అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పకడ్బందీగా పోలీసు కానిస్టేబుల్ నియామక దేహ ధారుడ్య పరీక్షలు ప్రారంభం
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పకడ్బందీగా పోలీసు కానిస్టేబుల్ నియామక దేహ ధారుడ్య పరీక్షలు ప్రారంభం
✅ పరీక్షలను పర్యవేక్షించిన కడప జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు ఐపియస్
పోలీసు నియామక పక్రియలో భాగంగా కడప ఉమ్మడి జిల్లా కు సంబంధించి కానిస్టేబుల్ ఉద్యోగాల ప్రాథమిక రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్ధులకు కడప నగర శివార్లలోని జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రం(డి.టి.సి) లో దేహదారుడ్య ( PMT, PET ) పరీక్షలు మొదటి రోజు ప్రారంభమయ్యాయి.
ఈ సంధర్బంగా సోమవారం డి.టి.సి లో కడప జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు ఐపియస్ దేహ ధారుడ్య సామర్థ్య పరీక్షలను ప్రారంభించి పర్యవేక్షించారు.
ఈ సంధర్బంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ..
పోలీసు కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షను పూర్తి చేసిన అభ్యర్ధులకు ఈ రోజు నుండి ఫిజికల్ మెజర్ మెంట్, ఫిజికల్ ఎఫిషియన్సి టెస్ట్ లు ప్రారంభమయ్యాయన్నారు. కడప జిల్లాలో 4,492 మంది అభ్యర్దులు పాల్గొంటున్నారన్నారు. ప్రతి రోజు 6 వందల మంది అభ్యర్దులు దేహ దారుడ్య పరీక్షలలో పాల్గొంటారని, ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను సిధ్దంగా ఉంచామన్నారు. ప్రతి రోజు అభ్యర్ధులకు మొదటగా సర్టిఫికెట్స్ పరిశీలన, ఎత్తు, ఛాతీ వంటి ఫిజికల్ మెజర్ మెంట్స్ చేస్తారు. తర్వాత బయోమెట్రిక్ తీసుకుంటారు. దేహదారుడ్య పరీక్షలలో భాగంగా 1600 మీటర్లు, 100 మీటర్లు, లాంగ్ జంప్ పరీక్షలు నిర్వహిస్తారన్నారు. దేహ దారుఢ్య పరీక్షల దగ్గర ఎక్కడ కూడా ఎలాంటి ఆరోపణలు, పొరపాట్లకు తావు లేకుండా ఆధునిక ఆర్.ఎఫ్.ఐ.డి కంప్యూటరైజ్డ్ టెక్నాలజితో పకడ్బందీ ఏర్పాట్లు చేశామన్నారు. డిజిటల్ గా, పారదర్శకంగా ఈవెంట్స్ నిర్వహిస్తున్నామన్నారు.
దేహాదారుడ్య పరీక్షలకు హాజరయ్యే అభ్యర్ధులు వెరిఫికేషన్ కోసం ఖచ్చితంగా ఒరిజినల్ ధువపత్రాలతో హాజరు కావాలని, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత జారీ చేసిన లేటెస్ట్ కుల దృవీకరణ సర్టిఫికెట్ , నాన్ క్రిమిలేయర్ సర్టిఫికెట్లు తీసుకురావాలన్నారు. వాటితో పాటు ఆధార్, స్టేజ్ -2, స్టడీ, మార్క్స్ లిస్ట్స్, అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్స్ మరియు జిరాక్స్ సర్టిఫికెట్లు అటెస్ట్ చేసినవి తప్పనిసరిగా తీసుకుని రావాలన్నారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) కె.ప్రకాష్ బాబు, ఎఆర్ అడిషనల్ ఎస్పీ బి.రమణయ్య, డి.ఎస్.పిలు, సి.ఐలు, ఆర్.ఐలు, ఎస్సైలు, ఆర్.ఎస్సైలు, ఐ.టి కోర్ టీమ్, డిపిఓ కార్యాలయ సిబ్బంది ఉన్నారు.