రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

Masked Aadhar: మాస్క్డ్ ఆధార్ కార్డు అంటే ఏమిటి? మాస్క్డ్ ఆధార్ ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..?

Aadhar card update status Download Aadhar card Aadhar card mobile number update Aadhar Card check Myaadhar uidai.gov.in Aadhar card status Download
Peoples Motivation

Masked Aadhar: మాస్క్డ్ ఆధార్ కార్డు అంటే ఏమిటి? మాస్క్డ్ ఆధార్ ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..?

సైబర్ నేరాలు పెరిగిపోతున్న వేళ ఆధార్ నెంబర్లు బహిర్గతమైతే వ్యక్తిగత వివరాలు దుర్వినియోగమయ్యే అవకాశం ఉంది. ఈ సమస్యకు పరిష్కారంగా ప్రభుత్వం మాస్క్డ్ ఆధార్ అందుబాటులోకి తెచ్చింది.

Aadhar card update status Download Aadhar card Aadhar card mobile number update Aadhar Card check Myaadhar uidai.gov.in Aadhar card status Download

భారతీయులకు అవసరమైన అతి ముఖ్య డాక్యుమెంట్లలో ఆధార్ కూడా ఒకటి. ప్రభుత్వ పథకాలు మొదలు హోటల్ గదుల రిజర్వేషన్ల వరకూ అనేక చోట్ల ఆధార్ తప్పనిసరి. అయితే, హోటల్ రూమ్స్‌ బుకింగుల సందర్భంగా కొందరు ఆధార్ కార్డు కాపీలను ఇచ్చేస్తుంటారు. సైబర్ నేరాలు పెరిగిపోతున్న వేళ ఇలా ఆధార్ నెంబర్లు బహిర్గతమైతే వ్యక్తిగత వివరాలు దుర్వినియోగమయ్యే అవకాశం ఉంది. ఈ సమస్యకు పరిష్కారంగా ప్రభుత్వం మాస్క్డ్ ఆధార్ అందుబాటులోకి తెచ్చింది. ఈ ఆధార్‌ను ఎప్పటిలాగే గుర్తింపు కార్డు కింద వినియోగించుకునే అవకాశం ఉన్నప్పటికీ ఆధార్ నంబర్ మాత్రం గోప్యంగానే ఉంటుంది (Masked Aadhar).


మాస్క్డ్ ఆధార్ కార్డు అంటే ఏమిటి?

సాధారణ ఆధార్ కార్డు మీద వ్యక్తుల ప్రత్యేక గుర్తింపు సంఖ్య మొత్తం కనబడేలా ముద్రిస్తారన్న విషయం తెలిసిందే. కానీ, మాస్క్డ్ ఆధార్‌లో మాత్రం పూర్తి సంఖ్య కనబడదు. మొత్తం 12 అంకెల ఆధార్ సంఖ్యలో తొలి ఎనిమిది అంకెలు కనబడకుండా ఈ కార్డును జారీ చేస్తారు. దీంతో, ఇతరులెవరికీ పూర్తి ఆధార్ నెంబర్ తెలిసే అవకాశం ఉండదు. అదే సమయంలో ఈ కార్డును గుర్తింపు అవసరాల కోసం ఎప్పటిలాగే వినియోగించుకోవచ్చు.


మాస్క్డ్ ఆధార్ కార్డు ముఖ్య ఫీచర్లు ఇవే..

ఈ కార్డుతో వ్యక్తిగత వివరాల గోప్యత మరింత కట్టుదిట్టం అవుతుంది. ఇతరులెవరికీ ఆధార్ వివరాలు తెలిసే అవకాశం లేకుండా ఉంటుంది. ఫలితంగా ఆధార్ సంఖ్య దుర్వినియోగమయ్యే అవకాశాలు తగ్గిపోతాయి. ఆధార్ కార్డు, ఈఆధార్, ఎమ్ఆధార్ లాగే మాస్క్డ్ ఆధార్ కూడా పూర్తిగా చట్టబద్ధమైనది. దీన్ని తప్పనిసరిగా అమోదించాలి. ఇక మాస్క్డ్ ఆధార్‌ను యూఏడీఏఐ నుంచి సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.


మాస్క్డ్ ఆధార్‌ కార్డ్ ను ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..

ముందుగా https://uidai.gov.in/ వెబ్‌సైట్‌ను సందర్శించాలి.

ఇక్కడ కనిపించే మై ఆధార్ సెక్షన్‌లోని డౌన్‌లోడ్ ఆధార్‌పై క్లిక్ చేయాలి.

ఆ తరువాత 12 అంకెల ఆధార్ నంబర్ లేదా 16 అంకెల వర్చువల్ ఐడీని ఎంటర్ చేయాలి.

అనంతరం ప్రిఫరెన్స్ సెక్షన్‌లో మాస్క్డ్ ఆధార్‌ను ఆప్షన్‌ను ఎంచుకోవాలి

చివరిగా మొబైల్ ఓటీపీ వచ్చే ఆప్షన్‌ను ఎంచుకుని ఫోన్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయాలి

ఇలా అందుబాటులోకి వచ్చిన మాస్క్డ్ ఆధార్‌ను పీడీఎఫ్ ఫార్మాట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Comments

-Advertisement-