Tenth Exams Time Table: టెన్త్ పరీక్షల టైం టేబుల్ విడుదల
Tenth Exams Time Table: టెన్త్ పరీక్షల టైం టేబుల్ విడుదల
Tenth Exams Time Table: ఇంటర్, టెన్త్ పరీక్షలు రాసే విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫైనల్ పరీక్షల షెడ్యూల్‌ను విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ (Minister Nara Lokesh) ఎక్స్ వేదికగా విడుదల చేశారు. వచ్చే ఏడాది మార్చి 17 నుంచి 31 వరకు పదో తరగతి పరీక్షలు ( AP SSC Exam Schedule) జరగనున్నాయి. పదో తరగతి పరీక్షలు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు నిర్వహించనున్నారు. విద్యార్థులకు ఒత్తిడి లేకుండా రోజు విడిచి రోజు పరీక్ష ఉండేలా జాగ్రత్త తీసుకున్నామని మంత్రి తెలిపారు. విద్యార్థులు ఈ వెసులుబాటును సద్వినియోగం చేసుకుని మంచి మార్కులు సాధిస్తారని ఆకాంక్షిస్తున్నానని తెలిపారు.
మార్చి 17 నుంచి 31 వరకు పదో తరగతి పరీక్షలు
తేదీ-సబ్జెక్ట్
మార్చి 17 -ఫస్ట్ లాంగ్వేజ్
మార్చి 19 -సెకండ్ లాంగ్వేజ్
మార్చి 21 -ఇంగ్లీష్
మార్చి 22 -ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-2
మార్చి 24 -గణితం
మార్చి 26 -ఫిజికల్ సైన్స్
మార్చి 28 -బయోలాజికల్ సైన్స్
మార్చి 29 -OSSC మెయిన్ లాంగ్వేజ్ పేపర్ 2, వోకేషన్ కోర్స్ (థియరీ)
మార్చి 31 -సోషల్ స్టడీస్