-Advertisement-

Physicswala: ఫిజిక్స్ వాలాతో ఎపి ప్రభుత్వం ఎంఓయు

General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET AP DSC SSC jobs ap govt news
Peoples Motivation

Physicswala: ఫిజిక్స్ వాలాతో ఎపి ప్రభుత్వం ఎంఓయు

• ఎపిలో ప్రతిష్టాత్మక ఇన్నొవేషన్ యూనివర్సిటీ

• ఉన్నత విద్య ఆధునీకరణ కోసం టిబిఐతో ఒప్పందం

• యువతకు ప్రపంచస్థాయి అవకాశాలే ప్రధాన లక్ష్యం

-మంత్రి నారా లోకేష్ సమక్షంలో రెండు కీలక ఒప్పందాలు

General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET AP DSC SSC jobs ap govt news

అమరావతి, (పీపుల్స్ మోటివేషన్):-: అధునాతన సాంకేతిక ఆవిష్కరణల కేంద్రంగా ఆవిర్భవిస్తున్న ఆంధ్రప్రదేశ్ లో డీప్-టెక్ ను అభివృద్ధి చేయడంలో భాగంగా ఎపి ప్రభుత్వం రెండు ప్రధాన సంస్థలతో కీలక ఒప్పందాలు చేసుకుంది. 

ఫిజిక్స్ వాలా (PW) ఎడ్యుటెక్ కంపెనీ తన పరిశ్రమ భాగస్వామి అమెజాన్ వెబ్ తో కలిసి ఆంధ్రప్రదేశ్ లో AI-ఫోకస్డ్ ఫస్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ (IoE)... యూనివర్సిటీ ఆఫ్ ఇన్నొవేషన్ (UoI)ను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. ఈ మేరకు ఎపి ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం చేసుకుంది. ఎపిలో ఉన్నత విద్యను ఆధునీకరించేందుకు టోనీ బ్లెయిర్ ఇనిస్టిట్యూట్ (TBI)తో మరో ఒప్పందం చేసుకుంది. ఉండవల్లి నివాసంలో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఫిజిక్స్ వాలా, టోనీబ్లెయిర్ ఇనిస్టిట్యూట్ ప్రతినిధులు వేర్వేరుగా ఏపి ప్రభుత్వంతో ఎంఓయు చేసుకున్నారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటయ్యే ఇన్నోవేషన్ విశ్వవిద్యాలయం అకడమిక్ ఎక్సలెన్స్, ఇన్నోవేషన్స్ ను ఏకీకృతం చేసే దిశగా పని చేస్తుంది. పరిశోధన, విద్య, ఉపాధిలో కీలక సవాళ్లను పరిష్కరించడంపై దృష్టిసారిస్తుంది. హబ్-అండ్-స్పోక్ మోడల్‌ను అనుసరించి ఇన్నొవేషన్ యూనివర్శిటీ సెంట్రల్ హబ్‌గా పనిచేస్తుంది. దీనిద్వారా విభిన్న నేపథ్యాలు, ప్రాంతాలకు చెందిన విద్యార్థులకు సమకాలీన, హైబ్రిడ్ విద్యను యాక్సెస్ చేస్తారు. ఆన్‌లైన్, వ్యక్తిగత అభ్యసన అనుభవాలను ఇంటిగ్రేట్ చేస్తారు. మార్కెట్ డిమాండ్ కు అనుగుణంగా అమెజాన్ వెబ్ సర్వీసెస్ వంటి పరిశ్రమ భాగస్వామితో ఫిజిక్స్ వాలా కలిసి పనిచేస్తుంది. ఈ కార్యక్రమంలో ఫిజిక్స్ వాలా ఫౌండర్ & సిఇఓ అలఖ్ పాండే, కో ఫౌండర్ ప్రతీక్ బూబ్, పిడబ్ల్యు ఫౌండేషన్ హెడ్ విజయ్ శుక్లా, డైరక్టర్ సోన్ వీర్ సింగ్, హెడ్ ఆఫ్ ఇన్నొవేషన్స్ దినకర్ చౌదరి పాల్గొన్నారు.


ప్రపంచస్థాయి ప్రమాణాలతో యువతకు శిక్షణ లక్ష్యం

ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ... కృత్రిమ మేధ (ఎఐ)లో ఎపి యువతను నెం.1గా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆలోచనలకు అనుగుణంగా ఈ ఒప్పందాలు జరిగాయని అన్నారు. అధునాతన ఆవిష్కరణలను ముందుకు తీసుకెళ్లడం, అందుకు ఎపి యువతను సన్నద్దం చేయడమే తమ లక్ష్యమన్నారు. పరిశ్రమల డిమాండ్, ప్రమాణాలకు అనుగుణంగా స్కిల్ డెవలప్ మెంట్ పై యూనివర్సిటీ ఆఫ్ ఇన్నోవేషన్ దృష్టిసారిస్తుందని చెప్పారు. అధునాతన సాంకేతికత, విద్యను ఏకీకృతం చేయడానికి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ కృషిచేస్తుందని చెప్పారు. టాలెంట్ డెవలప్ మెంట్, నాలెడ్జి క్రియేషన్ లో ఎపిని బలోపేతం చేయాలని ఫిజిక్స్ వాలాను కోరారు. ఎపిని ఎఐ హబ్ గా తీర్చిదిద్దేందుకు తాము కృతనిశ్చయంతో ఉన్నామని, ఇందుకోసం ఎఐలో అభివృద్ధి చెందుతున్న సాంకేతిక, నెక్స్ట్ జనరేషన్ నైపుణ్యాలకు మార్గం సుగమం చేస్తున్నామని మంత్రి లోకేష్ చెప్పారు. 


ఇన్నొవేషన్ వర్సిటీపై రూ.1000 కోట్ల పెట్టుబడులు

ఫిజిక్స్ వాలా (PW) వ్యవస్థాపకుడు, సిఇఓ అలఖ్ పాండే మాట్లాడుతూ... ప్రభుత్వంతో మేము ఇప్పుడు కుదుర్చుకున్న ఒప్పందం ఎపిలో ఇన్నొవేషన్ విశ్వవిద్యాలయం స్థాపనలో తొలి అడుగు. ఇందుకు యుఎస్ GSV వెంచర్స్, ఇతర పెట్టుబడిదారుల ద్వారా ₹1000 కోట్ల వరకు పెట్టుబడి పెట్టనున్నారు. అకడమిక్ లెర్నింగ్‌ని ఇండస్ట్రీతో మిళితం చేసే సంస్థను రూపొందించడానికి యూనివర్సిటీ ఆఫ్ ఇన్నొవేషన్ పనిచేస్తుందని పాండే అన్నారు.ఫిజిక్స్ వాలా సహ వ్యవస్థాపకుడు ప్రతిక్ బూబ్ మాట్లాడుతూ...నిరంతరం అభివృద్ధి చెందుతున్న జాబ్ మార్కెట్‌లో అభ్యాసకులకు అవసరమైన నైపుణ్యాలతో అందించడంలోయూనివర్సీటీ ఆఫ్ ఇన్నొవేషన్ సహకరిస్తుందని చెప్పారు. చంద్రబాబునాయుడు అసమాన ఆలోచనల ఫలితంగానే యూనివర్సిటీ ఆఫ్ ఇన్నోవేషన్ వంటి దార్శనిక ప్రాజెక్టులకు ఆంధ్రప్రదేశ్‌కు వస్తున్నాయని తెలిపారు. చురుకైన విధానాలు, నిర్ణయాత్మక నాయకత్వం PW ని ఎపి రావడానికి ఆకర్షియంచాయని చెప్పారు. జిఎస్ వి వెంచర్స్ మేనేజింగ్ పార్టనర్ డెబోరా క్వాజో మాట్లాడుతూ... విద్య, పరిశ్రమ మధ్య అంతరాన్ని తగ్గించే కార్యక్రమాలను ప్రోత్సహించేందుకు తాము ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఇన్నోవేషన్ విశ్వవిద్యాలయం ద్వారా డీప్-టెక్, AI యొక్క శక్తితో విద్యారంగంలో విస్తృత స్థాయి ఆవిష్కరణ కోసం ఒక నమూనాను సృష్టించాలన్నదే తమ లక్ష్యమని అన్నారు. యూనివర్సిటీ ఆఫ్ ఇన్నోవేషన్ స్థాపన ఎపి ప్రభుత్వ భాగస్వామ్య దృక్కోణాన్ని ప్రతిబింబిస్తుందని చెప్పారు. 


ఉన్నత విద్య ఆధునీకరణకు టిబిఐతో ఒప్పందం

ఆంధ్రప్రదేశ్ లో ఉన్నత విద్య వ్యవస్థను ఆధునీకరించేందుకు టోనీ బ్లెయిర్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ చేంజ్ (TBI)తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవగాహన ఒప్పందం (MOU)పై సంతకం చేసింది. ఈ కార్యక్రమంలో టిబిఐ కంట్రీ డైరక్టర్ వివేక్ అగర్వాల్, అసోసియేట్ ముంజులూరి రాగిణి రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ప్రపంచస్థాయి ప్రమాణాలకు అనుగుణంగా ఎపి విద్యార్థులను తీర్చిదిద్దడం ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యం. అంతర్జాతీయంగా విద్యావ్యవస్థలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఎపి ఉన్నత విద్యలో చేయాల్సిన మార్పులపై TBI ప్రభుత్వానికి సలహా ఇస్తుంది. ముఖ్యంగా యువతకు ఉపాధి అవకాశాలను పెంపొందించే విద్యా విధానాలను గుర్తిస్తుంది. విశ్వవిద్యాలయాలు, పాలిటెక్నిక్ కళాశాలల్లో తృతీయ విద్య ల్యాండ్ స్కేప్ ను మెరుగుపర్చడానికి కృషిచేస్తుంది. ఎపిలో సమగ్ర, స్థిరమైన ఆర్థికవృద్ధికి వేదిక ఏర్పాటుకు అవసరమైన ఆవిష్కణలను ప్రోత్సహిస్తుంది. ప్రస్తుత వ్యవస్థలో నైపుణ్య అంతరాలను గుర్తించి గ్లోబల్ బెస్ట్ ప్రాక్టీస్ లను అమలుచేసేందుకు ఎపి ప్రభుత్వంతో టిబిఐ కలసి పనిచేస్తుంది. ఇందుకు అవసరమైన సమగ్ర రోడ్ మ్యాప్ ను అభివృద్ధి చేయడంలో సహకరిస్తుంది.  TBI అనేది ప్రభావవంతమైన పరిష్కారాలను అందించడానికి ప్రముఖ నాయకులతో కలిసి పనిచేసేందుకు ఏర్పాటుచేసిన ప్రపంచ ప్రసిద్ధ సంస్థ. ప్రముఖ నాయకులు ప్రతిష్టాత్మకమైన ఆలోచనలను ప్రత్యక్ష ఫలితాలుగా మార్చడంలో టిబిఐ సహాయపడుతుంది. నేతల ఆలోచనలకు అనుగుణంగా అర్థవంతమైన పురోగతిని అందించడానికి వీలు కల్పిస్తుంది. TBI ముఖ్యంగా అధునాతన సాంకేతికల కోసం స్ట్రాటజీ, పాలసీ, డెలివరీ విధానాలపై నిపుణుల సలహాలను అందిస్తుంది.  ప్రపంచవ్యాప్తంగా 40కిపైగా దేశాల్లో 800 మంది ప్రఖ్యాత రాజకీయ వ్యూహకర్తలు, పాలసీనిపుణులు, డెలివరీ ప్రాక్టీషనర్లు, సాంకేతిక నిపుణుల బృందంతో టిబిఐ 100కి పైగా ప్రాజెక్టులను నిర్వహిస్తోంది. ప్రజాజీవనాన్ని మెరుగుపర్చడమే లక్ష్యంగా, ప్రభుత్వాధినేతల ఆలోచనలకు అనుగుణంగా ఉత్తమ విధానాల రూపకల్పనకు టిబిఐ కృషిచేస్తోందని సంస్థ ప్రతినిధులు తెలిపారు.

Comments

-Advertisement-