలిస్తే వెంటనే రద్దు చేయాలని నిర్ణయం

• రెండేళ్లలో నిర్మాణం చేపట్టని సైట్స్‌ను రద్దు చేసే అధికారాన్ని కట్టబెడుతున్నట్టు ఉత్తర్వుల్లో వెల్లడించారు.

కాగా.. ఇటీవల జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో అందరికీ ఇళ్లు పథకం కింద పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల చొప్పున ఇళ్ల పట్టాలు పంపిణీపై చర్చ జరిగిన విషయం తెలిసిందే. ఇళ్ల పంపిణీ చేసేందుకు గానూ మార్గదర్శకాల జారీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. అయితే గత ప్రభుత్వం పేదలకు సెంటు స్థలంలో ఇల్లు కట్టి ఇచ్చేలా ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. సెంటు స్థలం ఇంటి నిర్మాణానికి ఏ మాత్రం సరిపోదని గ్రామాల్లో పేదలకు 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల స్థలం ఇవ్వాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కేబినెట్‌లో చర్చలు జరిపిన అనంతరం అందరికీ ఇళ్ల పథకానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

Comments

-Advertisement-