పలు పోలీస్ స్టేషన్ ల పరిదిలో దొంగతనాలు ముద్దాయి అరెస్టు
General News telugu latest news telugu intresting news telugu intresting facts
Job news health news TS TET TS DSC AP TET AP DSC SSC jobs ap govt news
By
Peoples Motivation
పలు పోలీస్ స్టేషన్ ల పరిదిలో దొంగతనాలు ముద్దాయి అరెస్టు
నంద్యాల జిల్లా SP అధిరాజ్ సింగ్ రాణా IPS ఆదేశాలమేరకు, నంద్యాల SDPO శ్రీనివాస రెడ్డి ఆద్వర్యంలో నంద్యాల తాలూకా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ R.ఈశ్వరయ్య,CCS ఇన్స్పెక్టర్ సురేష్ కుమార్, SI S.గంగయ్య యాదవ్ మరియుCCSసిబ్బంది HCs.చంద్ర శేఖర్, ఇబ్రాహిం,యేసుదాసు PCs గంగారం, మద్దిలేటి, వెంకటేశ్వర్లు, నాగరాజు మాలిక్ బాష, ఇస్మాయిల్ లు 2016 వ సంవత్సరము నుండి ఇప్పటి వరకు నంద్యాల జిల్లా మరియు గుంటూరు జిల్లా పోలీసు స్టేషన్ల పరిధిలలో దొంగతనాలు దోపిడులు గ్యాంగ్ రేప్ లకు పాల్పడుతు పోలీసులకు దొరకకుండా తప్పిoచుకొని తిరుగుతున్న గడివేముల మండలము కరిమద్దెల గ్రామమునకు చెందిన చెంచు దాసరి సుంకన్న @ తోల్లోడు S/o చెంచు దాసరి ఎఱ్రన్న@ నట్టన్న, వయస్సు: 42సం: నారపురెడ్డి కుంట గ్రామము, బండి ఆత్మకూర్ మండలము అను అను అతనిని ఈ దినము అనగా 30.12.2024 వ తేదిఉదయము 11.00 గంటల సమయములో నంద్యాల జిల్లా, నంద్యాల మండలము,ఆటొ నగర్ వద్ద అదుపులోకి తీసుకొని అతని వద్ద నుండి 3 తులముల బంగారు నల్ల పూసల దండ, ఒక జత కమ్మలు, వాటి బరువు సుమారు 8 గ్రాములుఉండినవి.వాటి విలువ సుమారు Rs2,50,000/- సీజ్ చెయ్యడమైనది. ముద్దాయి పారి పోవు క్రమములో ముద్దాయి మరియు నంద్యాల తాలూకా HC-339 డి. సామి నాయక్ క్రిందపడి ఇద్దరికీ ఎడమచేతికి వాపుడు గాయములు అయినవి, సదరు ముద్దాయి మరియు అతని అనుచరులతో కలిసి నంద్యాల చుట్టూ పక్కల గ్రామములలో రాత్రి సమయములలో దొంగతనములకు, దోపిడీలకు పాల్పడుతూ, వచ్చిన సొమ్మును సమానముగా పంచుకొనేవారు వీరు గతంలో నంద్యాల జిల్లా లోని నంద్యాల తాలూకా, పాణ్యం, మహానంది, పాములపాడు మరియు బండిఆత్మకూర్ పోలీస్ స్టేషన్ పరిదిలలో సుమారు 11 దొంగతనం,2 దోపిడి కేసులలో మరియు గుంటూరు జిల్లాలో కూడా 2 దారి దోపిడి, ఒక గ్యాంగ్ రేప్ చేసినారు, ఇతనితో పాటు గుంటూరు జిల్లాలో దారి దోపిడి, గ్యాంగ్ రేప్ చేసిన (1) ఆకుల లింగమయ్య, (2) దాసరి ఓబులేసు (3) దాసరి లింగమయ్య (4) ఇండ్ల రమణ లకు మేడికొండనురు పోలీసు స్టేషన్ పరిధిలో యావజ్జీవ శిక్ష పడినదని,ఈదలపాడు పోలీసు స్టేషన్ పరిధిలో రెండు కేసులలో ఒక్కొక్క కేసులో7 సంవత్సరముల శిక్ష పడింది,ఇతను ఎవరికి దొరకాకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు.
ఈ సందర్బంగా కర్నూల్ DIG కోయ ప్రవీణ్ కుమార్, నంద్యాల జిల్లా SP అధిరాజ్ సింగ్ రాణా IPS, నంద్యాల Addl.SP యగంధర్ బాబు నిందితుని అరెస్ట్ లో కీలక పాత్ర పోషిoచిన పోలీస్ అధికారులను మరియు వారి సిబ్బందిని ప్రత్యేకముగా అభినందించడమైనది.
Comments