New Year: న్యూ ఇయర్ వేడుకలపై పోలీసుల ఆంక్షలు
New Year: న్యూ ఇయర్ వేడుకలపై పోలీసుల ఆంక్షలు
• 30 పోలీస్ ఆక్ట్ అమలు లో ఉన్నందున పోలీసుల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు...
• న్యూ ఇయర్ వేడుకలు సంతోషంతో జరుపుకోవాలి
-జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా
కొద్ది రోజుల్లో 2024వ సంవత్సరం ముగిసిపోనుంది. కొత్త ఏడాదికి 2025 కు గ్రాండ్‌గా వెల్‌కమ్ చెప్పడానికి నంద్యాల జిల్లా ప్రజలు ఆనందోత్సాహాల మధ్య న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌ను జరుపుకోవడానికి యువత సమాయాత్తమౌతోంది. ఈ సందర్భంలో నంద్యాల జిల్లా పరిదిలో న్యూ ఇయర్ వేడుకలకు సంబందించి అనగా 31-12-2024 న ఈ క్రింది తెలిపిన నిభందనలను పాటించి పోలీస్ వారికి సహకరించవలసినదిగా జిల్లా పోలీసు వారు విజ్ఞప్తి చేశారు.
➡️ న్యూ ఇయర్ ఈవెంట్స జరుపుకునేవారు ముందుగా పోలీసుల పర్మిషన్ తీసుకోవాలి.మరియు CC కెమరాల పర్యవేక్షణ తప్పనిసరి.
➡️ నూతన సంవత్సర వేడుకలు ప్రజలందరూ ఆరోగ్య కరమైన వాతావరణంలో జరుపుకోవాలని, జిల్లా అంతట 30 పోలీస్ ఆక్ట్ అమలు లో ఉన్నందున ప్రజలందరూ పోలీస్ నిబంధనలు పాటించాలని మరియు పోలీసు వారికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
➡️ వేడుక కార్యక్రమాలు నిర్వహించే వారు మ్యూజిక్ సిస్టమ్ రాత్రి 10 గం.,ల తరువాత వాడరాదు (సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం).
➡️రాత్రి 10 గంటల తరువాత పోలీసులు వాహానల తనిఖి చేపట్టనున్నందున ఆత్యవసరమైతేనే బయటకు రావాలని సూచించారు. అన్ని పోలీస్ స్టేషన్ ల పరిధిలో ముఖ్యమైన జంక్షన్‌లు అదే విధంగా ముఖ్యమైన ప్రదేశాలలో పికెట్‌లు వేయడం జరుగుతుందని తెలిపారు.
➡️ మేగజైన్స్, హోర్డింగ్స్ లలో అశ్లీలత కల్గిన పోస్టర్లు గాని ప్రకటనలు గాని వేడుకలకు సంభందించి చేయరాదు.వేడుకలలో అశ్లీల నృత్యాలు, చర్యలు, సినిమాలు, అశ్లీల సంజ్ఞలు ఆనుమతించబడవు.
➡️ అవుట్- డోర్ కార్యక్రమాలు జరిగే ప్రాంతాల్లో డీజే సౌండ్ బాక్సులు, బాణాసంచాను కాల్చడానికీ అనుమతి ఇవ్వట్లేదని స్పష్టం చేశారు.
➡️ మహిళలపై ఎలాంటి వేధింపులకు పాల్పడకుండా నిరోధించడానికి జిల్లా పోలీసు యంత్రాంగం అందుబాటులో ఉంటాయని తెలిపారు.
➡️వైన్ షాపులు నిర్దేశిత సమయంలోగా మూసివేయాల్సి ఉంటుందని, మైనర్లకు మద్యం విక్రయించే దుకాణాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
➡️ మోటార్ బైక్ ల సైలెన్సర్ తీసివేసి ఆదిక శబ్ధం వచ్చేలా రోడ్లపై ప్రయాణించరాదు.
➡️ మద్యం సేవించి రోడ్లపై ప్రయాణించరాదు.
➡️వాహనాలపై ఆదిక వేగంతో మరియు ప్రమాదకరమైన డ్రైవింగ్ చేయరాదు.
➡️ డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహిస్తామని, మద్యం మత్తులో వాహనాలను నడిపే వారు, మైనర్లకు వాహనాలు ఇచ్చే తల్లిదండ్రులపై చర్యలు తీసుకుంటామని , బైక్ రేసర్లపై నిఘా ఉంచుతామని అన్నారు.
➡️ఆకతాయిలు మితిమీరి ప్రవర్తించే యువతను, రోడ్ లపై చిందులు తొక్కే మందుబాబులను, ఇష్టానుసారంగా వాహనాలను నడిపే వారిని చిత్రీకరించేందుకు వీడియో కెమేరాలు మరియు డిజిటల్ కెమేరాలు ఉపయోగిస్తున్నాము.
➡️శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా అన్ని చర్యలను తీసుకుంటున్నామని, పోలీసులకు సహకరించాలని సూచించారు. పెట్రోలింగ్ ముమ్మరం చేస్తామని వివరించారు. ప్రత్యేక పోలీసు బృందాలను నియమిస్తామని అన్నారు.
➡️తల్లిదండ్రులు వారి పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలని,నిబందనలు పాటించని వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.
పై నిభందనలు పాటిస్తూ న్యూ ఇయర్ వేడుకలు అందరూ సంతోషంతో జరుపుకోవాలని నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా IPS జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.