-Advertisement-

Free Aadhaar: ఉచిత ఆధార్ అప్డేట్ కు ఇదే చివరి ఛాన్స్.. మిగిలింది కొన్ని రోజులే!

Aadhar card update status Download Aadhar card Aadhar card mobile number update Aadhar Card check Myaadhar uidai.gov.in Aadhar card status Download
Peoples Motivation

Free Aadhaar: ఉచిత ఆధార్ అప్డేట్ కు ఇదే చివరి ఛాన్స్.. మిగిలింది కొన్ని రోజులే!

• ఆధార్ కార్డు వినియోగదారులకు ఫ్రీగా ఆధార్ అప్ డేట్..

• డిసెంబరు 14తో ముగుస్తున్న ఉచిత ఆధార్ అప్ డేట్ గడువు..

• ఇలా ఉచిత ఆధార్ అప్ డేట్ చేసుకోండి..

Aadhar card update status Download Aadhar card Aadhar card mobile number update Aadhar Card check Myaadhar uidai.gov.in Aadhar card status Download

మనం ఏ పని చేయాలన్నా ఆధార్ కార్డు ఉండాల్సిందే. అంత ఉపయోగకరమైన ఆధార్ కార్డులో ఒక్క చిన్న పొరపాటు ఉన్నా ముఖ్యమైన పనులు నిలిచిపోవచ్చు. ఈ నేపథ్యంలో ఆధార్ కార్డులో ఉన్న తప్పులను సరిదిద్దుకునేందుకు కేంద్రం అవకాశాన్ని కల్పించింది. డిసెంబరు 14లోపు ఉచితంగా ఆధార్ అప్డేట్ చేసుకునేందుకు కేంద్రం గడువు ఇచ్చింది. అంటే ఉచిత ఆధార్ అప్డేట్ కు ఇంకా వారం రోజుల సమయం మాత్రమే ఉంది. ఈలోగా ఆధార్ అప్డేట్ చేసుకోకపోతే ఆధార్ కేంద్రానికి వెళ్లి రూ. 50 చెల్లించి అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఆన్లైన్లోనే ఈజీగా ఆధార్ ను అప్డేట్ చేసుకోవచ్చు..


ఉచిత ఆధార్ అప్డేట్ కోసం ఇలా..

>> ఆధార్ కార్డును అప్ డేట్ చేసేందుకు మొదట ఉడాయ్ పోర్టల్ https://myaadhaar.uidai.gov.in/portal లోకి వెళ్లండి.

>> తర్వాత ఎంటర్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. మీ ఆధార్ నంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి, 'సెండ్ OTP' ఆప్షన్ పై ప్రెస్ చేయండి. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఓటీపీ వచ్చిన తర్వాత, దాన్ని నమోదు చేసి ఎంటర్ ఆప్షన్ పై క్లిక్ చేయండి.

>> పేరు లేదా చిరునామా వంటి మీరు అప్‌ డేట్ చేయాలనుకుంటున్న వివరాలు ఉన్న ఆప్షన్ ను ఎంచుకోండి. అందుకు సంబంధించిన కొన్ని డాక్యుమెంట్లను అప్ లోడ్ చేసి సబ్మిట్ ఆప్షన్ పై క్లిక్ చేయండి.

>> ఇలా సింపుల్గా ఆధార్ కార్డును ఉచితంగా అప్ డేట్ చేసుకుకోవచ్చు. అప్ డేట్ చేసిన ఏడు పనిదినాల తర్వాత అప్ డేట్ అయిన కొత్త ఆధార్ కార్డును పొందొచ్చు.

>> అయితే వేలిముద్రలు, ఐరిస్ స్కాన్‌లు, ఫొటోగ్రాఫ్‌ల వంటి బయోమెట్రిక్ అప్‌ డేట్‌ కోసం సమీపంలోని ఆధార్ కేంద్రాన్ని సందర్శించాలి.


అసలు ఆధార్ ఎందుకు అవసరం?

వివిధ ప్రభుత్వ సేవలను పొందడానికి ఆధార్ కార్డు తప్పనిసరి. అలాగే ఆధార్ గుర్తింపు కార్డుగానూ పనికొస్తుంది. అడ్రస్, వయసు నిర్ధరణ ప్రూఫ్ గా ఉపయోగపడుతుంది. అలాగే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి, అలాగే కేవీసీ ధ్రువీకరణకు ఆధార్ తప్పనిసరి. పాస్ పోర్టు, రెసిడెన్స్ సర్టిఫికెట్ కోసం ఆధార్ కార్డు ప్రూఫ్ గా ఉపయోగపడుతుంది. అలాగే ఆధార్ ఫేస్ అథెంటికేషన్ ద్వారా పెన్షనర్లు ఇంటి నుంచి వెళ్లకుండానే డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్లు లేదా జీవన్ ప్రమాణాలను రూపొందించుకోవచ్చు.


ఒకవేళ ఆధార్ కార్డు పోతే ఏం చేయాలి?

>> కొంతమంది అనుకోకుండా ఆధార్ కార్డును పోగొట్టుకుంటారు. అప్పుడు కొత్త కార్డును పొందేందుకు ఇలా చెయ్యాలి.

>> ముందుగా యూఐడీఏఐ అధికారిక వెబ్‌ సైట్‌ లో (https://uidai.gov.in) లాగిన్ అవ్వాలి. దాని తర్వాత వచ్చే విండోలో ఎన్రోల్‌ మెంట్ ఐడీ రిట్రైవ్(ఈఐడీ/యూఐడీ) అనే ఆప్షన్‌ పై క్లిక్ చేయాలి.

>> ఆ తర్వాత అడిగిన సమాచారాన్ని అందించి గెట్ ఓటీపీ అనే ఆప్షన్‌ పై క్లిక్ చేయాలి.

>> రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కు ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ నొక్కాలి.

>> దాంతో మీ ఆధార్ కార్డు ఎన్‌రోల్‌మెంట్ ఐడీ నంబర్ కంప్యూటర్ స్క్కీన్ పై కనిపిస్తుంది. దాంతో ఆధార్ కార్డును డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

అలాగే మీ ఆధార్ ఎన్లోర్మెంట్ ఐడీని పొందేందుకు హెల్ప్ లైన్ నంబరు 1947కి కాల్ చేయవచ్చు. అలాగే ఐవీఐర్ సిస్టమ్ ద్వారా కూడా ఆధార్ కార్డు ఎన్రోల్ మెంట్ నంబరును పొందొచ్చు.

Comments

-Advertisement-