రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

డిగ్రీ విద్యార్హతతో బ్యాంక్ లో 266 ఆఫీసర్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్

CENTRAL BANK OF INDIA RECRUITMENT www.centralbankofindia.com General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news
Peoples Motivation

డిగ్రీ విద్యార్హతతో బ్యాంక్ లో 266 ఆఫీసర్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్

>> డిగ్రీ విద్యార్హతతో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 266 ఉద్యోగాలు..

>> అహ్మదాబాద్, చెన్నై, గువాహటి, హైదరాబాద్‌ జోన్లలోని ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసిన సెంట్రల్ బ్యాంక్..

CENTRAL BANK OF INDIA RECRUITMENT www.centralbankofindia.com General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news

డిగ్రీ విద్యార్హతతో దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, హ్యూమన్‌ క్యాపిటల్‌ మేనేజ్‌మెంట్‌ (రిక్రూట్‌మెంట్‌ ఖీ ప్రమోషన్‌), సెంట్రల్‌ ఆఫీస్‌ రెగ్యులర్‌ ప్రాతిపదికన వివిధ జోనుల్లో 266 జోన్‌ బేస్డ్‌ ఆఫీసర్‌- జూనియర్‌ మేనేజ్‌మెంట్‌ స్కేల్‌ 1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. అలాగే అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

జోన్లు: అహ్మదాబాద్, చెన్నై, గువాహటి, హైదరాబాద్‌.

అర్హత (Eligibility):-

గ్రాడ్యుయేషన్‌ లేదా తత్సమాన విద్యార్హతతో పాటు ఉద్యోగానుభవం. చార్టెడ్‌ అకౌంటెన్సీ, కాస్ట్‌ అకౌంటెన్సీ ఇంటిగ్రేటెడ్‌ డ్యూయల్‌ డిగ్రీ, మెడికల్, ఇంజినీరింగ్, అభ్యర్థులు కూడా అర్హులే.

వయసు (Age):-

30.11.2024 నాటికి 21 నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు; ఓబీసీకి మూడేళ్లు; దివ్యాంగులకు పదేళ్లు సడలింపు ఉంటుంది.

వేతనం (Salary):-

నెలకు రూ.48,480 - రూ.85,920.

ఎంపిక విధానం (Selection Process):- 

కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష, ఇంటర్వ్యూల ఆధారంగా.

అప్లికేషన్ ఫీజు (Application fee):-

రూ.850, జీఎస్‌టీ, ఎస్టీ, ఎస్సీ, దివ్యాంగులైన అభ్యర్థులకు రూ.175, జీఎస్‌టీ.

ముఖ్యమైన తేదీలు (Important Dates):-

• ఆన్‌లైన్లో రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: 09.02.2025.

• ఆన్‌లైన్‌ పరీక్ష తేదీ: మార్చి 2025.

వెబ్‌సైట్‌: www.centralbankofindia.co.in/ ను సంప్రదించి పూర్తి సమాచారాన్ని తెలుసుకోండి.

Comments

-Advertisement-