రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

ఫిజికల్ ఈవెంట్స్ కు వచ్చే అభ్యర్థులు ఈ విధంగా ఒరిజినల్ మరియు జిరాక్స్ కాపీ లను తప్పనిసరిగా తీసుకురండి

General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET AP DSC SSC jobs ap govt news
Peoples Motivation

ఫిజికల్ ఈవెంట్స్ కు వచ్చే అభ్యర్థులు ఈ విధంగా ఒరిజినల్ మరియు జిరాక్స్ కాపీ లను తప్పనిసరిగా తీసుకురండి

• పోలీసు ఉద్యోగాల నియామకం విషయంలో దళారుల మాటలు నమ్మి మోసపోకండి

• ఏ ప్రభుత్వ ఉద్యోగమైనా... రిక్రూట్మెంట్లు అయినా పారదర్శకంగా నిర్వహిస్తారని గుర్తించాలి

• మోసగాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండండి.

• నిష్పక్షపాతంగా, పారదర్శకంగా పోలీసు కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలు

• డిసెంబర్ 30 నుండి ఫిబ్రవరి 1 వ తేది వరకు పోలీసు కానిస్టేబుల్ ఈవెంట్స్.

AndhraPradesh APPolice AndhraPradeshStatePolice AndhraPradeshPolice TirupatiPolice General News telugu latest news telugu intresting news telugu

కర్నూలు, డిసెంబర్ 28 (పీపుల్స్ మోటివేషన్):-

 మోసగాళ్లు, దళారుల పట్ల అప్రమత్తంగా ఉంటూ మోసాల బారిన పడవద్దని కర్నూలు జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ ఐపియస్ కానిస్టేబుల్ అభ్యర్థులకు శనివారం తెలిపారు.

ఎవరైనా మోసాలకు పాల్పడితే కఠినంగా చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ హెచ్చరించారు.

   దళారులు/ మోసగాళ్లు ఎవరినైనా సంప్రదిస్తే డయల్ - 100 కు గాని లేదా సమీపంలోని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలన్నారు. 

  ఫిర్యాదు చేసిన లేదా సమాచారం అందించిన వ్యక్తుల వివరాలు గోప్యంగా ఉంచుతామని ఎస్పీ పేర్కొన్నారు. 

అభ్యర్ధులు వారికి కేటాయించిన నిర్ణీత సమయాలలో మాత్రమే ఉదయం 5 గంటల నుండి 10 గంటల లోపు కర్నూలు ఎపిఎస్పీ 2 వ బెటాలియన్ లోకి చేరుకోవాలన్నారు. 

 దేహదారుడ్య పరీక్షలకు హాజరయ్యే కానిస్టేబుల్ అభ్యర్థులకు జిల్లా ఎస్పీ పలు సూచనలు చేశారు. 

 ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు 2 సెట్ల జిరాక్స్ కాపీలు అటెస్ట్ చేసినవి తీసుకురావాలన్నారు. 

 రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత జారీచేయబడ్డ కుల ధ్రువీకరణ పత్రం, క్రీమి లేయర్ ధ్రువీకరణ పత్రం తీసుకురావాలన్నారు. 

ఇప్పటికే అభ్యర్థులకు హాజరకావాల్సిన తేదీ, సమయం కు సంబంధించి హాల్ టికెట్ లను ఆన్ లైన్ లో ఉంచడం జరిగిందన్నారు.

 కేటాయించిన తేదీ, సమయానికి అభ్యర్థులు తప్పనిసరిగా హాజరు కావాలన్నారు.

 నాలుగో తరగతి నుండి పదో తరగతి వరకూ స్టడీ సర్టిఫికెట్లను తప్పనిసరిగా తీసుకురావాలన్నారు.

ఒకవేళ అభ్యర్థులు ప్రైవేట్ గా చదివి ఉంటే నోటిఫికేషన్ తర్వాత జారీ చేయబడ్డ రెసిడెన్స్ సర్టిఫికెట్ ను తీసుకురావాలన్నారు. 

 కర్నూలు ఉమ్మడి జిల్లాలో మొత్తం 10,143 మంది అభ్యర్థులు హాజరవుతున్నారన్నారు.

 ప్రతి రోజు 600 మంది అభ్యర్దులు హాజరుకానున్నారు.

 దేహదారుఢ్య పరీక్షలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను ఇప్పటికే కర్నూలు జిల్లా పోలీసు యంత్రాంగం తరఫున చేసినట్లు జిలా ఎస్పీ తెలిపారు. 

 దేహ దారుడ్య పరీక్షలకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నట్లు, పరీక్షలు నిర్వహించే ప్రదేశాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులు మైదానంలోకి ప్రవేశించినది మొదలుకుని, వారు దేహదారుఢ్య పరీక్షలు ముగించుకుని మైదానం నుండి తిరిగి వెళ్ళే వరకూ వారికి అర్థమయ్యే రీతిలో ప్రతి పరీక్ష ఘట్టాన్ని సూచించే విధంగా సూచిక బోర్డులను ఏర్పాటు చేయడమైనదన్నారు.


👉 దేహదారుఢ్య పరీక్షలకు వచ్చే అభ్యర్థులకు సూచనలు :-

✓ దేహదారుఢ్య పరీక్షలకు వచ్చే అభ్యర్థులు తమతో పాటుగా ఈ క్రింది తెలిపిన ఒరిజినల్ సర్టిఫికేట్ లతో పాటు ఒక సెట్ అటెస్టడ్ జిరాక్స్ కాపీలను తప్పనిసరిగా సమర్పించవసినదిగా తెలియచేయడమైనది.

✓ ఒరిజినల్ సర్టిఫికట్ లు సమర్పించని యెడల వారి యొక్క అభ్యర్దిత్వం తిరస్కరించబడును మరియు వారికి సమయము ఇవ్వబడదు.

1) అభ్యర్థుల ఎస్స్సీసీ మరియు ఇంటెర్మీడియట్ ఒరిజినల్ మార్క్స్ లిస్ట్.

2) డిగ్రీ మార్క్స్ లిస్ట్, ప్రొవిజినల్ లేదా ఒరిజినల్ డిగ్రీ సెర్టిఫికేట్.

3) ఇటీవల తీసుకున్న కుల దృవీకరణ పత్రము. కమ్యునిటీ సర్టిఫికేట్(6 నెలలలోపు తీసుకుని ఉండాలి).

4) బిసి అభ్యర్ధులు క్రిమి లేయర్ సెర్టిఫికేట్లను తప్పకుండ తీసుకుని రావాలి(నోటిఫికేషన్ విడుదల తేదీ తరువాత మాత్రమే తీసుకోవాలి).

5) 4వ తరగతి నుండి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్స్.

6) ఒరిజినల్ ఎన్సీసీ, ఆర్మీ , నేవీ మరియు ఎయిర్ ఫోర్స్ సెర్టిఫికేట్ లు ఏ,బి,సి సర్టిఫికేట్స్. సర్వీస్ సర్టిఫికేట్లు.

7) ఒరిజినల్ ట్రైబ్ సర్టిఫికేట్లు/ ఏజెన్సీ ఏరియా సర్టిఫికేట్.

8) తీవ్రవాదులు/సంఘ విద్రోహుల దాడిలో చనిపోయిన పోలీస్ సిబ్బంది పిల్లలకు సంబంధించిన సర్టిఫికేట్.

9) చిల్డ్రన్ ఆఫ్ పోలీస్ పర్సనల్ సర్టిఫికేట్ (ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ర్యాంక్ లోపు అధికారుల పిల్లలకు మాత్రమే).

10) ఎక్స్ సర్విస్ మెన్ సర్టిఫికేట్(సర్విస్ బుక్ తో పాటు), మెరిటోరియస్ స్పోర్ట్స్ సర్టిఫికేట్.

11) కాల్ లెటర్ లో తెలిపిన స్కోరు కార్డ్ (ఒరిజినల్ రిజల్ట్). 

12) స్టేజ్-1 అప్లికేషన్ మరియు స్టేజ్-II అప్లికేషన్ లను తప్పనిసరిగా తీసుకొని రావాలి.

 ఎవరైనా ఉద్యోగాలు ఇప్పిస్తామని, డబ్బులు ఇవ్వమని ప్రచారం చేసే వారి యొక్క సమాచారాన్ని డయల్ 100 కు గాని / డయల్ 112 గాని లేదా స్థానిక పోలీసు వారికి లేదా కర్నూలు జిల్లా పోలీసు వాట్సప్ నెంబర్ 7777877722 లేదా 9121101100 కు తెలియ జేయస్తే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని, సమాచారం అందించిన వారి యొక్క వివరాలను గోప్యంగా ఉంచుతామని జిల్లా ఎస్పీ తెలిపారు.

Comments

-Advertisement-